నీరో చక్రవర్తి కూడ తెల్లబోతాడేమో!

govt-ad

రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని మనమెవరం చూసి ఉండక పోవచ్చు.

ఆకాల వర్షాలు పడి రాష్ట్రం నలుమూలలా రైతులు, విద్యార్ధులు, ఇతర ప్రజనీకం అష్టకష్టాలూ పడుతుంటే మన అభినవ నీరో చక్రవర్తి గారు చూడండి వాన దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాడు.

మూడు రోజులు ఎడతెరిపి లేకుండా రాష్ట్రం అంతటా పడ్డ వర్షాలు రైతులకు ఎనలేని నష్టాన్ని కలుగజేసాయి. వరి, మిర్చి, ఇంకా ఇతర పంటలు నాశనమయ్యాయి. అధికారిక అంచనాల ప్రకారమే పంట నష్టం విలువ వంద కోట్లకు పైబడి ఉంటుందట.

రాష్ట్ర ప్రభుత్వమేమో నిన్నటి పత్రికల్లో “వరుణ దేవుడికి వందనాలు” అంటూ భారీ ప్రకటనలు ఇచ్చింది. అకాల వర్షం పడితే దాన్ని కూడా తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకునే స్థాయికి మన నేతలు దిగజారారు. రైతులకు నష్ట పరిహారం ఇస్తారో లేదో కానీ ప్రకటనలకు మాత్రం కోట్లు తగలేస్తున్నారు.

అధికారం కళ్లు నెత్తికెక్కిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?  

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: