తాగుబోతులు ఎవరు తాడేపల్లిగారూ?

సమైక్యవాద బ్లాగరు తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తాజాగా రాసిన బ్లాగు పోస్టును చదివితే తెలంగాణా ఉద్యమానికి ఉన్న ఒక ప్రాధమిక నేపధ్యం అర్థం అవుతుంది. తెలంగాణావారంతా తాగుబోతులు అనే అర్థం స్ఫురించే మాటలన్నాడాయన ఆ బ్లాగుపోస్టులో.
“అన్ని గడపల కన్నా మా గడపే మిన్న” అన్న ఈ అహంకారమే పరిస్థితి ఇక్కడి దాకా తీసుకువచ్చింది. తాము స్వయంగా బతకడానికి వలస వచ్చి, ఇక్కడి స్థానికులకు ఒక “సంస్కృతి” లేదని, వారు తాగుబోతులనీ, సోమరులనీ చెప్పినవారిలో తాడేపల్లివారు మొదటివారేమీ కారు.
ఆనాడు బ్రిటిష్ వారు ప్రతి వలస కాలనీలో ప్రజలపై  ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గత వందేళ్లలో అమెరికా ఎన్నో దేశాలపై దాడులు చేసినప్పుడు ఇటువంటి పదాలే వాడింది. “స్థానికులను తామే క్రైస్తవులుగా మార్చి సంస్కరిస్తున్నామని, వారి ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నామని….”.
బహుశా అందుకేనేమో ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ “The idea of Visaalandhra (Andhra Pradesh) smacks of imperialist expansionism” అన్నాడు
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కనుచూపుమేరలోకి వచ్చే సరికి ఇక ఇప్పటిదాకా మొహాలకు వేసుకున్న ముసుగులు తొలగించుకుని తమ అసలు రూపు బయటపెట్టుకుంటున్నారు తాడేపల్లి వంటి వారు. తెలంగాణా ప్రజలపై కడుపులో దాచుకున్న విషాన్ని కక్కడం మొదలుపెట్టారు.
ఒక సారి ఆయన ప్రేలాపలనలు చదవండి:
“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుండి తాగుడు ద్వారా వస్తున్న ఆదాయాన్ని (రాష్ట్రం యొక్క మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 60 శాతానికి పైనే) గమనిస్తే తెలంగాణ నిండా మద్యపానవ్యసనం (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ తెలంగాణ ఎలా బాగుపడుతుంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ?”

“తెలంగాణలో ఆడ-మగా, చిన్నా-పెద్దా, ముసలీ-ముతకా అందఱూ తాగుతారు. ఈ తాగడానికి ఒక వేళా పాళా కూడా ఏమీ లేదు. కొంతమంది పొద్దున్నే లేచి తాగేవాళ్లని కూడా చూశాను. “
ఇదీ ఆయనగారికి తెలంగాణా ప్రజలపై ఉన్న అభిప్రాయం. మరి ఇంత తాగుబోతులను తమతో కలిపే ఉంచుకోవాలని అంత తాపత్రయం ఎందుకుట. వారి మానాన వారిని వదిలేస్తే పోలా గమ్మున ఇంత తాగి పడుకుంటారు.
అసలు తాడేపల్లి చేస్తున్న ఆరోపణల వెనుక ఏ ఆధారమూ లేదు. అదంతా ఆయన, ఆయనలాంటి మరికొంతమంది బుర్రల్లో ఉన్న దురభిప్రాయం మాత్రమే అని ఏ ప్రభుత్వ రికార్డు తిరగేసినా ఇట్టే అర్థం అవుతుంది. ఈ మాట చాలాకాలంగా ఆంధ్రా ప్రాంత వితండవాదులు చెబుతున్నదే. అయితే అటువంటి అబద్ధపు ప్రచారాన్ని విని ఊరుకునేందుకు తెలంగాణా వారు సిద్ధంగా లేరు.
ఇంకొన్ని నిజాలివిగో చిత్తగించండి:
మన రాష్ట్రంలో మందు వ్యాపారం ప్రభుత్వమే “ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్” ద్వారా చేస్తుంది. ఆ శాఖ వారి  2008-2009 సంవత్సర మందు అమ్మకం లెఖ్కలిక్కడ చూడండి.

రాజధాని నగరం ఉన్న హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలను మినహాయించి చూస్తే ఏ ప్రాంతం వారు ఎక్కువ తాగుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది.
(రాజధాని నగరానికి ఉన్న జనాభా వల్ల,  ప్రతి రోజూ వివిధ పనుల రీత్యా ఇక్కడికి వచ్చే లక్షలాది ఇతర ప్రాంతాల ప్రజల వల్లా, వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకుల వల్లా ఇక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఇప్పుడు స్థానికులు ఎందరు ఉన్నారో, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు ఎందరు ఉన్నారో తెలుసుకుంటే రాజధానిలో ఈ మద్యం అమ్మకాలకూ, తెలంగాణకు ఏ సంబంధం లేదని ఇట్టే అర్థం అవుతుంది.   హైదరాబాద్ చుట్టూ ఉన్న కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట్, చందానగర్, గచ్చిబౌలి, జూబిలీహిల్స్, వనస్థలిపురం, సరూర్ నగర్  వంటి కాలనీలు అన్నీ రంగారెడ్డి జిల్లా కిందికి రావడం వల్ల ఆ జిల్లా మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది. ఒక వేళ తెలంగాణా వాళ్లే కనుక తాగుబోతులై ఉంటే వారు కేవలం రాజధానికి వచ్చే తాగరు కదా? మిగతా తెలంగాణా జిల్లాలన్నీ మద్యం అమ్మకాల్లో ఆంధ్రా, రాయలసీమ జిల్లాలను మించిపోవాలి కదా?  )
రాజధానిని వదిలేస్తే అమ్మకాల రీత్యా మొదటి అయిదు స్థానాల్లో విశాఖపట్నం (594 కోట్లు), గుంటూరు (503 కోట్లు), విజయవాడ (కృష్ణా) (490 కోట్లు), కరీం నగర్ (482 కోట్లు), చిత్తూరు (460 కోట్లు) ఉన్నాయి.
ఆంధ్ర జిల్లాలన్నీ కలిపి మద్యం అమ్మకాలు 3667 కోట్లు ఉన్నాయి. అంటే సగటున జిల్లాకు 407 కోట్లు. రాయలసీమ జిల్లాల మొత్తం అమ్మకాలు 1377 కోట్లు అంటే సగటున 344 కోట్లు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను తీసివేస్తే మిగిలిన ఎనిమిది తెలంగాణా జిల్లా మద్యం అమ్మకాలు 2735 కోట్లు. అంటే సగటున 341 కోట్లు.
ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు ఎక్కువ తాగుతున్నారో?
తెలంగాణాలో తాగడం అనేది దొంగచాటుగా చేసే పనికాదు. అందుకే మీలాంటి వారు ఇటువంటి దుష్ప్రచారం చేసే అవకాశం వచ్చింది. చాటుమాటుగా పీపాలు పీపాలు తాగేస్తున్న మీ ప్రాంతం వారిని చూడకుండా, ఉల్టా ఎదుటివారినే తాగుబోతులు అనడం మీ సంస్కారానికే వదిలేస్తున్నాను.

తోటి తెలుగు వారి పట్ల ఇంత చులకన భావంతో మీరు చెప్పే సమైక్య సుద్దులకు ఏమైనా అర్థం ఉందా? తెలంగాణావాదులు అబద్దాలు చెబుతున్నారంటూ ఇల్లెక్కి అరిచే మీరు చేస్తున్నదేమిటి?

తాజా కలం.
ఉండుండి తాడేపల్లి గారు మరో దిమ్మ తిరిగే వాస్తవం కనుక్కున్నారు. ముందు ఆయన బ్లాగులో ఆయనే ఒలక బోసిన ఈ మందు విజ్ఞానం చదవండి ఆ తరువాత నా ప్రతిస్పందన:

“ఇందులో మీకు తెలియని/ లేదా మీరు ఉపేక్షించిన ఇంకో విషయం కూడా నేను చెప్పదల్చుకున్నాను. తాగుడు మీద ప్రభుత్వానికొచ్చే ఆదాయంలో ప్రతిరూపాయీ ప్రభుత్వసారా పొట్లాల అమ్మకం ద్వారా వచ్చేది కాదు. అందులో అనేక ఇతరేతర పన్నులు కూడా ఉంటాయి. ఉదాహరణకి – IMFL (Indian-made Foreign Liquor) ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేసి అమ్మితే దాని మీద ప్రభుత్వానికి పన్ను వసూలవుతుంది. IMFL యూనిట్లు సీసా ఒక్కొక్కటి సారాయి కంటే ఖరీదుంటాయి. అందుచేత అవి తక్కువ యూనిట్లు అమ్మినా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇహ ఇంపోర్టెడ్ సరుకైతే సరేసరి. ఇలాంటి ఇంపోర్టెడ్ సరుకు ఆంధ్రసముద్రతీరంలో ఎక్కువ. అందుచేత అక్కడి జనం తక్కువ తాగినా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కనుక మీరు చెబుతున్న కృష్ణాజిల్లా తాగుడూ, దానిమీద కనిపిస్తున్న ఆదాయమూ ఆ కోవలోకి వస్తుంది. కానీ నాన్-హైదరాబాదీ తెలంగాణప్రాంతంలో ఇంపోర్టెడ్ సరుకు చాలా అరుదుగా లభ్యమవుతుంది. కనుక అక్కడి అమ్మకాలు ఎక్కువశాతం ప్రభుత్వసారాయికి సంబంధించినవి. అవి ఎక్కువ యూనిట్లు అమ్మితే తప్ప ఎక్కువ ఆదాయం రాదు. ఎన్నియూనిట్లు ఖర్చయితే అంతమందీ తాగుతున్నట్లే లెక్క.”

1993లో నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం మొదలై అప్పటి రామారావు ప్రభుత్వం సారాపై నిషేధం విధించింది. 16-1-1995 నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం సంపూర్ణ మధ్య నిషేధం అమల్లోకి వచ్చింది.
ఎక్సైజు ఆదాయం అడుగంటి పోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులకు కటకట వచ్చి చంద్రబాబు ప్రభుత్వం 1997లో మద్య నిషేధాన్ని సడలించి IMFL – Indian Made Foreign Liquor ఇక్కడ తయారు చేసి అమ్మడానికి అనుమతి ఇచ్చింది.
కానీ ఈ రోజు వరకూ మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సారా తయారీ కానీ అమ్మకాలు కానీ లేవు. బహుశా అందుకే పేద ప్రజలు దొంగ సారా తాగడానికి అలవాటు పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా గత వారం తూర్పు గోదావరి జిల్లాలో నాటు సారా తాగి 14 మంది చనిపోయిన విషయం ఇక్కడ గుర్తుకుతెచ్చుకోవాలి.
తాడేపల్లి గారేమో కృష్ణా జిల్లా వారు ఫారిన్ సరుకు తాగితే తెలంగాణా జిల్లాలవారు (అసలు ఉత్పత్తే కాని))ప్రభుత్వ సారా తాగుతున్నారనే కొత్త సంగతి కనుక్కున్నారు.
అబ్బబ్బో సమైక్యవాదుల నోట ఎన్ని నిజాలో!
—-
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలు మొదలు కాగానే బ్లాగుల్లో సమైక్యవాదులు నిద్రలేచారు. కొందరేమో తెలంగాణావాదులు అయిదు దశాబ్దాలుగా చెబుతున్న లెక్కల్లో తేడా ఉన్నాయని కొత్తగా కనుక్కుంటున్నారు. వారికి ఒక్కటే నా విజ్ఞప్తి. తెలంగాణా అత్యంత న్యాయబద్ధమైన డిమాండ్. దానికొరకు ఒక్క అబద్దమూ ఆడాల్సిన పనిలేదు మాకు. మీరు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉన్నాయి మావద్ద. అసలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఏవీ కొత్తవికావు. కొన్నైతే 1969 ఉద్యమ సమయంలో అడిగితే మావాళ్లు జవాబిచ్చిన ప్రశ్నలు.   చాలామంది ఆంధ్ర మిత్రులు ఇప్పుడే నిద్రలేవడం వల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఉద్యమంలో ఉన్నాము కాబట్టి కొంచెం ఆలస్యంగానయినా జవాబు చెపాల్సిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పడం జరుగుతుంది.
తాడేపల్లి గారు తెలంగాణాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడమే ఈ పోస్టు ఉద్దేశ్యం. తాగడం తప్పనో, ఒప్పనో నిరూపించే ప్రయత్నం కాదని మనవి.
గమనిక: అనామక వ్యాఖ్యాతల కామెంట్లు ప్రచురింపబడవు.
ప్రకటనలు

2 Responses to “తాగుబోతులు ఎవరు తాడేపల్లిగారూ?”


 1. 1 Konatham Dileep 4:11 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2010

  Gadde Swarup gaaru,

  Thanks for commenting. Lets have this discussion via email.

  Regards

  Dileep

 2. 2 Konatham Dileep 4:32 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2010

  ప్రవీణ్ గారూ,

  “ఆంధ్రా వాళ్ళని నరికేస్తాము, చంపేస్తామన్నా ఖండించలేని మీరు…”

  మీరెవరి మాటలను ప్రస్తావిస్తునారో కొంచెం వివరాలిస్తారా. ఏదైనా లంకె ఇస్తే నేను జవాబివ్వగలను.

  దిలీప్


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: