ఆత్మలూ, గౌరవాలూ …

బాబు గారి బాబ్లీ నాటకం అడ్డం తిరగడం మొదలైంది. “తెలుగు జాతి ఆత్మ గౌరవం” అంటూ ఇక్కడ గొంతులు చించుకుంటున్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టును కట్టిన గుత్తేదారు మన తెలుగు వాడే నన్న విషయం బయటపడింది.
ప్రముఖ ఆంధ్రా కాంట్రాక్టర్ మాగంటి రాజేంద్ర ప్రసాద్ కు చెందిన సోమ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును కట్టింది.
వివరాలు సోమ కన్స్ట్రక్షన్స్ వారి వెబ్ సైటులో ఇక్కడ చూడండి. (http://www.soma.co.in/)
సో, తెలుగు వారికి ద్రోహం చేసినవాడు “మన” వాడే . ఇకనైనా ఈ “తెలుగు ఆత్మ గౌరవం” నాటకం కట్టిపెట్టు బాబూ లేకపోతే తన నినాదాన్ని హైజాక్ చేసినందుకు పైనున్న అన్న శపించగలడు.
ఇక తెలుగు ఆత్మగౌరవం అంటూ బాబు గారు గొంతు చించుకునే సరికి అసలే “ఆత్మ గౌరవాల” పై, వీధి పోరాటాలపై పేటెంటు పొంది ఉన్న శివసైనికులు శివమెత్తిపోయారు. బాగా అలోచించి ఒక పాత సమస్యను దుమ్ము దులిపి నిజామాబాద్ జిల్లాపై దండయాత్రకు బయల్దేరారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టు తమ భూభాగంలోనే ఉందంటూ ఇవ్వాళ ఉదయం శివసైనికులు ఒక యాత్రను మొదలు పెట్టారు. దీంతో నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమవుతున్న తెలంగాణ ప్రజలకు ఒక కొత్త తలనొప్పిని తేవడంలో మాత్రం బాబుగారి బాబ్లీ డ్రామా విజయం సాధించింది.
ప్రకటనలు

3 Responses to “ఆత్మలూ, గౌరవాలూ …”


 1. 1 కృష్ణశ్రీ 7:01 ఉద. వద్ద జూలై 22, 2010

  ఇదేమీ కొత్త విషయం కాదే?

  ఓ తెలుగు వాడు ఇంకో రాష్ట్రం లో గుత్తలు తీసుకో కూడదా?

  వ్యాపారం లో ‘దీని మీద యెన్ని రాజకీయాలు జరుగుతాయి, యెవరికి నష్టం వస్తుంది, ముఖ్య మంత్రులకీ, అధిష్టానాలకీ అవి ఇష్టం అవుతాయా లేదా………….’ ఇలాంటివన్నీ ఆలోచించరు!

  దీనికీ, తెలుగువాడి ఆత్మగౌరవానికీ లంకె వెయ్యాలని చూస్తున్న మూర్ఖులతో మీరూ చేరకండి.

 2. 2 నవీన్ గార్ల 9:25 ఉద. వద్ద జూలై 22, 2010

  >>తెలంగాణ ప్రజలకు ఒక కొత్త తలనొప్పిని తేవడంలో మాత్రం బాబుగారి బాబ్లీ డ్రామా విజయం సాధించింది.
  తోటి తెలుగువారి మీద చూపించే ప్రతాపంలో కనీసం సగం ఐనా ఆ మరాఠాల మీద చూపలేరా? ఎన్నాళ్ళ నుంచో బ్రతుకు తెరువుకోసం వచ్చిన వారిని సెటిలర్లని దెప్పిపొడవడం కాదు, ఆ శివసేన సైనికుల మీద కూడా ప్రతాపం చూపితే, పోరాటాల పురిటి గడ్డను ఇతరులు మరింత కీర్తించడానికి అవకాశం ఉంటుంది.

 3. 3 vedapandit 12:24 సా. వద్ద జూలై 30, 2010

  దొంగ నా బాబు గురించి మాట్లాడటమూ వేస్టే


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: