ఒక యోధుని గురించి…

che.jpg

తీక్షణమైన ఆ కళ్లు, చురుకైన అతడి చూపులూ గత నలభై యేళ్లుగా కోట్లాదిమంది హృదయాలపై ముద్ర వేస్తూనే ఉన్నాయి. క్యూబన్ ఫొటొగ్రాఫర్ అల్బెర్టో కొర్డా తీసిన అతని చిత్రం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపులర్ ఫొటో. అతని జీవితం గురించి ఏమీ తెలియని వాళ్లెందరో అతని బొమ్మ ఉన్న టీ షర్టు ధరిస్తుంటారు.

అర్జెంటీనాలో పుట్టి క్యూబా విప్లవంలో కాస్ట్రోకు కుడి భుజంలా పని చేసిన చే గెవారా, ఆ తరువాతి కాలంలో అటు ఆఫ్రికాలోని కాంగోలో విప్లవకారులతో కలిసి పోరాడాడు. బొలీవియాలో పోరాటకారులతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తుండగా అక్టోబర్ 9, 1967 నాడు సీఐఏ దళాలకు పట్టుబడ్డాడు. శత్రువుల చేతికి చిక్కి కౄరంగా హత్యగావింపబడే నాటికి ఈ యువ వైద్య విద్యార్ధికి 39 ఏళ్లు.

“సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎల్లలు లేని పోరు జరగాలనీ, ఆ పోరులో ఏ దేశం గెలిచినా అది మన గెలుపే, ఏ దేశం ఓడినా అది మన ఓటమే” అని నలభై యేళ్ల కిందటే ప్రకటించిన గొప్ప దార్శనికుడీ యోధుడు.

2000 సంవత్సరంలో ఈ శతాబ్దిలో పేరుమోసిన 100 మందిలో చే గెవారా ను ఒకడిగా పేర్కొంటూ టైం పత్రిక ఇలా రాసింది. “ఏ అసమానత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ చే బులెట్ ను ముద్దాడాడో ఆ పరిస్థితులు ఈనాటికీ ఉన్నాయి”

అందుకే నలభై యేళ్లు దాటినా చే మనమధ్య సజీవంగానే ఉన్నాడు. తనవి కాని దేశాల్లో పోరాటాలు నడిపించిన చే గెవారా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరులో ఒక గొప్ప స్ఫూర్తి.

చే గెవారా గురించి Youtube లో ఉన్న అనేక వీడియోల్లోంచి ఒకటి ఇక్కడ చూడొచ్చు:

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: