“వై” “యెస్” అన్నారు ఓటర్లు?

ysr-chiru-jp

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కార్టూన్ ఎన్నికల రాష్ట్ర ఫలితాన్ని చక్కగా ప్రతిబింబించింది. చిరంజీవి, జయప్రకాష్ నారాయణ కలిసి చంద్రబాబును ఓడించారు, కాంగ్రెస్ ను గెలిపించారు. ఇదీ ఈ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే మనకు అర్థమయ్యే విషయం.

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అభివృద్ధికి ప్రజలు కట్టిన పట్టం అని పాలక పార్టీ అభివర్ణించింది. మహాకూటమి పొత్తులు సరిగా ఫలించకపోవడం వల్లనే ఓడిందని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అయితే కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో అభ్యర్ధులు సాధించిన ఓట్ల వివరాలు కొంచెం పరిశీలిస్తే చంద్రబాబును ఓడించింది, కాంగ్రెస్ ను గెలిపించిందీ ప్రధానంగా ప్రజా రాజ్యం, లోక్ సత్తా పార్టీలే అని ఇట్టే తెలిసిపోతుంది. (మచ్చుకు కాంగ్రెస్ గెలిచిన ఒక యాభై నియోజకవర్గాల ఓట్ల వివరాలను ఇచ్చాను చూడండి)

elec-analysis
Election Analysis

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరికన్నా మొదలు అర్థం చేసుకున్నవాడు వైయెస్. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా తొణకక బెణకక తాను ఎలాగైనా గెలుస్తాననే ధీమా కనబరిచాడు.

దాదాపు 60% ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొన్ని చోట్ల మహాకూటమి, ప్రజారాజ్యం చీల్చుకుంటే, మరికొన్ని చోట్ల లోక్ సత్తా, బీజేపీ తామూ ఒక చెయ్యి వేశాయి. దీంతో 35% దాకా ఉన్న తన సాంప్రదాయక ఓటు బ్యాంకు, వివిధ పధకాల ద్వారా లబ్ది పొందిన వారి ఓట్లూ కలిసి కాంగ్రెస్ ఈ సంకుల సమరంలో పైచేయి సాధించింది. ఒకే రకమైన ఓటు బ్యాంకు సమూహాలను అనేక పార్టీలు చీల్చుకుంటే ఏం జరుగుతుందో ఈ ఎన్నికలు చాలా చక్కగా చూపించాయి.

In the end Congress party’s victory in the state is just a statistical magic.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: