ఎమరాల్డ్ మిఠాయి దుకాణం వారి కొత్త శాఖను చూశారా?

ఎమరాల్డ్ మిఠాయి దుకాణం గురించి ఇప్పుడు చాలా మందికే తెలుసు. తెలియని వారు ఆ షాపు గురించి నేను రాసిన మొదటి పోస్టు చూడండి.

ఇటీవలే ఎమరాల్డ్ వారు మా ఇంటికి కూత వేటు దూరంలోనే ఇంకొక బ్రాంచీ తెరిచారు. గాంధీనగర్ లో నర్మద ఆసుపత్రి పక్కన పెట్టిన ఈ కొత్త షాపు చూడగానే వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఒక పాత ఇంటిని తీసుకుని దాన్ని వారు తమదైన శైలిలో చక్కగా అలంకరించారు.

Emerald 005

పర్యావరణ పరిరక్షణ పట్ల ఎమరాల్డ్ అధినేత విజయ్ రాం కున్న ఆపేక్ష అసామాన్యమైనది. గాంధీనగర్ లో ఈ కొత్త బ్రాంచీ ఉన్న సందు, దాని పక్కనే ఉన్న మరో సందును ఎమరాల్డ్ మిఠాయి దుకాణం వారు దత్తత తీసుకున్నారు. ఈ రెండు వీధులూ శుభ్రంగా ఉంచడానికి, చెత్త ఎత్తివేయడానికి ఒక రిక్షాను పెట్టారు. అంతే కాదు. ఈ రెండు వీధుల్లో ఉన్న అన్ని ఇళ్లలోనూ ఇంకుడు గుంతలు తవ్వించే బాధ్యతను తీసుకున్నారు. 

ఎమరాల్డ్ షాపుల్లో అడుగడుగునా మనకు పర్యావరణం పట్ల ప్రేమ కనపడుతుంది. షాపులోకి అడుగు పెట్టగానే రాగి బిందెల్లో ఉంచిన మంచి నీరు మనకు ఒక విలక్షణ స్వాగతం పలుకుతుంది.

Emerald 001

గోడలకు వేలాడదీసిన పెయింటింగులు భూమి పట్ల మనిషి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంటాయి. ఇక షాపులో మిఠాయిలు కొంటే వాటిని కాగితం లేదా గుడ్డతో చేసిన సంచీలో ఇస్తారు.  మీరు ఈ సారి షాపుకు వచ్చినప్పుడు ఇదే సంచీని తీసుకువచ్చినా, లేదా మీ స్వంత చేతి సంచీతో వచ్చినా  మీకు 4 రూపాయల రాయితీ కూడా ఇస్తారు.

Emerald 002

Emerald 1 005

మనలో చాలామంది సమస్యల గురించి కేవలం “మాట్లాడుతుంటాం”, కానీ విజయ్ రాం వంటి కార్యదీక్షులు మాత్రం ఒక్కో అడుగూ వేస్తూ ముందుకు సాగుతుంటారు. సమాజ హితం కొరకు అలోచించడం అంటే మన ఉద్యోగాలూ, వ్యాపారాలూ వదిలేసుకోవాల్సిన పనిలేదని, అవి రెండూ మిళితం చేసి కూడా విజయం సాధించవచ్చనీ విజయ్ రాం నిరూపిస్తున్నాడు.  

 

***

షాపు అడ్రసు:

ఎమెరాల్డ్ స్వీట్ షాప్
నర్మద ఆసుపత్రి పక్కన
గాంధీ నగర్

(గాంధీనగర్ ప్రాంతం తెలియనివారు ముందుగా కాలనీలో ఉన్న  మోర్ సూపర్ మార్కెట్ కానీ లేదా కెనరా బ్యాంక్ కానీ చేరుకోగలిగితే ఈ షాపు తేలికగా దొరుకుతుంది) 

***

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: