మూలస్థంభాలు నేలకొరుగుతున్నాయి

 నేను గతంలో రాసిన ఒక పోస్టులోనివీ మాటలు…

“మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు. ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీ దక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ లబ్ది కొరకే అని విమర్శిస్తారు, మరో అడుగు ముందుకేసి “అభివృద్ధి నిరోధకులు” అని ముద్ర గుద్దేస్తారు.” 

 నాయుడూ, వైయెస్సు కలిసి ఇప్పుడు ఆడుతున్న రాజకీయా డ్రామాలో ఈ అంశం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

ఇప్పుడు నాగలి భుజాన వేసుకుని రైతు గర్జనలూ, గాండ్రింపులూ అని రాత్రీ పగలు డిల్లీ నుండి గల్లీ దాకా తిరుగుతున్న మన నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంక్ ఆదేశాలు అనుసరించి మూసేసిన/ఉద్యోగుల తొలగింపు జరిగిన వ్యవసాయ అనుబంధ ప్రభుత్వరంగ సంస్థల లిస్టు ఒకసారి చూడండి:

1) A.P.State Agro Industries Development Corporation Limited

2) AP State Irrigation Development Corporation Limited

3) AP State Textile Development Corporation Limited

4) AP Meat & Poultry Development Corporation Limited

5) AP Small Scale Industries Development Corporation Limited

6) AP Handicraft Development Corporation Limited

7) Nizam Sugars Limited – 8 mills/ distillaries

8 ) 4 co-operative Sugar mills

9) Godavari Fertilizers and Chemicals Limited

10 AP Fisheries Development Corporation Ltd.     

11) Chittoor District Cooperative Milk Producers Union Ltd.

12) AP State Joint Farming Union Ltd.

13) Girijan Cooperative Corporation

14) APCO

15) AP Seeds Development Corporation

16) Non Conventional Energy Development Corporation of AP (NEDCAP)

17) AP State Warehousing Corporation

18 AP SERIFED

19) HACA      

20) AP State Coop Rural Irrigation Corporation Ltd.

21) AP Foods Ltd.

22) AP Markfed

23) AP Forest Development Corporation  

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందులో కొన్నింటి ప్రైవేటీకరణ/మూసివేత తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్థుత వ్యవసాయ సంక్షోభం గురించి జయతీ ఘోష్ వంటి ఎందరో మేధావులు వెల్లడించిన నివేదికల్లో వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలను, Extension Services ఇచ్చే ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడం ఇప్పటి దుస్థితికి ఒక ప్రధాన కారణం అని పేర్కొన్నారు.

ఇందులో AP Meat & Poultry Development Corporation Limited (MAPDEC) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు, దాని అనుబంధ రంగమైన ఇతర పక్షి జాతుల పెంపకంలో (ఉదా: జపనీస్ క్వెయిల్స్ – కౌజు పిట్టలు) ఈ ప్రభుత్వరంగ సంస్థ  రైతాంగానికి గణనీయ సేవలు అందించింది. అయితే లాభార్జన దాని ఉద్దేశ్యం కాదు కాబట్టి సహజంగానే బ్యాలెన్స్ షీట్ చూస్తే దాంట్లో నష్టం వచ్చినట్టు కనపడుతుంది. పౌల్ట్రీ రంగంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రభాగాన ఉన్నదంటే దానిలో ఈ సంస్థ కృషి ఎంతైనా ఉంది. LB నగర్లో (స్టేడియం ఎదురుగా) ఈ సంస్థకు పెద్ద పరిశోధనా విభాగం ఉండేది. స్కూళ్లో ఉన్న రోజుల్లో ఆ రీసెర్చ్ సెంటర్ కు వెళ్ళి ఒక జత కౌజుపిట్టలు తెచ్చి వాటిని ఒక చెక్క డబ్బాలో పెట్టి రెండు నెలలు పెంచాను. అలా ఆ సంస్థతో ప్రత్యక్ష అనుబంధం ఉంది నాకు.

రైతాంగానికి ఉపయోగపడే అటువంటి సంస్థను మూసేయమని వరల్డ్ బ్యాంక్ వారు హుకుం వేశారు. కారణం విస్పష్టమే – మన దేశపు స్వయంసమృద్ధిని దెబ్బతీసి అన్ని అవసరాలకు బహుళజాతి కంపెనీలపై ఆధారపడేటట్టు చేయడం. ఇక సాఫ్ట్ వేర్ కామెర్లు పట్టిన మన బాబుగారు ప్రపంచ బ్యాంక్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. అటువంటి దివాళాకోరు విధానాల వల్లనే ఇవ్వాళ రైతాంగం కోలుకోలేని సంక్షోభంలో పడింది.  వ్యవసాయానికి అండదండగా ఉండాలని మన పెద్దలు స్థాపించిన ఈ సంస్థలను కూడా ముందూ వెనకా చూడకుండా మూసేసిన పెద్దమనిషి “విజన్” ను ఏమని అర్థం చేసుకోవాలి?

కొసమెరుపు: ఎల్బీ నగర్లోని MAPDEC పరిశోధనా కేంద్రం మూసేసి ఆ భూముల్లో కొంత భాగం అమ్మకానికి పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడా భూముల్లో ఆకాశహర్మ్యాలు వెలిశాయి.

పెద్ద పెద్ద అద్దాల భవంతులను చూసి అభివృద్ధి అనుకునే ఇప్పటి తరం ఎప్పుడు అర్థం చేసుకుంటుంది మన దేశపు మూలస్థంభాలు నిశ్శబ్దంగా నేలకొరుగుతున్నాయని? 

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: