అరుదైన హైదరాబాద్ చిత్రాలు

గూగుల్ ఇటీవల టైం లైఫ్ (TIME-LIFE) సంస్థ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం లైఫ్ సంస్థ వద్ద ఉన్న చిత్రాలను గూగుల్ స్కాన్ చేసి అంతర్జాలంలో ఉంచుతుంది. అలా గూగుల్ వారు ఉంచిన చిత్రాలలోంచి పాత హైదరాబాద్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు లభ్యమవుతున్నాయి.

ఈ చిత్రాలు నిజాం కాలం నాటి హైదరాబాద్ ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇటీవల కొందరు తరచూ అంటున్నట్టు హైదరాబాద్ ను నిన్న మొన్న ఎవరో వచ్చి “అభివృద్ధి” చేయలేదని, అది స్వతంత్రం రాకపూర్వకమే ఒక ఆధునిక నగరమని ఈ చిత్రాలు మరోసారి నిరూపిస్తున్నాయి.

assembly-building

అసెంబ్లీ భవనం

nizamspalace1

రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగులో నిజాం రాజప్రాసాదం

osmania_hospital1

ఉస్మానియా ఆసుపత్రి

british_residency

కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సి భవనం. ఇప్పుడు ఇందులో విమెన్స్ కాలేజీ ఉంది

moazamjahimkt

మోజంజాహి మార్కెట్. (ఒక సారి ఆ వీధి దీపాలు చూడండి!)

secbad_rlystn

నిర్మాణంలో ఉన్న నాంపల్లి సికిందరాబాద్ రైల్వే స్టేషన్

state-central-library

అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరి భవనం

nizams-army

హైదరాబాద్ పురవీధుల గుండా నిజాం అశ్వికదళం కవాతు

boys-playing-cricket

ఒక పబ్లిక్ స్కూళ్లో క్రికెట్ ఆడుతున్న పిల్లలు

village-mkt

హైదరాబాద్ సమీప గ్రామంలో ఒక వారాంతపు అంగడి

tractor-ploughing

ట్రాక్టర్ దున్నుతుంటే ఆసక్తిగా చూస్తున్న రైతులు

lady-soldiers

శిక్షణ పొందుతున్న మహిళా సైనికులు

nizam-time

నిజాం చిత్రంతో టైం పత్రిక ముఖచిత్ర కథనం (పన్నుల రూపేణా ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన సొమ్ముతో నిజాం రాజు ఆనాడు ప్రపంచంలోనే ధనికుడైన వ్యక్తిగా పేరుగాంచాడు )

ఇంకొన్ని అరుదైన హైదరాబాద్ చిత్రాలు ఇక్కడ: https://hridayam.wordpress.com/2008/11/21/rare-hyderabad-photos-2/

గూగుల్ లైఫ్ వారి చిత్రాల భాండాగారంలోని చిత్రాలు చూడాలంటే ఇక్కడికి వెళ్లండి: http://images.google.com/hosted/life

గమనిక: అన్ని చిత్రాలూ టైం లైఫ్ (TIME- LIFE) సంస్థ వారి కాపీరైటు

ప్రకటనలు

1 Response to “అరుదైన హైదరాబాద్ చిత్రాలు”


  1. 1 satya 1:37 సా. వద్ద నవంబర్ 1, 2010

    nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: