ఛలో ధూంధాం తెలంగాణ జాతరొచ్చెరా!

నిజాం కళాశాల బషీర్ బాగ్ లో  ఫిబ్రవరి 11 నుండి 13 వరకు జరిగే తెలంగాణ జాతర బ్రోచర్:

మానవ నాగరికతలోని అన్ని దశలను చవిచూసిన నేల తెలంగాణ. మొత్తం భూగోళం మీద మానవ ఆవాసానికి అత్యంత అనుకూల వాతావరణ పరిస్తితులు ఉన్న భూమి ఇది ఒక్కటే. అందుకే అనాదిగా ప్రపంచం నలుమూలల నుండీ జనం ఈ ప్రాంతానికి వచ్చి చేరారు. అందరినీ అక్కున చేర్చుకుని ఈ భూమి తల్లి ప్రేమను చాటి చెప్పింది. రాక్షసబల్లి అస్థిపంజరం మొదలుకొని ఆదిమానవుడి రాతి ఆయుధాలు, తొలితరం గ్రామ జీవనానికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ లభ్యం అయ్యాయి. చారిత్రకంగా సాంస్కృతికంగా సుసంపన్నమైన భూమి ఇది. మధ్యలో పరాయి పాలకుల పాలబడ్ద ఈ భూమి కొన్ని ఒడిదొడుకులకు గురైంది. సంపన్న సంస్కృతి ఛిద్రమైంది. అయినా ఆ సంస్కృతికి సంబంధించిన ఎన్నో అంశాలు జనం మధ్య సజీవంగా ఉన్నాయి. వాటిని పొదివిపట్టి  తెచ్చి ఒకచోట తెలంగాణ జాతరగా ప్రదర్శిస్తున్నాం.
తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని సజీవంగా ప్రదర్శనకు పెట్టి దాని ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ జాతర. మానవ నాగరికత, నైపుణ్యాలు, భావజాలాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ నుండే ప్రపంచం అంతటికీ ప్రసరించాయని ఆంథ్రోపాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. శాతవాహన, చాళుక్య, కాకతీయ సామ్రాజ్యాలు ఇక్కడి నుండే విస్తరించాయి. బౌద్ధం, జైనం, శైవం ఉఛ్చ దశను ఈ నేలమీదే చవిచూశాయి.
ఆచారవ్యవహారాలు, సాంస్కృతిక రూపాలు, ఆటపాట, తిండి, ఆహార్యం, నగలు, అతిధి మర్యాదలు, శిల్పం, పండగలు, గ్రామ దేవతలు, వృత్తులు, వ్యవసాయం, చేనేత తదితర రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన సంస్కృతి  తెలంగాణ వారి స్వంతం. ముఖ్యంగా ఇక్కడి చేనేత, స్వర్ణకారుల పనితనాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేటికీ అధిగమించలేకపోయింది. ఐదువందల రకాల వడ్లతో పాటు ఉప్పు తప్ప సమస్త ఖాద్య వస్తువులను పండించడం ఇక్కడ ఉంది. కారల్ మార్క్స్ వర్ణించిన భారతీయ స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థ ఇక్కడే అభివృద్ధి చెందింది. “సమాజంలో ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాలి. అందరి మంచి చెడులను సమాజం చూసుకుంటుంది” అనే ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల కలను ఇక్కడ సాకారం చేసి చూపారు. ఇక్కడ దశబంధ చెరువుల నిర్మాణం ఆధునిక నీటి పారుదల శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఒక్కో ఊరు ఒక సజీవ మ్యూజియంగా ఉంటుంది.
ఈ సుసంపన్న తెలంగాణ సంస్కృతిని నిజాం కాలేజి గ్రౌండ్స్ కు చేర్చి తద్వారా ప్రపంచానికి ఈ ఖ్యాతిని వెల్లడించడానికి తెలంగాణ జాతరను తలపెట్టాము. దీనికి చేయూతనిచ్చి ప్రోత్సాహించమని కోరుతున్నాం.
నిర్వాహకులు: యువ తెలంగాణ
ప్రకటనలు

9 Responses to “ఛలో ధూంధాం తెలంగాణ జాతరొచ్చెరా!”


 1. 1 phani 12:29 సా. వద్ద ఫిబ్రవరి 10, 2010

  timings anna — ante poddunnaa, eveningaa or roju antanaaa..

 2. 2 రవి చంద్ర 1:34 సా. వద్ద ఫిబ్రవరి 10, 2010

  శభాష్ మంచి ప్రయత్నం….

 3. 3 Konatham Dileep 1:56 సా. వద్ద ఫిబ్రవరి 10, 2010

  Dear Phani,

  I think it will be open through out the day

 4. 4 gaddeswarup 9:12 సా. వద్ద ఫిబ్రవరి 10, 2010

  Remember also Kurkyala. From P.V. Parabrahma sastry Felicitation Volume 1 ( in the first article by A.V. Narasimha Murthy):
  “Utilizing Kurkyala inscrption of Jinavallabha, younger brother of the renowned Kannadapet Pampa, Dr. Sastry brought to light that Malliya Rechana, the author of Telugu work Kavijanasraya was earlier than Nannayabhatta, the author of Andhra Mahabharata at least by one century.”
  Some of the inscriptions can be read from
  http://books.google.com.au/books?id=d4PCyXslrNsC&pg=PA14&lpg=PA14&dq=kurkyala&source=bl&ots=NIF4QsTstE&sig=1nWJ-zVD7FGX6ILUQOdrHqAohCg&hl=en&ei=2B9zS7T3BIrYsQOSq5StBQ&sa=X&oi=book_result&ct=result&resnum=6&ved=0CBwQ6AEwBQ#v=onepage&q=kurkyala&f=false
  From a newspaper report http://www.hindu.com/2003/12/19/stories/2003121909850400.htm
  ” Dr. Kamala Hampana emphasised the need to utilise cultural significance as a harbinger of inter-State relations. Karnataka and Andhra Pradesh could together protect the inscriptions of Jina Vallabha, younger brother of the Kannada poet, Pamapa. Jina Vallabha’s inscriptions were found on a hillock in the vicinity of Kurkyala in Gangadharam taluk of Karimnagar district in Andhra Pradesh. Jina Vallabha had written initial poems of Telugu in A.D. 950.

  The inscriptions related to him were in Sanskrit, Telugu, and Kannada. “

 5. 6 gaddeswarup 4:45 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2010

  Dileep garu,
  Thanks for the link. I hope that there will be more research on this topic. I wondered how a full blown kavya came from Naannaya without any antecedents. Google search ‘indicated’ that possibly there were Telugu books before by Jains in the Karimnagar area. One theory is that these were destroyed after the resurgence of Hinduism. Apparently not all were destropyed, but were appropriated, with some changes hiding the authorship. I have no expertise on these topics and this type of information is gathered off and on by google search. Apparently name Andhra Satavahanas might have been due to the fact that they came from Andhra valley near Pune. But this is very tentative information and I hope that there will be more research on these topics and if you across any references, please let me know. I understand that Sri P.V. Parabrahma Sastry is in his nineties now and lives in Hyderabad. He will know many sources.

 6. 7 Konatham Dileep 11:32 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2010

  Sure sir. I am in touch with Telangana History Society and will definitely update you if I stumble upon anything related to this.

 7. 9 sravan 10:45 ఉద. వద్ద ఫిబ్రవరి 21, 2010

  Alright,
  Then if at all we accept your so called allegations then we should not be fighting for separation but instead should be opposing.
  Ironically Andhra should start their demand to separate. As you said before, Andhra with all its resources and intelligent people who are not drunkards like telangana are investing in telangana. Fine, that means telangana people are draining anhdra resources by your argument.
  Haven’t you thought about it before?
  You should also remember that before merger andhra people were asking for a merger and not telangana people. You guys had to agree for several safeguards unwillingly before the merger happened.
  I don’t know why the so called intelligent andhra people have been demanding for the merger given the losses they are going to face after merger.
  Well tadepally garu begin your protests for separate state.
  Andhra is losing its money to telangana.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: