తెలంగాణా ఆకాంక్షల చరిత్ర తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలామంది ఆంధ్ర, రాయలసీమ, ఇతర రాష్ట్ర మిత్రులకు తెలియదు. అందుకే ఈ అంశం గురించి చాలా చర్చలు కేసీయార్ తో మొదలై టీఆరెస్ తో ముగుస్తాయి.

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఇక్కడి ప్రజలలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే ఉన్నదని చాలా మందికి తెలియదు. ఈ చరిత్ర తెలియకనే ఇప్పటి తెలంగాణా ఉద్యమాన్ని మిత్రులు అపార్ధం చేసుకుంటున్నారు. మొదటి ఎస్సార్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయమని సిఫారసు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే ఆంధ్ర నాయకుల పైరవీతో ఢిల్లీ స్థాయిలో జరిగిన మంత్రాంగంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో విలీనం అయిన నాటినుండీ తెలంగాణ ప్రజల్లో ఈ రాష్ట్రకాంక్ష ఇంకా బలపడుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా దారుణమైన వివక్షకు గురై చివరికి ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించే దాకా వచ్చింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ఏడాది ముందే మొదటి ఎస్సార్సీ సిఫారసుల ఆధారంగా 19-10-1955 నాటి ఆంధ్రపత్రిక ప్రచురించిన పటం చూడండి. రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలని స్పష్టంగా చూపించారిందులో.

మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్ సభ్యులు ఫజల్ అలీ, కుంజ్రూ మరియు ఫణిక్కర్ ల చిత్రాలు. కమీషన్ సిఫారసుల ప్రకారం ఏర్పడాల్సిన కొత్త రాష్ట్రాల స్వరూపం. కింది పట్టికలో ఆంధ్ర, హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రాలు విడివిడిగా ఉండడం గమనించండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: