చరిత్రపై మరో నెత్తుటి సంతకం!

తెగువగల మరో ఉపఖండపు నేత నేలకొరిగింది…

సరిగ్గా యభై ఆరేళ్ల కిందట పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ ను హత్య చేసిన చోటనే నిన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ కూడా హత్యకు గురి కావడం యాధృచ్చికమే కావొచ్చు కానీ స్వతంత్రం వచ్చి అరవై ఏళ్లు గడచినా పాకిస్తాన్ పౌరులకు ఇంకా ప్రజాస్వామ్యం ఒక అందని పండేనని మరో సారి రుజువైంది.

ఈ సంవత్సరం సద్దాం హత్యతో మొదలై బేనజీర్ హత్యతో ముగిసింది. ఒకదాన్ని ప్రత్యక్షంగా అమెరికా జరిపిస్తే, ఇంకోదానికి ప్రధాన బాధ్యత అమెరికానే వహించవలసి ఉంటుంది. దుబాయ్ లో హాయిగా ఉన్న బేనజీర్ తో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుని పాకిస్తాన్ రప్పించింది అమెరికా. ముషారఫ్ వంటి తోడేళ్లతో స్నేహం చేసి, బేనజీర్ ను తీసుకువచ్చి ముష్కరులకు ఆహారంగా వేసిన పాపం అమెరికాదే.

మన మిత్రులు చాలా మంది అమెరికాతో మన దేశం చాలా స్నేహంగా ఉండాలని చెబుతుంటారు. అణు ఒప్పందం వంటివి కుదుర్చుకుని మన “స్నేహం” ఇంకా మెరుగుపరుచుకోవాలంటారు. వీళ్లే ఇస్లామిక్ టెర్రరిజం విషయం వచ్చేసరికి ఒంటికాలి మీద లేస్తారు. అయితే నేను ఇదివరకే ఎన్నో సార్లు చెప్పినట్టు ఇస్లామిక్ టెర్రరిజం పుట్టడానికి, పెరిగి ఫ్రాంకెన్స్టీన్ రాకాసిలా మారడానికి కారణం అగ్ర రాజ్యమే.   అమెరికాతో స్నేహమంటే ధృతరాష్ట్ర కౌగిలే. 

బేనజీర్ తండ్రి జుల్ఫికర్ అలి భుట్టోని కూలదోసి గద్దెనెక్కిన జియా ఉల్ హక్ తో స్నేహం చేసింది అమెరికా. అకారణంగా జుల్ఫికర్ ను జియా ఉల్ హక్ ప్రభుత్వం ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకుంది అమెరికా. ఇవ్వాళ బేనజీర్ ప్రాణాలు పోవడానికి పరోక్ష కారణం అయ్యింది. ఆమెను చంపింది తాలిబాన్లయినా, ముషారఫ్ అయినా ఇద్దరూ అమెరికా స్నేహితులే కదా.

ఇక టెర్రరిజం పై పోరులో పాకిస్తాన్ ను మిత్ర దేశం గా ఎంచుకున్న అమెరికా గడచిన ఏడేళ్లుగా ఆ దేశానికి ఇచ్చిన 500 కోట్ల డాలర్లలో చాలా భాగాన్ని పాకిస్తాన్, భారత్ పై పోరుకు వినియోగించిందన్న ఈ వార్త చదివాక అయినా మనకు నిజాలు అర్ధం అవుతాయా?

చావు పొంచి ఉందని తెలిసీ మాతృభూమిపై మమకారంతో వచ్చి అమరురాలైన బేనజీర్ కు నా జోహార్లు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: