ఒకటి ప్రజా ఉద్యమం – మరొకటి కృత్రిమ ఉద్యమం

ఒకటి తెలంగాణ ప్రజా ఉద్యమం

గత డిసెంబర్ 9 నాడు కేంద్ర హోం మంత్రి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంబిస్తున్నాం అని చేసిన ప్రకటనకు ఏడాది నిండిన సందర్భాన్నిపురస్కరించుకుని డిసెంబర్ 16 నాడు ఓరుగల్లులో “తెలంగాణ మహా గర్జన” బహిరంగ సభ జరిగింది. ఇరవై లక్షల పైచిలుకు ప్రజలు హాజరైన ఈ సభ నభూతో నభవిష్యతి. తెలంగాణా గుండెల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మరోసారి చాటి చెప్పింది. ఆ సభ మీడియా కవరేజి కింద చూడండి: [click on image to see full size image)

మరొకటి కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమం…

గత డిసెంబర్ 9 నాడు కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగానే అప్పటిదాకా మోసపు మాటలతో పొద్దుపుచ్చిన సీమాంధ్ర నేతలు మొదలుపెట్టిన కృత్రిమ ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి ఒక స్వంత కార్యాచరణ ఏమీ లేదు. తెలంగాణా ప్రజలు చేసే ప్రతీ ఆందోళననూ కాపీ కొట్టడమే వీరి పని.

ఇక్కడ జే.ఏ.సీ ఏర్పాటు చేస్తే అక్కడా జే.ఏ.సీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడొక ప్రొఫెసర్ ను జే.ఏ.సీ కన్వీనర్ గా చేస్తే అక్కడ కూడా ప్రొఫెసర్ నే కన్వీనర్ గా చేస్తారు. ఇక్కడి యూనివర్సిటీ విద్యార్ధులు ఏ ఏ ఆందోళనలు చేస్తే అక్కడి యూనివర్సిటీ విద్యార్ధులు కూడా అవే ఆందోళనలు చేస్తారు. ఉస్మానియా విద్యార్ధులు పాదయాత్ర చేస్తే అక్కడి విద్యార్ధులూ పాదయాత్రే చేస్తారు.

ఇక అన్నిటికన్నా వింతగా మొన్న డిసెంబర్ 16 నాడు వరంగల్ లో తెలంగాణ మహా గర్జన సభ నిర్వహిస్తే సమైక్యాంధ్ర ఉద్యమకారులు కూడా “సమైక్యాంధ్ర గర్జన” నిర్వహించారు.

ఈ సభ వార్తను ఏ తెలుగు దిన పత్రికలో చూసినా కేవలం సభా వేదిక ఫొటోనో, లేక ప్రధాన వక్త ఫొటోనో వేశారు కానీ వచ్చిన జనం ఫొటోలు లేవు. అరె! ఇంత పెద్ద సభ జరిగితే కవరేజ్ లేదేమిటి అని కొంచెం వెతుక్కుంటే వెళితే బండారం బయటపడింది.

సూర్య పత్రిక ఒంగోలు జిల్లా టాబ్లాయిడ్లో సభకు హాజరైన “జనం” ఫొటొలు వేశారు.

ఒంగోలులోని మునిసిపల్ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన ఈ గర్జనలో 2000 మంది (అవును రెండు వేలే) స్కూలు, కాలేజీ (అవున్నిజమే స్కూలు  విద్యార్ధులు) పాల్గొన్నారు. ఆ సభ మీడియా కవరేజ్ కింద: [click on image to see full size image)

కడుపు మండిన వారి ఉద్యమానికీ, కడుపు నిండిన వారి ఉద్యమానికీ తేడా ఇదీ!

నిజమైన ప్రజా ఉద్యమానికీ, గుప్పెడు మంది పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడిచే కృత్రిమ ఉద్యమానికీ తేడా ఇదీ!

అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: