అణువు వెలుగు వెనుక చీకట్లు

మనకు అణు విద్యుత్ వెలుగులు లేకపోతే బ్రతకలేం కదూ?

కానీ మనకు వెలుగులు పంచి తాము కొవ్వొత్తులా కాలిపోయే వారుంటారు అని మనలో ఎంతమందికి తెలుసు?

భారత ప్రభుత్వ అణు ఇంధన శాఖ [Department of Atomic Energy – DAE] వారు ఝార్కండ్ లోని జాదుగుడా, దాని పరిసర ప్రాంతాల్లో ఎంత అరాచకం సృష్టిస్తున్నారో ఈ వీడియో కళ్లకు కడుతుంది.

ఇదేనా మనం కోరుకునే “అభివృద్ధి”?

60 ఏళ్లుగా ఈ దేశం సాధించిన “అభివృద్ధి”లో సమిధలైన అత్యధికులు గిరిజనులే కావడం యాధృచ్చికం కాదు.

గమనిక: ఈ విషయాలు మనకు సంబంధించనివని మీలో కొందరు అనుకోవచ్చు అయితే ఇదే అణు ఇంధన శాఖ అటు కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో, ఇటు నల్లగొండ జిల్లాలోని లంబాపూర్- పెద్దగట్టు గ్రామాల వద్ద రెండు యురేనియం గనులు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని గుర్తుంచుకోవాలి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: