మీ భూమిని రక్షించుకోండి ఇలా…

ఆనాడు విదేశీయులు మన దేశాన్ని బలప్రయోగంతో ఆక్రమించుకుంటే ఇవ్వాళ మన నాయకులే మన దేశాన్ని ఎకరాల చొప్పున వేలం వేస్తున్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుతో మొదలైన ఈ అమ్మకాలు రాజశేఖరరెడ్డి రాకతో విశ్వరూపం దాల్చాయి.

ఒకవైపు ఎపి.ఐ.ఐ.సి, మరో వైపు హుడా, అటుపక్కన హౌసింగ్ బోర్డ్, ఇటుపక్కన డక్కన్ ఇన్-ఫ్రాస్ట్రక్చర్ … ఈ నాలుగు సంస్థలు కలిసి రాజధాని నగరాన్ని వేలంపాటలు వేసి మరీ విక్రయిస్తుంటే, నగరం నాలుగు మూలలా సమాధి రాళ్లలా పాతిన మెట్రో రైలు బోర్డులు అనేకమంది పౌరులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇటు చివర ఉన్న నెల్లూరు నుండి మొదలుకొని అటు చివర ఉన్న విజయనగరం వరకూ కోస్తా కారిడార్ పేరిట లక్షల ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

ఇక ప్రత్యేక ఆర్ధిక మండలాలకైతే  లెక్కే లేదు. పుట్టగొడుగుల్లా రోజుకొకటి పుట్టుకువస్తున్న ఈ సెజ్ ల వల్ల భూమిని, ఉపాధినీ పోగొట్టుకున్న అభాగ్యులు లక్షల్లో ఉన్నారు మన రాష్ట్రంలో.

ఇప్పుడు రాష్టంలో జరుగుతున్నది అచ్చంగా భూయజ్ఞమే. ఇందులో సమిధలు అవుతున్నది సామాన్యులే.

అయితే ఈ మొత్తం కథలోనూ గమనించాల్సిన విషయం ప్రభుత్వం భూసేకరణ జరుపుతున్న విధానం. అడ్డగోలుగా రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం వారికి నష్టపరిహారం పేరిట నాలుగు చిల్లర డబ్బులు విసురుతున్నది. ఎమ్మార్వో, ఆర్డీవో మొదలుకొని కలెక్టర్ వరకూ ప్రజలకు మోసపు మాటలు చెప్పి వారి భూములు కాజేసే బ్రోకర్లుగా తయారయ్యారు.

ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇటు తెలంగాణలో పోలేపల్లి సెజ్ (http://polepally.wordpress.com) అటు ఆంధ్రలో కాకినాడ సెజ్ కు వ్యతిరేకంగా రైతులు వీరోచిత పోరాటం చేస్తున్నారు.

ఇదివరకు జరిగిన అనేక భూసేకరణల్లో చట్టం గురించీ, తమకు గల హక్కుల గురించీ తెలియని ప్రజలు ఎంతో నష్టపోయారు. ఇకముందైనా అలా జరగొద్దనే సంకల్పంతో మానవ హక్కుల వేదిక (Human Rights Forum – HRF) వారు ఒక చక్కని పుస్తకాన్ని విడుదల చేశారు.

పుస్తకం పీడిఎఫ్ ఫైలు లంకె కింద ఇస్తున్నాం. అవసరమైన రైతులు, ఇతర పౌరులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల వారు ఇలా ఎవరైనా దీని కాపీ ప్రింట్ చేసుకోవచ్చు.

నెజ్జనుల కొరకు పుస్తకం పూర్తి పాఠం యూనికోడ్ లో కూడా ఇస్తున్నాం.

దయచేసి ఈ పుస్తకానికి మీ బ్లాగుల, ఈ మెయిల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా నెజ్జనులను కోరుతున్నాం.

పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి

పూర్తి పాఠం యూనికోడ్ లో ఇక్కడ చదవండి

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: