కసాయివాడి జీవకారుణ్య యాత్ర

ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వానికి బుర్రపనిచేయడం వల్ల బాబుగారి బాబ్లీ నాటకానికి తెరపడింది. పాపం తెలంగాణాలో ఉప ఎన్నికల వరకూ మహారాష్ట్రనుండి virtual ప్రచారం చేసుకుందామనుకున్న చంద్రుడి పధకం బోల్తాకొట్టింది.
బాబ్లీ అక్రమ ప్రాజెక్టే సందేహంలేదు. దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన శాసనసభ్యుల పట్ల మహారాష్ట్ర పోలీసుల వైఖరి కూడా ఖండించాల్సిందే. కానీ దానికన్నా ముందు ఖండించాల్సింది చంద్రబాబు ఆడుతున్న దొంగనాటకాన్ని. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది క్షుద్ర రాజకీయాలకు పరాకాష్ట.
తానొక్కడే కాక మొత్తం ఎమ్మెల్యేలందరినీ వెంట తీసుకువెళ్లడం ద్వారా ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అసలు నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేసే వారెవరూ లేకుండా తానే వ్యూహం రచించాడు. దీని ద్వారా బాబు ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టదలిచాడు. మొదటిది తెలంగాణలో ప్రజల నిలదీత నుండి తప్పించుకోవడం, రెండోది తాను తెలంగాణా ప్రజల సంక్షేమం కొరకు పాటు పడుతున్నానని బిల్డప్ ఇవ్వడం, మూడోది రేపు తెలుగు దేశం ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి “మేం బాబ్లీ పోరాటంలో ఉన్నాం కాబట్టి ప్రచారం చెయ్యలేకపోయాం” అనే సాకు చెప్పుకోవచ్చు. ఇక నాలుగోది, అత్యంత దుర్మార్గమైనది, తెలుగుదేశం పోటీ నామమాత్రం చేయడం ద్వారా ఒకటో రెండో స్థానాల్లో కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చే ప్రయత్నం.
బాబు యాత్రకు సీమాంధ్ర మీడియా వంతపాడుతున్న విధానం చూస్తే ఇది తెలంగాణా కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని నిరూపితమవుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తున్నది. మామూలుగానైతే చంద్రబాబు ఆయా స్థాల్లో తెదేపా అభ్యర్ధుల విజయం కొరకు ప్రచారం చేయాలి. కానీ స్వతహాగా సమైక్యవాది అయిన చంద్రబాబు ప్రచారానికి వస్తే తెలంగాణా ప్రజలు అడుగడుగునా నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు ఇప్పుడీ బాబ్లీ నాటకానికి తెర తీశాడు.
ఒక సారి ఆయన ఎంచుకున్న సమయం చూడండి. బాబ్లీ ప్రాజెక్టుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ ఆగస్ట్ మొదటి వారంలో జరగనుంది. జులై చివరి వారంలో ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు రాష్ట్రం నుండి  ఒక అఖిలపక్షం వెళ్లనుంది. నిజంగానే బాబుకు సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్దే కనుక ఉంటే పై రెండు కార్యక్రమాలూ జరిగే వరకు ఓపిక పట్టాల్సింది.
ఇక తెలంగాణ ప్రజల మేలు కొరకే ఈ ఉద్యమం చేస్తున్నమని చిత్రీకరించడం కన్నా పెద్ద వంచన మరొకటి ఉండదు.
ఇప్పుడు ఏ శ్రీరాంసాగర్ పరిరక్షణ  కొరకైతే పోరాటం చేస్తున్నరో ఆ ప్రాజెక్టు కట్టి నాలుగు దశాబ్దాలు పూర్తికావొస్తున్నా ఇంకా దాని కాలవలు తవ్వడం పూర్తికాలేదు. బాబుగారు తొమ్మిదేళ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు తెలంగాణ ప్రాంత ప్రజలు శ్రీ రాంసాగర్ కాల్వలు పూర్తి చేయాలని ఉద్యమాలు చేశారు. కానీ బాబు గారు ఏనాడూ సదరు కాల్వలను పూర్తి చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేమో తెలంగాణ కొరకే ఇదంతా చేస్తున్నానని ప్రజలను నమ్మించజూస్తున్నాడు.
బాబ్లీ యాత్రకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు సీమాంధ్ర టెలివిజన్ చానెళ్లు కల్పిస్తున్న విస్తృత కవరేజి, తెలుగు ప్రజలను ముంచెత్తుతున్న ఎస్సెమెస్ ల ప్రవాహం, ఇదేదో “తెలుగు జాతికి” మరాఠా వారిచేతిలో జరిగిన అవమానంగా చూపించే ప్రయత్నం, లాఠీచార్జీ జరిగిన మరునాడే హైదరాబాద్ అంతటా వెలిసిన హోర్డింగుల్లో మీడియా వారు తీసిన ఫొటోలు ప్రత్యక్షం కావడం చూస్తుంటే చంద్రబాబు భారీ ప్రణాళికతోనే ఈ బాబ్లీ నాటకం మొదలు పెట్టాడని అర్థం అవుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని తెలుగు మీడియా సంస్థలు అచ్చమైన “ఎల్లో జర్నలిజానికి” పాల్పడ్డాయి
అయితే చంద్రబాబు కనుసన్నల్లో లేని ఆంగ్ల మీడియా మాత్రం ఈ యాత్రలో కొన్ని యదార్ధాలను బయటపెట్టింది.
ధర్మాబాద్ ఐటి.ఐ.లో చంద్రబాబును ఒక పాడుబడ్డ రూములో, కటిక నేలపై కూర్చోబెట్టారనీ, అక్కడ టాయిలెట్లు కూడా లేవని తెలుగు పత్రికల్లో రాస్తే అతన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎసి రూములో ఉంచారని కొన్ని సమాచార సాధనాలు వెల్లడించాయి. అంతే కాదు టాయిలెట్ తో సహా అన్ని సౌకర్యాలు ఉన్న RV (Recreational Vehicle) ఒకటి చంద్రబాబు వెంట తెచ్చుకున్నారని లోగుట్టు బయట పెట్టేశాయి ఇంకొన్ని పత్రికలు.
తెలుగు తమ్ముళ్లు నిజామాబాద్ నుండి పిలిపించుకున్న వంట బృందం ఎమ్మెల్యేలకు వండి పెట్టిన చికెన్ మటన్ బిర్యానీల గురించీ, బాబు బృందానికి పాలు, పండ్లు, బ్రెడ్డు, జాములు సరఫరా చేయడానికి హెరిటేజ్ కంపెనీ వారి ఎయిర్ కూల్డ్ వాహనం ఒకటి ధర్మాబాద్ ఐ.టి.ఐ. బయటే ఉన్నదని తెలుసుకుంటే బాబు గారి యాత్ర ఎంత “రుచికరంగా” సాగిందో అర్థం అవుతుంది.
యాత్రపై మహారాష్ట్రలో ఉన్న యాభై లక్షల పైచిలుకు తెలుగువారు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం గురించి కొన్ని పత్రికలు విపులంగా రాశాయి.
కసాయివాడు మొదలుపెట్టిన ఈ యాత్రను నమ్మే గొర్రెలెన్నున్నాయో వేచి చూడాల్సిందే.
ఇంకో విషయం. తెదేపా నేతలకు పోలీసు దెబ్బలు కొత్త కావొచ్చు కానీ ఈ దేశంలో పోలీసులు ఎక్కడైనా ఆందోళనలు చేసే వారిని ఒకే విధంగా “సన్మానిస్తారు” ఇందులో తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రస్తావన తేవడం హాస్యాస్పదం. ఒక సారి నిన్న కర్నూల్లో మన “తెలుగు” పోలీసులే “తెలుగు” విద్యార్ధులపై చేసిన లాఠీ చార్జీ చూడండి.
ప్రకటనలు

19 Responses to “కసాయివాడి జీవకారుణ్య యాత్ర”


 1. 1 suman 12:26 సా. వద్ద జూలై 21, 2010

  i agree completely with you and convey my thanks for such a good analysis.

 2. 3 anil 12:50 సా. వద్ద జూలై 21, 2010

  superb…….ga cheepparu…..

  chala nijalu telishayi…….

 3. 4 venkat reddy 1:49 సా. వద్ద జూలై 21, 2010

  Great analysis Brother keep it up

 4. 5 Sravya Vattikuti 2:22 సా. వద్ద జూలై 21, 2010

  మీడియా చేసేది ఎల్లో జర్నలిజం ఐతే మీరు రాసింది ఏ జర్నలిజం అంటారు పింక్ జర్నలిజమా ? భలే కదా మీకు ఇప్పుడు కనిపిస్తున్న మీడియా చేస్తున్న అతి మరీ ముఖ్యం గా చెప్పాలి అంటే చంద్రబాబు కనుసన్నల్లో లోని జర్నలిజం చేసిన అతి గత డిసెంబర్ లో ఇంకో రకం గా కనిపించింది ఎందుకనో .

 5. 6 sreekanth 2:38 సా. వద్ద జూలై 21, 2010

  idi babu marku kutila rajakeeyam. upa ennikallo pracharam cheyadaniki mokham chellaka ee natakaalu.

 6. 7 sreekanth 2:56 సా. వద్ద జూలై 21, 2010

  amma sravya yellow journalism ante bujaalu tadumukuntunnarenti? media bashalo yellow journalism ante “Journalism that exploits, distorts, or exaggerates the news to create sensations and attract readers.”

 7. 8 ఏ రాయైతేనేమి 5:13 సా. వద్ద జూలై 21, 2010

  మిగతా వాళ్లలా కాకుండా మీరు కొంచెం ఆలోచించి రాస్తారనుకునే వాడ్ని, ఈ టపాతో నాకు జ్ఞానోదయం చేశారు.

 8. 10 కృష్ణశ్రీ 7:07 సా. వద్ద జూలై 21, 2010

  “….ప్రభుత్వం….విచారణ…..మొదటివారం లో రానుంది”

  కోర్టుల్లోనూ, ట్రిబ్యునళ్ల ముందూ ఈ ప్రభుత్వ నిర్వకాలమీద నమ్మకం వున్న తెలుగువాడెవడైనా వున్నాడా?

  “….అఖిలపక్షం వెళ్ళనుంది”

  అది వెళ్ళేలోపే “యదార్థ స్థితిని” చూడాడానికే ఆ యాత్ర అన్నారుగా?

  “శ్రీరాంసాగర్ పరిరక్షణకి” కాదు–బాబ్లీకి వ్యతిరేకం గా! ఆ కాలువల నిర్మాణం లో జాప్యానికీ, ప్రాజెక్టు గర్భం లో ఇంకో ప్రాజెక్టు (ప్రపంచం లో యెక్కడా లేనిది) కీ తేడా మీకు కనబడడం లేదా?

  ‘….ఏసీ రూములోనూ, ఆర్వీ వాహనం లోనూ ఆయన ఫోటోలు ‘ యెందుకు ప్రచురించలేదో “ఆ పత్రికలు”?

  “రుచికరం గా సాగిన” ఆ యాత్ర ఫోటోలెందుకు ప్రచురించలేదో “ఆ పత్రికలు”?

  “…..యాబై లక్షల….తెలుగువారు…..” పై ప్రచురించిన వార్తలేవో, ఆ పత్రికలేవో విపులం గా వ్రాయచ్చుకదా?

  పోలీసువాళ్ళ గురించి వ్రాసింది మాత్రం నిజం–యెందుకంటే, వాళ్ళని పశువుల పాకల్లో విడిది యేర్పాటు చేసి, అన్నివేలమందినీ కాలవల ప్రక్కన కాల కృత్యాలు తీర్చుకోమనీ, కాలవల్లో స్నానం చెయ్యమనీ, ఉదయం 7-00 గంటలకే డ్యూటీకి సిధ్ధం గా వుండమనీ, రాత్రి ప్రొద్దుపోయినా డ్యూటీ చేస్తూనే వుండమనీ అదేశించే అధికారులూ, రా నా లూ వున్నంతకాలం–పాపం వాళ్ళు మానవులుగా యెలా ప్రవర్తిస్తారు? (పోలీసులకి ఇచ్చిన గొడ్లపాక ఫోటోలు కూడా పత్రికల్లో వచ్చాయి చూడండి)

  ఇక్కడ ఆత్మ గౌరంవం ప్రశ్న పోలీసులనించి కాదు–ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి!

 9. 11 gajula 7:27 సా. వద్ద జూలై 21, 2010

  oka bhabli -o babu -oka rendukallasiddantamu -oka telanganaupaennikalu -mukamchellaka ,deposit kosam.-adi katha .gajula

 10. 12 Sagatu Jeevi 9:13 సా. వద్ద జూలై 21, 2010

  శ్రీకాంత్ గారు,ఎల్లొ జర్నలిజం గురించి బాగా వివరణ ఇచ్చారు.

  సరే మరి మీ ఉద్దేశ్యం ప్రకారం ఇది ఎల్లొ జర్నలిజమే అనుకుందాం. మరి మీరు ప్రోత్సహిస్తున్న ,చేస్తున్న ఈ జర్నలిజాన్ని యేమనాలి ? బయాస్డ్ జర్నలిజం అనొచ్చా ?

  ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పొరుగు రాష్ట్రం అవమానించిన తీరు బాధాకరంగా వుంటే మరో వైపు పొరుగు రాష్ట్ర వాదనలు సమర్థించేలా వుండే ఇలాంటి వ్యాసాలు ఎంత వరకు ప్రజలను మేల్కొలుపుతాయి.

  ఒక వేళ ఆత్మ (సం)త్రుప్తి కొరకు రాసిన వ్యాసం అనుకున్నా అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుందే తప్ప మరొకటి కాదు.

  ఆలొచించండి.

 11. 13 శ్రీ 10:21 సా. వద్ద జూలై 21, 2010

  ఈ బాబ్లీ గొడవేమిటా అనుకుంటున్నాను, ఇదన్నమాట సంగతి!

 12. 14 అబ్రకదబ్ర 4:50 ఉద. వద్ద జూలై 22, 2010

  >> మూడోది రేపు తెలుగు దేశం ఎలాగూ ఓడిపోతుంది కాబట్టి “మేం బాబ్లీ పోరాటంలో ఉన్నాం కాబట్టి ప్రచారం చెయ్యలేకపోయాం” అనే సాకు చెప్పుకోవచ్చు

  ‘ఆ స్థానాలు మావి కావు కాబట్టి మేం కొత్తగా ఓడిపోయిందేం లేదు’ అని కూడా తెదెపా చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రం పోలీసుల్తో మక్కెలిరగదన్నించుకోటమే ఏకైక మార్గం కాదు.

  >> ఇక నాలుగోది, అత్యంత దుర్మార్గమైనది, తెలుగుదేశం పోటీ నామమాత్రం చేయడం ద్వారా ఒకటో రెండో స్థానాల్లో కాంగ్రెస్ కు లబ్ది చేకూర్చే ప్రయత్నం

  అంటే – తెదేపా, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల చీలిక ద్వారా మాత్రమే టీఆర్ఎస్ గెలుస్తుందని మీ నమ్మకం అన్నమాట.

  >> “బాబు యాత్రకు సీమాంధ్ర మీడియా వంతపాడుతున్న విధానం చూస్తే ఇది తెలంగాణా కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని నిరూపితమవుతుంది”

  కేసీయార్ ఉత్తుత్తి దీక్షకి బాకాలూదినప్పుడు మాత్రం అది సీమాంధ్ర మీడియా కాదా?

  >> బాబుగారు తొమ్మిదేళ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు తెలంగాణ ప్రాంత ప్రజలు శ్రీ రాంసాగర్ కాల్వలు పూర్తి చేయాలని ఉద్యమాలు చేశారు. బాబు గారు ఏనాడూ సదరు కాల్వలను పూర్తి చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేమో తెలంగాణ కొరకే ఇదంతా చేస్తున్నానని ప్రజలను నమ్మించజూస్తున్నాడు.

  బాబు బండారం బాగానే బయటేశారు. పనిలో పనిగా, తెదెపాలో వెలిగిపోయినన్నాళ్లూ తెలంగాణపై ప్రేమ ఒలకబోయలేదేమని కేసీయారు దొరవార్ని కూడా ఉతికారేస్తే బాగుండేది.

 13. 15 KumarN 6:11 ఉద. వద్ద జూలై 22, 2010

  Dileep Garu,
  I always knew you had an agenda. Nothing wrong about having one. I also knew that you are an idealogue and you let Isms drive you. Nothing surprising about that it either. Lot of people have one or the other idealogy.

  But I always had good respect on your COMMITMENT and intellect. With this article, whatever little I had is lost today.

  మీలాంటి వాళ్ళు ఇలా తయారవ్వటం వల్ల నష్టం, మీకో, నాకో కాదు దిలీప్ గారూ, సొసైటీకి.

  Kumar N

 14. 16 chittoor.S.Murugeshan 6:49 ఉద. వద్ద జూలై 22, 2010

  అయ్యా,
  మీరు చ్ప్పినవన్ని పచ్చి నిజాలే కాదనను. కాని ఈ విమర్శలంతా చెయ్యవలసింది చంద్రబాబు ఇక్కద,మన మధ్య, సురక్షితంగా రోడ్ షో నిర్వహిస్తూ రెండు వ్రేలు ఆడిస్తూ తిరుగుతున్నప్పడు.

  చంద్రబాబును నాకన్నా ఘోరంగా విమర్శించిన వారు మరొకరు ఉండరు. కాని కాల,దేశ వర్హ్తమాణాలూ చూడాలిగా. ఇప్పుడు ఇంకా ఇరవై పాయింట్లు పెట్టి వ్రాయంది. కరపత్రాలు ముద్రించి పంపిణీ చెయ్యండి. నేను కాదనను

 15. 17 Rakesh 7:03 ఉద. వద్ద జూలై 22, 2010

  Dileep has not changed… it is the drama of CBN changing / showing new schemes and colors!!

  Are you hearing anywhere about “BEEDI KATTALAPAI PURRE-GURTHU” issue that the same party (& strategist CBN) used to divert Telangana voters during earlier by-elections!!

  What about BC issue..

  Telangana voters are very clever.
  Proof of the pudding is in the eating!
  in front… crocodile festival!! (election results & 31st Dec count-down also dearrrrr…)

  We have much better enteratainment to see from Babu’s brain – than his brother-in-laws or their sons
  (leave alone another mohan “BABU” adding some more funny remarks trying to stop T formation!!)

 16. 18 CH.DURGA PRASAD 9:40 ఉద. వద్ద జూలై 22, 2010

  సార్,
  జాతీయ మీడియాలో బాబు ఏసి గదుల్లో స్వర్గసుఖాలు అనుభవించారని రాసారు. అది ఏ పత్రికలలో వచ్చిందో చెప్తే బాగున్ను.మరో మాట.రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ కార్యక్రమం నాయకులు చేయరని మీ లాంటి మేథావులకు తెలియద? సరే, జగన్ చేస్తున్న యాత్ర మాటేమిటి ? అది రాజకీయ ప్రయోజనం కాదా ? మీ వ్యాసంలో సాక్షి ఫొటొ పెట్టడం వెనుక ఆలోచన ఏ మిటో ?

 17. 19 శ్యామ్ ప్రసాద్ బెజవాడ 4:04 ఉద. వద్ద ఆగస్ట్ 18, 2010

  తెలంగాణా వాం, బాబు ప్రవరర్తన ప్రస్తుతం రెంటినీ రాజకీయ ప్రయోజనాలకే పొల్చవచ్చు. తెలంగాణా కూడ తెలుగుబిడ్డ రాజ్యమే అయినపుడు, మరాఠాలు భారతీయులేనని చంద్రబాబుకు తెలుసు. ఈ విషయాలు మన దేశ సామాన్య నాగరికుడికి తెలుసు.

  తెలియనిదల్లా కాషాయ వస్త్రపు దొంగ సన్నాసుల లా మారిన మీడియా మాటేమిటని?

  మనం ప్రక్షాళన చేయ వలసింది ఏడుకొండలెక్కి ఆదిని కాదు, అనుగ్రహించిన దైవాన్ని కాదు. వాన పాములా మన మధ్యనే వుంటూ కొండచిలువగా మారి, ప్రకటనా స్వేచ్చనే పనికిరాని హక్కుగానూ, చట్ట పరిధినుండి తప్పుకోగల భారత నిర్మాణ వారధికి పట్టిన చిలుము గాను మారకుండా కాపాడుకునే ప్రధమ బాధ్యత సామాన్యుడిదే నని గుర్తుంచుకోవాలి.

  మీ రచనా శైలి బాగుంది.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: