ఇది గర్హనీయం!

నలమోతు చక్రవర్తి గారు ఇంగ్లీషులో రాసిన మై తెలుగు రూట్స్ (My Telugu Roots)  పుస్తక తెలుగు అనువాదం “మన తెలుగు తల్లి” ఆవిష్కరణ ఇవ్వాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరుగుతుండగా కొంతమంది తెలంగాణా అమరవీరుల కుటుంబాల వారు, తెలంగాణావాదులు అడ్డుకున్నారని తెలిసింది.

తెలంగాణా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ సమయంలో నలమోతు గారు ఇటువంటి కార్యక్రమం పెట్టుకోవడం సబబు కాదు. దేనికైనా సమయము సందర్భము ఉండాలని బాబు గారి బాబ్లి ప్రహసనం సందర్భంగా గుర్తు చేసాను. తెలంగాణా ప్రజలు తమ అభీష్టాన్ని చాలా స్పష్టంగా ప్రకటించిన ఈ తరుణంలో, యువత ఆత్మాహుతులకు పాల్పడుతున్న ఈ సమయంలో “తెలంగాణా వాదం భస్మాసుర హస్తం” అంటూ రెచ్చగొట్టే టైటిల్ తో తెలంగాణా నడిబొడ్డున ఈ పుస్తకం విడుదల చేయబూనడం సీమాంధ్ర దురహంకారానికి నిదర్శనం.

తెలుగు జాతి ఐక్యత గురించి ఇంగ్లీషులో రాసిన My Telugu Roots పుస్తకం నిండా 70 కాపీలు అమ్మలేదు. ఇక లాభం లేదనుకుని ఒక అనువాదకునికి డబ్బులు ఇచ్చి అనువాదం చేయించి విడుదల చేస్తున్నారు నలమోతు గారు. పుస్తక ఆవిష్కరణ సభలో హల్ చల్ చేయడం ద్వారా ఆయన పుస్తకానికి ఉచిత ప్రచారం మనమే కల్పించిన వాళ్ళం అవుతాం. తెలుగులో సరిగ్గా నాలుగు మాటలు మాట్లాడలేని, రాయలేని నలమోతు చక్రవర్తి నేతృత్వంలో జరుగుతున్న ఈ APNRI వారి “సమైక్యాంధ్ర” ఉద్యమం ఒక బూటకం

తెలంగాణా వాడిని అంటూ ఆయన చెప్పిన మాటలు ఎంత మోసపూరితమో, తెలంగాణా వాదులు అబద్ధాలు చెబుతున్నరనే ఆయన రాతల్లో నిజాలెంతో, ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ఉన్న ముసుగు వీరులు ఎవరో వివరిస్తూ ఇటీవలే ఒక బ్లాగు మొదలు పెట్టాను. వివరాలు ఇక్కడ చూడండి. – http://myteluguflowers.wordpress.com/

ఆయన రాసిన పుస్తకంలో అనేక తప్పులు, అబద్ధాలు ఉన్న మాట వాస్తవం. కాని ఇలా పుస్తకాల ను అడ్డుకోవడం సమర్ధనీయం కాదు.

ఈ పుస్తకంలో తెలంగాణా ఉద్యమాన్ని కించపరుస్తూ రాసిన మాట నిజమే. భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఆ రాతలు చూసి తమ పిల్లలను కోల్పోయిన అమరవీరుల కుటుంబాల వారు ఆగ్రహించడం సబబే.  కానీ పుస్తకానికి జవాబు పుస్తకమే కావాలి కాని ఇలా చేయడం సరికాదు.

ఇది తెలంగాణా ఉద్యమానికి శోభనిచ్చే చర్య కాదు.

ప్రకటనలు

13 Responses to “ఇది గర్హనీయం!”


 1. 2 తార 12:55 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  మరీ గుండా గిరి ఐపోతున్నది. వాక్ స్వాతంత్ర్యం కుడా లేకుండా..
  తస్లిమా నస్రిన్, ఇప్పుడు ఇది,… హైదరాబాదా? రౌడి రాజ్యమా?
  తెలుగు బాష, తెలంగాణా లో కుడా తెలుగే కదా మాట్లాడుతున్నది

 2. 3 తెలుగు వాడు 3:52 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  అబ్బా ఈ సంఘటన ఒక్కటే….చెప్పుకుంటే బోలెడున్నాయి. కాకపోతే బలవంతంగా తెలంగాణా నినాదాలిప్పించడం, సినిమా షూటింగ్ లు అడ్డుకోవడం, వీటన్నింటికీ ఉద్యమం కోసమే అని మీరు పేరు పెట్టుకున్నారు. నిజానికి ఇంత మూర్ఖమైన చర్యలు ఎక్కడా చూడలేదు.

 3. 4 satya 5:33 సా. వద్ద ఆగస్ట్ 5, 2010

  నేను చెప్పింది అదే.. పుస్తకాలు ఎప్పుడు విడుదల చెయ్యాలో వేర్పాటు వాదులని అడగాలా? లేక వారి అనుమతి కావాలా? తెలుగు జాతి ఐక్యతని కోరితే ఇంగ్లిష్ లో వ్రాయకూడాద? మరి ప్రత్యేక తెలంగాణ కోరే మీరు తెలంగాణ యాస (అదే, బాష) లో ఎందుకు వ్రాయట్లేదండి? ఎక్కడో ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వాదులు అక్కడ పౌరసత్వం తీసుకొని TDF అంటూ వేర్పాటు ఉద్యమాలు నడపగా లేనిది మన జాతి ఐక్యత కోసం ఇక్కడకి వచ్చి నెలల పర్యంతం తిరిగి, కాలం, డబ్బు వెచ్చించి పుస్తకం వ్రాస్తే, కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా ఎందుకీ విమర్శలు? మీకు తెలీదనుకుంటా.. ఈ పుస్తకం ఎప్పటినించో http://www.flipkart.com లో లభ్యమౌతుంది. రూపాయల్లోనే కొనుక్కోవచ్చు. అనవసరం గా ప్రయాస పడ్డారు.

  ఆయనేమి రచయిత కాదు. పుస్తకానికి ఒక ప్రత్యేక వ్యక్తీకరణ అవసరం కాబట్టే అది వేరే వారిచేత అనువదింపచేసారు. ఇందులో తప్పు పట్టేదేంటో అర్ధం కావట్లేదు.

 4. 5 satya 7:36 సా. వద్ద ఆగస్ట్ 5, 2010

  btw.. the link you have given of hindu business online is of Dec 18.

  Here is the link of Dec 23

  http://www.thehindubusinessline.com/2009/12/24/stories/2009122451210200.htm

  so, can I assume it as a deliberate ignorance or distortion of facts?

 5. 6 Konatham Dileep 5:34 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  విజయ్ గారు,

  తెలంగాణా ఉద్యమంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలే సమైక్యాంధ్ర ఉద్యమం లోను జరిగాయి. ఒకరు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కారు. ఈ విషయం ఎత్తి చూపాలనేదే నా ఉద్దేశ్యం. అసలు ఏ ఉద్యమం అయినా ముందు శాంతియుతంగానే మొదలవుతుంది. కొన్ని ఏళ్ళు గడిచినా ప్రభుత్వాలు స్పందించనప్పుడు మాత్రమే అవి హింసాత్మకం అవుతాయి.

  పదేళ్ళ పాటు శాంతియుతంగా తెలంగాణా ఉద్యమం జరిగింది. అది మీరంతా చాలా కన్వీనియంట్ గా మర్చిపోతారు. అదే సమైక్యాంధ్ర ఉద్యమం చూడండి. మొదలవ్వడమే హింసాత్మకంగా మొదలయ్యింది.

  అన్నట్టు మీకు గుర్తుందో లేదో. పొట్టి శ్రీ రాములు గారు ఆత్మా త్యాగం చేసారని ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఆ తదనంతరం ఆంద్ర ప్రాంతం మొత్తం భగ్గున మండితే కానీ, లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయితే కానీ ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు కాలేదు. (ఇంత చేసి పొట్టి శ్రీ రాములు గారి ప్రధాన డిమాండ్ అయిన మద్రాస్ నగరం దక్కనే లేదు)

  కాబట్టి సోదరా, మన ప్రభుత్వాలు ఏం చేస్తే “దారికొస్తాయో” 57 ఏళ్ళ క్రితమే ప్రజలకు అర్థం అయ్యింది.

  ప్రభుత్వాలు శాంతియుత అందోళనలకు, ఉద్యమాలకు స్పందించనంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. అదే మన దౌర్భాగ్యం!

 6. 7 Konatham Dileep 5:47 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  1) కాస్త ఆవేశం తగ్గించుకోండి. Flipkart వారు పుస్తకం అమెరికా నుండి “దిగుమతి” చేసుకుని అమ్ముతున్నారు.

  2) పుస్తకం ఎప్పుడు విడుదల చేయాలో ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. కాస్త బుర్ర ఉపయోగిస్తే చాలు.

  3) నేను ఆయన ప్రస్తావన తెచ్చింది ఎందుకో మీకు బహుశా అర్థం కాలేదనుకుంటా.

  విజయ్ గారు – ఒక వేళ తెలుగు వారంతా ఆయనలాగా వేరే దేశాల్లో స్థిరపడితే తెలుగు జాతి కేమవుతుందో ఆలోచించండి 🙂

  ఏమి కాదు!

  ఎందుకంటే తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంలో ఉన్నారా లేరా అన్నదాన్ని బట్టి తెలుగు జాతి భవిష్యత్తు ఉండదు. ఒక వేళ నలమోతు గారి వాదన నిజమైతే తెలుగు జాతికి అతి పెద్ద ప్రమాదం దేశాన్ని విడిచి పెట్టి వెళ్తున్న వారి వల్లే వస్తుంది.

 7. 8 Konatham Dileep 5:50 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  Thanks for the info. I have never distorted any facts. I have just written about the event that has happened on that day. Just that a follow up event has happened does’t mean the initial event did not happen.

 8. 9 Konatham Dileep 6:01 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  “తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టారని కాసు బ్రహ్మానంద రెడ్డి చెప్పారా? ఇంతకన్న అబద్దం వుందా?”

  బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల నుండి స్థానికేతరులను బదిలీ చేయడానికి జీవో 36 విడుదల చేసింది. అది కేవలం టీచర్లకు సంబంధించినది కాదు. ఇక 610 జీవో అన్ని ప్రాంతాలకు సంబంధించినది అని మీరు చెప్తేనే తెలుసుకునే పరిస్థితిలో తెలంగాణావాదులు లేరు. అది కేవలం తెలంగాణాకు సంబంధించిందని అనుకునే వారు సమైక్యాంధ్ర వాదులు. మేము కాదు.

 9. 10 satya 7:54 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  How do you say that you haven’t distorted facts? you have just given a link that came in the media when the company’s official site has no such information. Also your statement in that blog appears it is united AP movement that caused the loss. people who dont follow-up or who dont go thru the other side of the story can easily be mislead. So, my advice is to double check the facts when you are writing something. may be u r ignorant of the follow-up events or no time to confirm the news as u r in a hurry to attach the loss to united AP movement, u cant say the facts are distorted. whether u did or not is doesnt matter

 10. 11 satya 8:51 ఉద. వద్ద ఆగస్ట్ 6, 2010

  దిగుమతి చెసి అమ్ముతున్నారా, ఇక్కడ ముద్రించారా అనేది అప్రస్తుతం. మీకు రూపయల్లో లభ్యమవుతుని కదా.. అదీగాక flipkart కేవలం 20-30 రోజుల్లో మీ ఇంటికే డెలివరీ చేస్తుంది. కాబట్టి తెలుగు జాతి పుస్తకం సప్తసముద్రాల అవతల, డాలర్లలో, తెలుగు రాని వ్యక్తి అనే వ్యంగం అనవసరం అని భావిస్తాను. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అని, స్వేచ్చ ని కోరుతున్న వాళ్ళు అవతలి వాళ్ళ స్వేచ్చ ని అడ్డుకోకూడదని కూడా బుర్ర ఉపయోగిస్తే అర్ధమయ్యే విషయాలే.

  పదేళ్ళపాటు సమైక్య వాదులు సమ్యయమనం తో ఉన్నారని నేను అనుకుంటున్నా. అసత్య ప్రచారాలు జరుగుతున్నా, పదే పదే ఒక ప్రాంతాన్ని నిందించి తర్వాత దానికి వింత భాష్యాలు చెప్తున్న వారు మౌనంగానే వున్నారు.జయశంకర్, హరగోపాల్ లాంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ వాదాన్ని వినిపించినప్పుడు కూడా వారేమి దాడులకి దిగలేదు. కాబట్టి చూసే దృష్టి ని బట్టి ఉంటుంది మాష్టారు. వారి వైపు వాదన వినకుండా కేవలం ఒకవైపు అభిప్రాయాలు చెప్పి, వాళ్ళని పూర్తిగా విస్మరించారు కాబట్టే అక్కడ ఉద్యమం ఉదృతమైంది. అదే అక్కడ వారి వాదనలు వినటానికి ఒక కమిటీ ని ఏర్పరచారు కాబట్టి మళ్ళీ పరిస్థితులు మాములు కి వచ్చాయి. అదే తెలంగాణ వాదుల పిడివాదం చూడండి. రెండవ వైపు అభిప్రాయాలు తీసుకోకూడదు, కమిటి ని బహిష్కరిస్తున్నాం అంటూ ఉద్యమ వేడి చల్లారకుండా, వ్యక్తులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. లగడపాటి NIMS కి వచ్చినా, జగన్ ఓదార్పు యాత్ర చేసినా, చక్రవర్తి లాంటి వారు పుస్తకావిష్కరణ చేసినా, చంద్రబాబు ధరల పెరుగుదల పై ధర్నా నిర్వహించినా అనవసరం గా అడ్డుకొని దాడులకి దిగింది తెలంగాణ వేర్పాటు వాదులే. ఇందులో సందేహమే లేదు. ఇది మీరు కప్పిపుచ్చి ఎన్ని విచిత్రార్ధాలు చెప్పినా అది మీ ఆత్మ తృప్తి కోసమే.

 11. 12 satya 5:13 సా. వద్ద ఆగస్ట్ 6, 2010

  దిలీప్ గారు, I have some good respect towards you.. when I saw your evil writings on your myflowers site, I can say it is not chakravarthy gaaru who is trying to put flowers.. but you. sorry, if this hurts you. But I still respect you.

  ఇంక ఆయన పోస్ట్ why i sell my book , APNRI శ్రీకృష్ణ రిపోర్ట్ పై మీ వ్రాతలు..

  >> చక్రవర్తి గారు నిఖార్సైన క్యాపిటలిస్టు. అందుకే ఆయన రాసిన రిపోర్టులో లైనుకొకసారి “పెట్టుబడి” కనపడుతుంది.

  ఇది ఆ నివేదిక పూర్తి పాఠం.

  http://www.myteluguroots.com/PDF/APNRI_SKC_Main.pdf

  31 స్లైడ్ల ఆ రిపోర్ట్ లో Impact on NRI investments అనేది కేవలం ఒక 3 స్లైడ్ల అంశం. మీకేమో ప్రతి లైన్ కి కనిపించింది. తాడేపల్లి గారి పచ్చ కామెర్ల వ్యాఖ్య గుర్తొచ్చింది.

  పుస్తకం అమ్ముకోవటమే నేరమైనట్లు మీ వ్యాఖ్యలు చదివితే నిజంగా బాధేసింది. ఆయన అంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు అలా వ్రాసారంటే అది మీ విఙ్ఞత కే వదిలేస్తున్నా. ప్రత్యేక తెలంగాణ గురించి ఆ బ్లాగు లో వ్యాఖ్యానించే సంపత్ కూడా ఈ విషయం పై చేసిన కామెంట్ చదవండి.

  “Chakravarthy Garu,
  I cant agree more with you on this one. I had difference of opinion with you on the issue, but never argued with your intentions on selling the book. I hope this post puts to bed this stupid talk of free to end.
  PS: I can understand the reason behind sales of your book. You have given the most important chapters in the website. People got know what they wanted for free, hence didnt bother to purchase it. This only shows one thing. People here are really not interested in history of telugu civilization.

  ఇక పుస్తకం అమ్మటమే దోషం అయితే శ్రీశ్రీ, దాశరధి, ఇంక ఎందరో కవులు, రచయితలు అందరూ దుర్మార్గులే. ఒక చరిత్ర పుస్తకం వ్రాయటం అంటే ఇంట్లో కూర్చోని కడుపు లో చల్ల కదలకుండా బ్లాగు వ్రాయటం కాదు. తప్పు పుస్తకం అమ్మటం కాదు, వేరే వాళ్ళు కష్టించి వ్రాసినదానిని ఉచితంగా ఆశించటం.

  >> వ్యాసం మొత్తం చదివాక ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక కూడా “పెట్టుబడి” ఉన్నదని మీకు అర్థం అయితే దానికి నేను బాధ్యుణ్ని కాదండోయ్!

  యే ఉద్యమం పెట్టుబడి తో నడుస్తుందో తమరి మహోద్యమనేత కేసీయారే విద్యార్ధులకి శిక్షణ ఇచ్చాను అని చెప్పినప్పుడే లోకానికి తెలిసింది. సంపాదన లేని విద్యార్ధులు లక్షల రూపాయలు వెచ్చించి సభలు ఎలా నిర్వహించింది, దాని పెట్టుబడి ఎవరు ఇచ్చారు అనేది బహిరంగ రహస్యం.

  Btw.. I wont trouble you or myself much. This is my last comment here

 12. 13 శ్రీనివాసు 12:02 సా. వద్ద సెప్టెంబర్ 2, 2010

  నిజమే!!! ఎంత చదువుకుంటే మాత్రం, విద్యచెప్పేగురువైనా సరే, తెలంగాణావాడుకాకపోతే చెమడాలూడదీస్తాం. ఆనక ఆ “విద్యార్థుల”మీద కేసులురాకుండా నాయకులెలాగూ చూస్కుంటారుగా.

  – ఓ అర్థాన్ని వెతుక్కునే అర్భకుడు


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: