గుండె చప్పుడు వెనుక…

“గుండె చప్పుడు” దిలీప్, “ఒక దళారీ పశ్చాత్తాపం” దిలీప్ ఒకరేనని మాకు ఇప్పుడే తెలిసింది…

నిన్నటి నుండీ నా ఈ-మెయిల్ బాక్స్ లోకి వస్తున్న అనేక మెయిల్స్ సారాంశం దాదాపుగా ఇదే. మిత్రుడు రవి కుమార్ “ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకంపై నిన్న ప్రచురించిన ఒక టపాలో నా బ్లాగ్ విషయం పేర్కొనడం వలన చాలామంది బ్లాగ్ మిత్రులకు ఈ విషయం తెలిసింది.

గుండె చప్పుడు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడే, నా పరిచయం లో “ఒక దళారీ పశ్చాత్తాపం” గురించి రాద్దామనుకున్నాను కానీ సమయం వచ్చినప్పుడు ప్రస్తావిద్దామని ఆ  పని చేయలేదు.

“ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తక విజయం వల్ల నాకు వ్యక్తిగతంగా చాలా పేరు వచ్చింది. అయితే అనేక సామాజిక, రాజకీయార్ధిక విషయాలపై నేను ఇంకా అవగాహనను పెంపొందించుకునే విద్యార్ధి దశలోనే ఉన్నాను. పుస్తకం ఇంత సక్సెస్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణాలు జాన్ పెర్కిన్స్ రాసిన విషయ ప్రాధాన్యత, అతని రచనా శైలీ. 

బ్లాగర్లలో అనేకులు నా అనువాదాన్ని చదివారని నాకు తెలుసు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా గురించి రాసిన “లబ్ డబ్” పేజిలో ఉన్న ఈ-మెయిల్ లింక్ ద్వారా మీరు నన్ను చేరవచ్చు.

ఒక దళారీ పశ్చాత్తాపం  పుస్తకం గురించి మరిన్ని వివరాలకు ఈ బ్లాగును దర్శించండి

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: