1) ప్రస్తుత ముఖచిత్రం – మోదుగు పూలు

వేసవి వచ్చిందంటే చాలు మా ఊరికి నలువైపులా పరుచుకున్న మోదుగు పూలు కనువిందు చేస్తాయి. అసలు మోతుకూరు (మోదుగూరు) అనే పేరు మోదుగు చెట్ల నుండే వచ్చిందని నాకెప్పుడూ అనిపిస్తుంది.

మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కల్పవృక్షాల్లో మోదుగు చెట్టును ప్రముఖంగా చెప్పుకోవాలి. మోదుగు చెట్ల ఆకులతో విస్తరాకులు కుడతారు. దాని కాండం నుండి స్రవించే జిగురును వివిధ ఉత్పత్తుల్లో, తోలుశుద్ధికీ వాడతారు. మోదుగు పూలనుండి సహజసిద్ధమైన రంగును తయారు చేస్తారు. వేళ్ల నుండి వచ్చే నారతో తాళ్లు పేనుతారు.

ఇంగ్లీషులో మోదుగు చెట్టును Flame of the Forest అని అంటారు.

2) నవంబర్ 2008 ముఖచిత్రం – పోలేపల్లి చిన్నారులు

polepally-kids

మధ్యాహ్న భోజనం కొరకు వరుసలో నిలబడ్డ పోలేపల్లి సెజ్ బాధిత రైతుల పిల్లలు వీళ్లు.

దళిత, గిరిజన రైతుల నుండి కారుచౌకగా 1000 ఎకరాల భూమిని లాక్కుని అదే భూమిని లక్షల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మన రాష్ట్రప్రభుత్వ నిర్వాకానికి రోడ్డునపడ్డ చిన్నారులు వీళ్లు. పోలేపల్లి సెజ్ బాధిత రైతుల పోరాటంపై పూర్తి వివరాల కొరకు: http://polepally.wordpress.com చూడండి.

3) 2008 జనవరి ముఖచిత్రం – బ్రతుకమ్మ పండుగ

batukamma-icon

ప్రకృతితో మనిషికి గల అనుబంధాన్ని ఆవిష్కరించే అతి కొద్ది పండుగల్లో బతుకమ్మ ఒకటి. దసరా పండుగకు రెండు రోజుల ముందొచ్చే ఈ పండుగ తెలంగాణా వాసులకు అతి ప్రీతిపాత్రమైనది. ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు బతుకమ్మ పాటల రూపంలో వెల్లడవుతుంటాయి.

4) 2007 ముఖచిత్రం – తంగేడు పువ్వులు

 

 

తంగేడు పువ్వులు – దక్షిణ భారత దేశమంతటా కనిపించే తంగేడు చెట్టుకు [Cassia Auriculata] తెలంగాణా ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దసరాకు ముందొచ్చే బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వులను ఎక్కువగా వాడుతారు. తంగేడు చెట్టులో ఇతర భాగాలు కూడా ఎంతో ఉపయోగపడుతాయి. తంగేడు పుల్లలు పళ్లు తోముకోవడానికి, ఆకులు పచ్చి రొట్ట ఎరువుగా, కొమ్మలు వంట చెరకుగా ఉపయోగిస్తారు. ఈ బెరడును తోళ్ల శుద్ధి పరిశ్రమలో విస్తృతంగా వాడుతారు. అంతే కాదు ఆయుర్వేదంలో ఈ చెట్టు వేర్లతో, ఆకులతో ఎన్నో చిట్కా వైద్యాలు చేస్తారు.

ప్రకటనలు

1 Response to “ముఖచిత్రం”


  1. 1 సాంబశివరావు కాకాని 11:18 ఉద. వద్ద మే 16, 2012

    సత్య మేమిటంటే నిజాలకు ఒకరి వ్యాఖ్యానాలు,పొగడ్తలు అవసరం లేదు.
    అంతే కాదు ఎవరి సమర్ధింపు అక్కర లేదు. ఎందుకంటె అవి సత్యం కాబట్టి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 94,532 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: