ఉస్మానియాపై రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసుల దాడి

ఉస్మానియాపై వెయ్యిమంది రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసుల దాడి. విద్యార్ధులు ధర్నా చేస్తున్న టెంట్ల తొలగింపు. మీడియాను యూనివర్సిటీలోకి అనుమతించని పోలీసులు. తీవ్ర ఉద్రిక్తత. 29 నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై జరిగిన పాశవిక దాడిని టివీల్లో చూశాకనే అనేకమంది తెలంగాణా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉదృతం చేశారు. ఆరోజు నుండీ తెలంగాణా ఉద్యమానికి గుండెకాయలా నిలిచినింది ఉస్మానియా యూనివర్సిటీ. అందుకే ప్రభుత్వం కన్ను ఈ విద్యార్ధులపై బడింది.

సమస్య పరిష్కరించకుండా బలప్రయోగం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని రోశయ్య ప్రభుత్వం భావిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఈ ఉద్యమ జ్వాలలు ఆయన ప్రభుత్వాన్ని దహించివేయడం ఖాయం.

జై తెలంగాణ!

ప్రకటనలు

4 Responses to “ఉస్మానియాపై రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసుల దాడి”


  1. 1 రమణ 2:33 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

    చాలా అప్రజాస్వామ్యకరమైన చర్య. మీడియాను కూడా అనుమతించకుండా, పోలీసు బలగంతో రాజకీయ సమస్యని శాంతి భద్రతల సమస్యగా చూపెట్టాలని ప్రయత్నించే ఈ నియంతృత్యం చర్యని సమ్యకైవాదులు, తెలంగాణా వాదులు ఏకకంఠంతో ఖండించాలి.

  2. 2 Pratap 2:49 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

    దుర్మార్గం ! ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే !! గాంధీ పుట్టిన దేశమా ఇది ??? ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్ర్యం ?? ఎవరి మేలు కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఇట్లా రాక్షసుల్లా మారుతున్నారు. ఈ పాలకులే కదా ఎన్నికల ముందు తెలంగాణా ఇస్తామని కల్ల బొల్లి కబుర్లు చెప్పి ఓట్లు దండుకున్నది. తెలంగాణా మంత్రులారా…. మీరు కూడా ఈ పాపం లో పాలు పంచు కుంటారా? ఈ పాపపు కూడు ….రక్తపు కూడు తింటూ …. మీకు అధికారం కట్టబెట్టిన ప్రజల ఉసురు పోసుకుంటూ మీరు ఏం బావుకుంటారు.??? సర్వ నాశనమై పోతారు! ఇప్పటి వరకూ తెలంగాణా విద్యార్ధులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇక నుంచీ మీరు హత్యలు చేయడం మొదలు పెడతారా. అయ్యో తెలంగాణా! అయ్యయ్యో తెలంగాణా …. నీకు ఈ రాక్షససుల చేర నుంచి విముక్తి ఎప్పుడు తల్లీ …..!

  3. 4 vepaaku 4:03 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

    What else we can expect when we are in a pseodo democratic state. This is not the first time goverments using police like dictators. We as people well deseve these cheap rulers. We voted and got these political parties on to top. We are well aware of thier cheap policies and thier tricks, isn’t it ? Glad to people in action at last. Hope to see more of it next few decades !


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: