ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…

ఎట్టకేలకు సోంపేట విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దయ్యాయి. కనీసం తాత్కాలికంగానయినా ఆ ప్రాంత ప్రజలకు విజయం లభించింది. అయితే న్యాయం తమవైపే ఉన్నా, దాన్ని అమలుచేయించుకోవడానికి నిండు ప్రాణాలు బలిపెట్టవలసి రావడమే విషాదం.
ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్టు కనపడేది ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నాగార్జున కంపెనీ జీతగాళ్లలా పనిచేయడం. ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలే కాక, కాలుష్య నివారణ మండలి అధికారులు, ఆఖరికి వివిధ కేంద్ర స్థాయి పర్యావరణ సంస్థలు కూడా తప్పుడు నివేదికలు సృష్టించి ఈ ప్లాంటుకు అనుమతులు వచ్చేలా చేసారని ఇప్పుడు స్పష్టమవుతుంది.
నిన్న మధ్యాహ్నం సోంపేట గురించి మాట్లాడుతుంటే నా సహోద్యోగి ఒకరు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో తన చెల్లెలి ప్లాటు పోతోందని, అది వారు ఎంతో ముచ్చటపడి, ఇల్లు కట్టుకుందామనుకుని  కొనుక్కున్న ప్లాటు అని చెప్పాడు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అసలు ప్లాటు విలువలో పావు వంతు ఉండొచ్చని అంచనా. అలా వచ్చిన నష్టపరిహారంతో ఎక్కడా మరో ప్లాటు కొనుక్కోలేరు వారు.
సోంపేట రైతులైనా, హైదరాబాదులో ఉండే ఉద్యోగులైనా, “అభివృద్ధి రధచక్రాల” కింద ఇలా నలిగిపోవలసించేనా?
నిన్ననే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది ప్రభుత్వం. మళ్లీ భూసేకరణ (ఇళ్ల సేకరణ అనాలేమో!) షురూ అవుతుంది.
పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఏం చేయగలం మనం? కనీసం భూసేకరణ జరిగే విధానం గురించి, చట్టపరిధిలో మనకున్న హక్కుల గురించి తెలుసుకోవాలి కదా?
ప్రధాన స్రవంతి పత్రికలేవీ ఇటువంటి సమాచారం అందించినట్లు కనపడవు. అందుకే కొంతకాల క్రితం కీ.శే. బాల గోపాల్ గారి నేతృత్వంలోని మానవ హక్కుల వేదిక వారు వేసిన “ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…” అనే కరపత్రం లంకె కింద ఇస్తున్నాను. (పీడిఎఫ్ కూడా దిగుమతి చేసుకోవచ్చు )
చదవండి, ఇతరులకు చెప్పండి.
ప్రకటనలు

1 Response to “ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…”


  1. 1 శ్రీనివాసు 12:06 సా. వద్ద సెప్టెంబర్ 2, 2010

    చక్కటి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: