సమైక్య ఊసరవెల్లులు

2009 ఎన్నికల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తమతమ మానిఫెస్టోల్లో స్పష్టంగా ప్రకటించాయి. ఆ పార్టీల సీమాంధ్ర ప్రతినిధులు ఇవ్వాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడేట్టున్నాయి.

2009 ఫిబ్రవరి 12 నాడు దివంగత ముఖ్యమంత్రి వైయెస్ రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయంలో నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది” అన్నాడు.

“The Government of Andhra Pradesh has no objection to the formation of Telangana State in principle and feels that the time has come to move forward decisively on this issue.”

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ భాగస్వామ్య వర్గాల వాదనలు పరిశీలించడానికి, చర్చనీయాంశమైన అంశాలను ఖరారు చేయడానికి అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు.

ఆ రోజు ఈ సోకాల్డ్ సమైక్యవాదులేమయ్యారు?

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ఏమన్నదో ఒక సారి చూడండి:

“On the Telangana issue, the Congress Party pledges to honour the stand taken by the Government on the floor of the House. The Congress Government has already constituted a Committee of Members of both the Houses under the Chairmanship of senior Congress leader Sri K.Rosaiah. The report is awaited.”

దీని అర్థం ఏమిటి?

ఇవ్వాళ కాంగ్రెస్ నేతలే అందరికన్నా ముందు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టడం ఎంత వంచన.

ఇక టీడీపీ తన 2009 ఎన్నికల మానిఫెస్టోలో ఏమన్నదో ఒక సారి చూడండి.

ఎంతో “కసరత్తు” చేసి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా? మరి ఆరోజు పార్టీలోని సమైక్యవాదులంతా ఏం చేశారు? ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ వారిచేతనే సమైక్యాంధ్ర ఉద్యమం చేయించడం ఏం న్యాయం?

ఇక చిరంజీవిగారి ప్రజారాజ్యం పార్టీ.

ఆయన జగిత్యాల పట్టణంలో తెలంగాణకు మద్దతు ప్రకటించినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. మా బంధువు మరణిస్తే చూడడానికి వెళ్లిన నేను చిరంజీవి మాటలను విజయవాడలోని అప్సరా థియేటర్ సమీపంలో ఒక హోటల్ రూములో టివిలో చూసి ఎంతో సంతోషించాను.

నమ్మి మోసపోవడం ఇది మొదటిసారి కాదు తెలంగాణ ప్రజలకు. కానీ అంతో ఇంతో విశ్వసనీయత ఉందనుకున్న చిరంజీవి, అందరివాడు అనుకున్న చిరంజీవి ఎలా కొందరివాడుగా మారాడో ఈ వీడియో ఒక్కసారి చూడండి.

2009 ఎన్నికల ముందు ఆయన పీఆర్పీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందేమిటో ఒకసారి చదవండి.

ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలేమిటి? ఇంత విశ్వాసఘాతకుడిగా మారిన చిరంజీవిని తెలంగాణా ప్రజానీకం ఎప్పటికయినా క్షమిస్తుందా?

సినిమాల్లో హీరోగా ఉఛ్చస్థితికి చేరుకున్నాక ఆయన నేరుగా పారితోషికం తీసుకోకుండా నైజాం (తెలంగాణ) ప్రాంత పంపిణీ హక్కులూ తీసుకునేవాడు. ఒకవిధంగా ఆయన సంపాదనలో అత్యధిక శాతం తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిందే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టి, ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న అభిమానాన్ని ఒక్క రోజులో పోగొట్టుకున్నాడీ దగాస్టార్.

ఇప్పుడు రెచ్చిపోయి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం నాయకులు ఎన్నికల ముందు నిద్దరపోయారా? లేక తెలంగాణా ప్రజలను ఇలాగే కలకాలం మోసం చేయొచ్చనుకున్నారా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: