వెయ్యి అబద్దాలు ఆడి…

అణు ఒప్పందంపై 13 ఆగస్ట్ 2007 నాడు పార్లమెంటులో చర్చకు బదులిస్తూ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు ఇవి. 

“The Agreement does not in any way affect India’s right to undertake future nuclear tests, if it is necessary in India’s national interest. A decision to undertake a future nuclear test would be our sovereign decision, one that rests solely with the Government of the day. There is nothing in the Agreement that would tie the hands of a future Government or legally constrain its options to protect India’s security and defence needs.”

అణు ఒప్పందం అంశంపై భారత పార్లమెంటులో విశ్వాస పరీక్ష జరిగినప్పుడు మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆవేశపూరితమైన ప్రసంగం (ప్రసంగం చేయలేదు లెండి. ప్రసంగ పాఠం) లోనివీ వాక్యాలు…

“I confirm that there is nothing in these agreements which prevents us from further nuclear tests if warranted by our national security concerns. All that we are committed to is a voluntary moratorium on further testing. Thus the nuclear agreements will not in any way affect our strategic autonomy. “

ప్రతిపక్షాల దేశభక్తిపై వ్యంగ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ఉద్ధరించగలదనే సందేశాన్ని ఆయన ఇచ్చారానాడు.

 

అణు విద్యుత్ గురించి ఏమాత్రం తెలియని వారినుంచి మొదలుకొని అంతో ఇంతో తెలిసిన విద్యాధికుల వరకూ అణు జ్వరం ఆవహించిన ఘడియలు అవి. పార్లమెంటులో మన్మోహన్ సర్కారు అడ్డదారిలో విశ్వాస పరీక్ష నెగ్గిననాడు బయట పేలుతున్న బాణాసంచా చూశాక ఈ దేశ ప్రజలను ఎంత సుళువుగా మన రాజకీయ నేతలు మోసం చేస్తారా అని మధన పడ్డాను నేను. 

టీవీల్లో జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు “అమెరికా అఫ్ఘానిస్తాన్ పై దాడి చేస్తే మనకేంటి? అది అమెరికాకు అఫ్ఘానిస్తానుకూ మధ్య విషయం. అయినా అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలపై దాడి చేయక ముద్దు పెట్టుకుంటారా?” అని రంకెలు వేస్తుంటే ఇంత అజ్ఞానులు మేధావులుగా ఎలా చలామణీ అవుతున్నారో అనుకునేవాణ్ని మనసులో.

ఈ అపర దేశభక్తుల నాటకం రెణ్నెళ్లలోపే బయటపడింది. అమెరికాతో “అణుబంధం” ఎటువంటి మోసపూరిత మాటల గారడీనో నిన్న వాషింగ్టన్ పోస్ట్ బయట పెట్టిన లేఖ తేటతెల్లం చేస్తుంది. 

అమెరికా శాసనవ్యవహారాల సహాయ కార్యదర్శి జెఫ్ఫ్రీ టీ బెర్జనర్ రాసిన ఈ లేఖలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అణు ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఈ లేఖలో మొదటి ప్రశ్నకు జవాబు చదివితే అమెరికా అసలు ఈ ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంటున్నది స్పష్టంగా అర్ధం అవుతుంది.

మనం అణు పరీక్షలు జరిపితే ఏమవుతుందో బుష్ దొరవారు బ్లాక్ ఎండ్ వైట్ లో చెబుతున్నాడు కాస్త చదవండి.

(లేఖ పూర్తి పాఠం ఇక్కడ)

ఇన్నాళ్లూ అటు పార్లమెంటులో ఇటు బయటా నిస్సిగ్గుగా మన్మోహన్, అతడి భజన బృందం చేస్తున్నది అబద్దపు ప్రచారమని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి కావాలి?

ఈ లేఖను బయటపెడితే మన్మోహన్ సర్కారు పతనమవుతుందనే భయంతోనే ఇన్నాళ్లూ ఈ లేఖను దాచామని జంకూగొంకూ లేకుండా చెబుతున్నారు అమెరికన్ అధికారులు.

వెయ్యి అబద్దాలు ఆడి కుదుర్చుకున్న ఈ అణు ఒప్పందం దేశహితం కొరకే అని ఇంకా నమ్మాల్సిందే మనం.

అణు ఒప్పందంపై నా మొదటి పోస్ట్ ఇక్కడ చదవండి 

అణు ఒప్పందం ఒక దృతరాష్ట్ర కౌగిలి

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: