తెలంగాణ ఉద్యమానికి కొత్త ఆయుధం

తెలంగాణా ఉద్యమానికో కొత్త ఆయుధం దొరికింది. ఇప్పటిదాకా ప్రజలను చైతన్య పరచడానికి తెలంగాణ పాటలు ఉపకరిస్తే, ఇప్పుడు పాటతో పాటు పదునైన చిత్రాలు కూడా జత అయ్యాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక రకంగా తెలంగాణ భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులకు పునరుజ్జీవన దశ వంటిది. గత పదిహేనేళ్లలో ఈ ఉద్యమం నేపధ్యంలో తెలంగాణా సృజనకారులు సృష్టించిన పాటలు, కవితలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు తెలంగాణా చరిత్రకారులు ఇన్నాళ్లూ తెలంగాణా చరిత్రకు జరిగిన మోసాలు బయటపెడుతుంటే, ఇప్పుడు  మేము సైతం అంటూ తెలంగాణా చిత్రకారులు సైతం ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తెలంగాణా చిత్రకారులు ఈమధ్య ఉస్మానియా యూనివర్సిటీలోను, నిజాం కాలేజీలో జరిగిన తెలంగాణా జాతరలోనూ తమ చిత్రాలు ప్రదర్శించారు.
ఇక ఇప్పుడు చిత్రకారుడు శేఖర్  ఏకంగా ఒక చిత్రాల పుస్తకాన్నే వెలువరించాడు.  ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ వేసిన చిత్రాలు, కార్టూన్లతో “గిదీ తెలంగాణ” అనే పుస్తకం మొన్న ఆవిష్కృతమయ్యింది. ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం అని ఓ పెద్దాయన ఎందుకన్నాడో ఈ పుస్తకం చూస్తే అర్థం అవుతుంది. ఇందులో శేఖర్ వేసిన ఒక్కో బొమ్మా లక్ష పదాలతో సమానం.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న కవులు, కళాకారులు, మేధావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ పుస్తకాన్ని ఆవిష్కరించగా, ప్రొఫెసర్ కోదండ రాం, డాక్టర్ కె. శ్రీనివాస్ (ఆంధ్ర జ్యోతి ఎడిటర్), అల్లం నారాయణ, డాక్టర్  రఘు, ప్రముఖ చిత్ర కారుడు ఏలే లక్ష్మణ్, శైలేష్ రెడ్డి (జీ 24 గంటలు), దేశపతి శ్రీనివాస్, కార్టూనిస్ట్ శంకర్ (సాక్షి దినపత్రిక), చిత్రకారుడు అక్బర్ పాల్గొన్నారు. సభకు వేణు సుంకోజు అధ్యక్షత వహించారు.
ఈ పుస్తకంలో ఎడమవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు (బోనాలు, బతుకమ్మ, మొహరం) వంటి చిత్రాలు ఉంటే, కుడి పక్కన తెలంగాణ ఉద్యమ చిత్రాలు ఉన్నాయి. అందుకే శైలేష్ రెడ్డి మాట్లాడుతూ ఓవైపు చూస్తే సంతోషం మరోవైపు చూస్తే దుఖం కలుగుతుందని అన్నాడు.

నల్లగొండ జిల్లా సూర్యాపేట ముద్దుబిడ్డ శేఖర్ వేసిన ఈ చిత్రాలు తెలంగాణా ఉద్యమానికి మరింత స్ఫూర్తినిస్తాయి.

వెలకట్టలేని విలువైన చిత్రాలు ఉన్న ఈ పుస్తకం వెల 90 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల నేపధ్యం తెలుసుకోవాలనుకునే ప్రతిఒక్కరూ కొనితీరవలసిన పుస్తకం ఇది.

పుస్తకావిష్కరణ ఫొటోలు ఇక్కడ చూడండి:

http://picasaweb.google.co.in/konatham.dileep/GideeTelanganaBookLaunchMeeting#

ప్రకటనలు

3 Responses to “తెలంగాణ ఉద్యమానికి కొత్త ఆయుధం”


  1. 1 కత్తి మహేష్ కుమార్ 6:39 ఉద. వద్ద మార్చి 9, 2010

    శేఖర్ కు అభినందనలు. జై తెలంగాణ!

  2. 2 Radhakrishna 6:59 ఉద. వద్ద మార్చి 9, 2010

    Hi Sir,

    Sabhaki nenu vachanu….bommalu chala bagunnay…andaru chala baga maatladaaru…maree mukymaga allam narayana, kodanda ram ..saarlu


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: