క్షుద్ర వినోదంపై పోరాటం!

రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కలవరపెట్టిన ఆయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు, టీవీల్లో వచ్చే నేరాలు – ఘోరాలు వంటి క్రైం ప్రోగ్రాములే తనను నేరం చేసేలా పురికొల్పాయని చెప్పాడు.  

ఆర్నెళ్ల క్రితం హైదరాబాదు శివార్లలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు కూడా పోలీసుల ఇంటరాగేషన్ లో తాను టీవీలో క్రైం కార్యక్రమాలు చూసే ఈ హత్యకు ప్రేరణ పొందానని చెప్పాడు.

గత కొన్నేళ్లుగా తెలుగు టెలివిజన్ పై నిరాఘాటంగా కొనసాగుతున్న ఈ క్షుద్ర వినోదం సమాజంపై ఎటువంటి దుష్ప్రభావాన్ని వేస్తుందో ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు. 

రాత్రి తొమ్మిది అయితే చాలు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకూ ఏ చానెల్ లో ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని హడలిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాత్రి ఇంట్లో అన్నం తినే వేళకు మనుషులను చంపడాన్ని ఒక వినోదభరితమైన కార్యక్రమంగా మార్చి వడ్డిస్తున్నాయి తెలుగు వార్తా ఛానెళ్లు.   ఇక ఈ గొప్ప వినోదం మిస్ కాకండి అంటూ పగలూ రాత్రీ తేడాలేకుండా ప్రకటనలతో ఊదరకొడుతున్నాయి.

24 గంటల నిరంతర వార్తా స్రవంతులు ఇప్పుడు ప్రజలకు నిరంతరం దుర్వార్తలు చూపిస్తున్నాయి. తమ చానెల్స్ రేటింగ్ పెరిగితే చాలు అనే ఏకైక లక్ష్యంతో ఎటువంటి గడ్డికరవడానికైనా సిద్ధమైపోతున్నాయి.  

గత కొంతకాలంగా ఈ క్రైం సీరియళ్లపై ప్రజల నుండి వ్యతిరేకత పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సీరియళ్లను నిషేధించాలని కొన్ని విజ్ఞప్తులు కూడా అందాయి. అయితే ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

సమాజంలో ఎటువంటి మార్పు రావాలన్నా అది ప్రజల నుండే రావాలి. నేరాన్ని వినోదం చేసిన తెలుగు వార్తా చానెళ్ల తీరును ప్రజలు ఇకనైనా గట్టిగా నిరసించాలి. ఇటువంటి కార్యక్రమాలు మాకు వద్దు అని చానెళ్ల యాజమాన్యాలకు మనం స్పష్టంగా చెప్పాలి. తీరు మార్చుకోకపోతే ఆయా చానెళ్లను చూడడం మానేస్తామని హెచ్చరించాలి.

ఈ దిశగా మేము చేస్తున్న ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలవండి. మన సమాజం నుండి ఈ క్షుద్ర వినోదాన్ని తరిమికొట్టడదాం పదండి…

చేయాలనుకుంటున్న కార్యక్రమాలు:

1) నేరసంబంధ కార్యక్రమాలను తక్షణం ఆపివేయాలని, నేరాలను వినోదంగా మార్చే ప్రయత్నం మానుకోవాలని టీవీ చానెళ్ల యజమానులకు ఒక బహిరంగ లేఖ రాస్తున్నాం.  

2) ఈ సీరియళ్లను తక్షణమే నిషేధించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి కూడా పంపిస్తున్నాం.

3) ఈ క్రైం సీరియళ్లపై మీడియా విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులతో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.

4) టీవీ చానెళ్ల ఆఫీసుల ముందు వివిధ రూపాల్లో నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాం.

ఈ ఉద్యమమానికి కేంద్రంగా ఒక తెలుగు బ్లాగును మొదలు పెట్టాం (http://spruha.wordpress.com). మీ వంతు సాయంగా ఇందులో మీ భావాలు పంచుకోండి.  మీ అభిప్రాయం రాసి పంపండి. 

 దీనికి సంబందించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి (వివరాలు తెలియజేస్తాం)

నేరం వినోదం కా(రా)దు అనే నినాదంతో ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడదాం రండి

కొణతం దిలీప్

Email : konatham.dileepATgmail.com

Phone: 9849696536

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: