తెలంగాణ గడ్డ నిను మరవదు బిడ్డా!

డిల్లీలోనే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేద్దామనే కుట్ర బట్టబయలు కావడంతో యాదిరెడ్డి భౌతికకాయాన్ని 
హైదరాబాద్ తరలించిన రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా తన కుయుక్తులు ప్రదర్శిస్తూనే ఉంది. 

శంషాబాద్ ను నాలుగు వేలమంది మంది పోలీసు పారామిలిటరీ బలగాలతో దిగ్బందించి, దొంగల్లాగా యాది రెడ్డి 
మృతదేహాన్ని ఎత్తుకుపోయారు పోలీసులు. దొంగ దారుల్లో తిప్పుకుంటూ స్వగ్రామం చేర్చారు. ఆ సమయంలో
పెద్ద మంగళారం గ్రామంలో కొద్దిసేపు కరెంటు తీసివేశారు. 

రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులపై వత్తిడి చేశారు. రేపు ఉదయం అంత్యక్రియలు 
నిర్వహించుకుంటాం, అందులో మీ జోక్యం అనవసరం అని కుటుంబసభ్యులు స్పష్టం చేయడం, అప్పటికే భారీ 
సంఖ్యలో తెలంగాణా ప్రజలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వెనకకు తగ్గారు.

--

యాదిరెడ్డి భౌతికకాయం నిన్న రాత్రి స్వగ్రామం పెద్ద మంగళారం తీసుకువచ్చినప్పటి దృశ్యం:

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: