ఎన్నికల రోజు కంపెనీ సెలవు ఇవ్వనంటోందా?

(ఈ టపా కొద్దిగా సాగుచేయబడినది )

ఏప్రిల్ 16 మరియు 23 తారీఖుల్లో మన రాష్ట్రంలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని పురస్కరించుకుని మన రాష్ట్ర ప్రభుత్వం ఈపాటికే సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు కేవలం ప్రభుత్వ ఆఫీసులకు, పాఠశాలలకు మాత్రమే కాక ప్రైవేటు సంస్థలకూ వర్తిస్తుంది. సహజంగానే అనేక ప్రైవేటు కంపెనీలు ఆ రోజు సెలవు ఇవ్వడానికి విముఖత చూపిస్తున్నాయి. ఏదో గంటో, రెండు గంటలో పర్మిషన్ ఇస్తాము ఓటేసి రండి అనే కంపెనీలు కొన్నైతే; ఓటు, గీటు జాంతానై ఆఫీసుకు రావాల్సిందే అనే కంపెనీలే ఎక్కువ. ఇదో అలాంటి కంపెనీల మెడలు వంచేందుకు కొన్ని పనిముట్లు.

1) నెగోషియబుల్ ఇన్స్ట్రూమెంట్స్ ఆక్ట్ కింద ప్రభుత్వ సెలవు ప్రకటన జీవో 1672:

pdf

ge_2009-holidays-1672

2) షాపులు, ఫ్యాక్టరీలు ఇతర వాణిజ్య సంస్థలు కూడా మూసివేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు – జీవో  1673

 pdf

ge_2009-holidays-1673

3) 1999 సంవత్సరంలో ఎలక్షన్ కమీషన్ ఎన్నికల రోజు సెలవు ఇవ్వడంపై ఇచ్చిన ఉత్తర్వులు

pdf

Election Commission Letter

4) Sec 135B of the “Representation of People act 1951 ప్రకారం ప్రైవేటు కంపెనీలు కూడా ఎన్నికల రోజు సెలవు ఇవ్వాల్సిందే. (లంకె మీద నొక్కి పూర్తి ఆక్టు చదవండి.)

అదీ సంగతి!!

మీ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు అని మీరు నిట్టూర్చడం వృధా!

(పై సమాచారం మొత్తం నేషనల్ ఎలక్షన్ వాచ్ సభ్యుడు, నా మిత్రుడు రాకేశ్ అందించారు)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: