బండెనుక బండి కట్టి…

తెలంగాణా రాష్ట్రం ఇవ్వరాదని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు మీడియా ద్వారా సంకేతాలు అందుతున్నాయి. కేసియార్ ఆత్మత్యాగం చేసినా ఈ డిమాండును ఆమోదించవద్దనేది కాంగ్రెస్ అలోచనగా చెపుతున్నారు.

నాకొక పాట గుర్తొస్తున్నది. నైజాము సర్కరోని మీద మా యాదగిరి రాసిన ఆ పాటలో …

బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా

పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

స్త్రీ పురుషులంత గలిసి
ఇల్లాలమంత గలిసి
వడిసేల రాళ్లు గట్టి
వడివడిగ గొట్టితేను
కారాపు నీళ్లు దెచ్చి
కండ్లళ్ల జల్లితేను
నీ మిలిట్రి బారిపొయెరో
నీ మిలిట్రి బారిపొయెరో…
నైజాము సర్కరోడా

సుట్టుముట్టూ సూర్యపేట,
నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేది హైద్రబాదు
దాని పక్క గోలుకొండ
గోలుకొండా ఖిలా కిందా
గోలుకొండా ఖిలా కిందా
నీ గోరి కడుతం కొడుకో
నైజాము సర్కరోడా

తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్షలపైకి సైన్యాన్ని, సీ.ఆర్.పి.ఎఫ్, బీ.ఎస్.ఎఫ్., గ్రే హౌండ్స్, రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ బలగాలను ఉసిగొల్పుతున్న రోశయ్య, సోనియా దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు.

ఇది ధర్మ పోరాటం. న్యాయమైన ఆకాంక్ష. ఇప్పుడు అణిచివేస్తే రేపో ఎల్లుండో మళ్లీ ఎగిసిపడటం ఖాయం.

జై తెలంగాణ!

తెలంగాణ జాతీయ గీతం “జయ జయ హే తెలంగాణ” ఇక్కడ వినండి

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: