పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!

సత్యనారాయణ రాజు ఉరఫ్ పుట్టబాబా లేటెస్ట్ గారడీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రునిలో “విశ్వరూపం” చూపిస్తానని డంబాలు పలికిన సదరు బాబాగారు విశ్వరూపం కాదుగదా అసలు ఉత్తి చంద్రున్నే చూపలేకపోయాడట. సాయంత్రం నుండీ బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ చానెళ్లు ఊదరగొట్టాయి. బాబా మాటలు విని పోలోమని పుట్టపర్తి విమానాశ్రయానికి తండోపతండాలుగా తరలివెళ్లిన భక్తజనకోటికి సహజంగానే నిరాశే మిగిలింది.

టెలివిజన్ చానెళ్ల వీడియో కనులకు  తన “మాయలు” చిక్కడం మొదలయ్యాక గాల్లోంచి బంగారు గొలుసులూ, శివలింగాలూ సృష్టించడం బాగా తగ్గించాడు మన బాబా. భక్తులను అలరించేందుకు మరోసారి ఈ కొత్త గారడీ ప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ చివరి నిముషంలో కారుమబ్బులు అడ్డుపడడంతో కథ అడ్డం తిరిగింది.

అయినా మబ్బులు అడ్డం రాకుండా చేయలేని బాబా చంద్రునిలో ఎలా కనపడతాడు? ఇప్పుడంత అర్జెంటుగా చంద్రునిలో కనపడాల్సిన అవసరం ఏం వచ్చింది? వంటి లాజికల్ ప్రశ్నలు మనకే కానీ పాపం “అమాయక” బాబా భక్తులకు తట్టనే తట్టవు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

ట్విట్టర్ పై తెలంగాణ

a

గణాంకాలు

  • 93,027 సందర్శకులు

%d bloggers like this: