భూతల స్వర్గమా? భూతాలా స్వర్గమా?

 అమెరికాలో గత పక్షం జరిగిన రెండు కాల్పుల ఘటనలు, గత వారం ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనల గురించి రాద్దామనుకుంటుండగానే మరో దారుణం జరిగిపోయింది. ప్రముఖ తెలుగు రచయిత, విప్లవ రచయితల సంఘం సభ్యుడు అల్లం రాజయ్య కొడుకు కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు చంద్రశేఖర్ రెడ్డి లు దుండగులు జరిపిన కాల్పుల్లో అసువులు బాశారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండేళ్ల కిందట ఇటువంటిదే మరో సంఘటనలో ప్రముఖ పాత్రికేయుడు ఏ.బీ.కే ప్రసాద్ మనవడు కూడా అమెరికాలో ఇదే పద్ధతిలో హత్యకు గురవడం వెంటనే గుర్తుకు వచ్చింది.

అకారణంగానే ఎదుటి మనిషి ప్రాణం తీయడం గత కొన్నేళ్లుగా అమెరికాలో బాగా ప్రబలింది. నిందితులు అందరూ స్కూలు, కాలేజీ పిల్లలో, లేదా యువకులో అవడం అమెరికన్ సమాజంలో యువత ఏ మార్గంలో పయనిస్తున్నదో చెబుతున్నది. అయితే భయపడాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ సంస్కృతి మన దేశానికి కూడా విస్తరిస్తున్నది.

మొన్న డిల్లీ స్కూలు ఘటన, నిన్న హైదరాబాదులో మతి చలించిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్న డిగ్రీ అమ్మాయిని అకారణంగా రాయితో మోది హత్య చేయడానికి ప్రయత్నించడం వంటి విపరీత పోకడలు చూశాక అయినా అమెరికన్ “అభివృద్ధి” నమూనాను మక్కీ కి మక్కీ కాపీ కొట్టి మన దేశంలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్న వారు కళ్లు తెరవాలి.

మనకు కావాల్సింది ఆర్ధిక అభివృద్ధి మాత్రమే కాదు, సామాజిక అభివృద్ధి. అది మనం ఇప్పుడు నడుస్తున్న దారిలో దొరకదు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై, ప్రేమాభిమానాలు మృగ్యమైతే ఎటువంటి రాకాసులు తయారవుతారో లూయిసియానా యూనివర్సిటీ ఉదంతమే ఉదాహరణ. 

ప్రపంచంలోనే డిప్రెషన్ పేషంట్లు అధికంగా ఉన్న దేశం, ప్రపంచంలోనే మాదక ద్రవ్య వ్యసన పరులు ఎక్కువ ఉన్న దేశం, యువతలో హింసాత్మక చర్యలకు పాల్పడే వాళ్లు ఎక్కువ ఉన్న దేశం, విచ్చలవిడి వినియోగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం,  ఇతర దేశ పౌరులపై అత్యంత దారుణ హింసను ప్రయోగించే దేశం అయిన అమెరికాను అనుకరిస్తే రేపటి నాడు మన దేశమూ అలాగే మారుతుందనడానికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే సాక్ష్యం.

వర్జీనియా టెక్ దురాగతం పై నా ప్రతిస్పందన ఇక్కడ చదవచ్చు :

1) నేరం ప్రేమరాహిత్యానిది

2) ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: