సేతువు వెనుకున్న హేతువు

రామ సేతుగా పిలవబడుతున్న ఆ భూభాగం మొత్తం పొడవు దాదాపు 48 కిలోమీటర్లు. ఇప్పుడు సేతు సముద్రం ప్రాజెక్టు కోసం ఒక చోట 300 మీటర్ల వెడల్పుతో 12 మీటర్ల లోతుతో ఒక కాలువ తవ్వనున్నారు. అంటే అర్ధం మొత్తం “సేతువు”లో ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినేది 0.006% శాతం అన్నమాట.(చిత్రం చూడండి)

sethu-canal.jpg

భిన్న మతాలూ, సంస్కృతులూ, విశ్వాసాలూ గల పౌరులున్న భారత్ వంటి దేశాల్లో ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వాల, నేతల నిర్ల్యక్షం, స్వార్ధం తోడయితే ఎంత జటిలంగా మారుతాయో రామ సేతు ఉదంతం నిరూపిస్తోంది.

రామ సేతుపై నేను రాయదల్చుకున్న పోస్టుల్లో మొదటి దానికి వచ్చిన విమర్శలకు సమాధానం చెబ్తూ, ఇంకొన్ని విషయాలు చెప్పేందుకు ఈ పోస్టు రాస్తున్నాను.

మొదట మిత్రుడు సుధాకర్ లేవనెత్తిన అంశాలకు నా జవాబు.

1) ఇప్పుడు బీజేపీనెందుకు విమర్శించడం?

మీరు నా మొదటి పోస్టును సావకాశంగా చదివితే నేను బీజేపీని ఎందుకు ఇంతగా విమర్శిస్తున్ననో స్పష్టం అయ్యేది. అసలు రామ సేతు ప్రాజెక్టుకు బీజేపీ అంకురార్పణ చేయకపోతే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న తాజా వివాదం తలెత్తి ఉండేది కాదని నా అభిప్రాయం. రామున్ని గురించి, హిందుత్వ గురించీ పేటెంటు తీసుకున్నట్టు పోజులు కొట్టే బీజేపీ వారికి రామ సేతు ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు ఇప్పటి జ్ఞానం ఏమైందన్న నా ప్రశ్న అప్రస్తుతమెలా అవుతుంది సుధాకర్? సమస్య మూలల్లోకి వెళ్లడమా, లేక మధ్యలో పట్టుకుని కొట్లాడటమా ఏది కరెక్టో నువ్వే చెప్పు.

2) పంజాగుట్ట స్మశానం కదిలించలేరు, తొంబై కోట్ల ప్రజలు నమ్మే విశయం పై సిగ్గు లేకుండా అఫిడవిట్లు సమర్పిస్తారా?

పంజాగుట్టలోనే కాదు, మన దేశంలో ఎక్కడకూడా స్మశానాలు తొలగించలేం. అంతెందుకు కొద్ది మంది స్వార్ధంతో రోడ్లపై నిర్మిస్తున్న మందిరాలు, మసీదులు, చర్చిలూ వాహన చోదకులకు ప్రాణసంకటంగా తయారయినా ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడానికి కారణం రాజకీయనాయకులు మతం ఉపయోగించి మనల్ని రెచ్చగొట్టగలగడమే. అన్నట్టు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో మనవాళ్ల స్మశానవాటిక కూడా ఉన్నది.

ఇక కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ విషయం. నేను నా రెండో పోస్టులో రాద్దామనుకున్నది ఇదే. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామ సేతు ధ్వంసం అవుతుంది కాబట్టి దాని నిర్మాణం ఆపేయాలని తమిళనాడు హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ తో పాటు మరో రెండు పిటీషన్లపై విచారణ మొదలుపెట్టిన సుప్రీం కోర్టు అసలు రామ సేతును ఒక పురాతన కట్టడం అని అనడానికి ఏమైనా అధారాలు ఉన్నాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు జావాబివ్వల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ని కోరింది. ఆ సంస్థ డైరెక్టర్ అయిన సీ. దోర్జీ తన నివేదిక లో ఇలా పేర్కొన్నాడు ” The formation known as Ram Sethu or Adam’s Bridge is not a man-made structure but rather a natural formation made up of sand bars, which are possessed of their particular shape and form due to several millennia of wave action and sedimentation.’

రాముడు ఈ కట్టడాన్ని నిర్మించాడన్న మాటను నిర్ధారించలేమని చెబుతూ ఆ అఫిడవిట్ ఇలా అన్నది ‘The Valmiki Ramayana, the Ramcharitmanas by Tulsidas and other mythological texts, which admittedly form an ancient part of Indian literature, cannot be said to be historical records to incontrovertibly prove the existence of the characters or the occurrence of the events depicted therein’

అంతే కాదు ప్రజల విశ్వాసాల పై ప్రభుత్వానికి గల గౌరవాన్ని కూడా ఆ అఫిడవిట్ పేర్కొన్నది ‘the government is aware of, and duly respects, the deep religious import bestowed upon these texts (the Ramayana and the Ramcharitmanas) by the Hindu community across the globe.’

మనం గుర్తుకు ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్, Archeological Survey of India అనేది ప్రభుత్వానికి చెందిన ఒక శాస్త్రీయ పరిశోధనా విభాగం. Like any scientific institution, it cannot endorse beliefs without a proper proof.

అయితే, కేంద్ర ప్రభుత్వం ASI అఫిడవిట్ ను యధాతధంగా కోర్టుకు సమర్పించకుండా దాన్ని కొంచెం సరిదిద్దవలసింది.

మనకు కాంగ్రెస్ నేతల గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏముంది, నిర్లక్ష్యం ముందు పుట్టి ఆ తరువాత కాంగ్రెస్ నాయకులు పుట్టారు. అందుకే ముందూ, వెనుకా చూసుకోకుండా ఆ అఫిడవిట్ ను సమర్పించి ఇప్పుడు నాలిక కరుచుకున్నారు.

నేనేమీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు అర్జెంటుగా కట్టాలని కోరట్లేదు. దానివల్ల పర్యావరణం పై ఎలాంటి ప్రభావం పడుతుందో జాగ్రత్తగా పరిశిలించాకే ఇటువంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలనేది నా అభిమతం.

కరుణానిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పటితరం వారికి కొంచెం వింతగా అనిపిస్తాయి కానీ, ద్రవిడ ఉద్యమం గురించి, పెరియార్ గురించీ తెలిసి ఉంటే దాని నేపధ్యం అర్ధం అవుతుంది. సరే ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో కరుణానిధి అటువంటి అనాలోచిత వ్యాఖ్యలు చేయవలసింది కాదు.

ఇక “ఉన్న అతికొద్ది నమ్మకాల మీదా…” అన్నావు. ఒక సారి ఆలోచించు, మానవజాతి ప్రస్థానంలో ఎన్నెన్నో నమ్మకాలు ఎవరో ఒకరు ప్రశ్నించడం వల్లనే చెదిరిపోయాయి. అందుకే ఇవ్వాళ అతికొద్ది “నమ్మకాలు” మాత్రమే మిగిలాయి. మనిషికి ప్రశ్నించే గుణమే లేకపోతే ఇప్పటికీ భూమి బల్లపరుపుగానే ఉండేదని మనమంతా నమ్ముతూ ఉండే వాళ్లం.

బాస్ లూ, భారతీయులూ, అపరిచితులకు ఒక ముఖ్య గమనిక:

మీకు రుచించని విషయం కనపడగానే తిట్లు లంకించుకోవడం మీ భావదారిద్ర్యాన్ని చూపుతుంది. ఇది నా వ్యక్తిగత బ్లాగు అయినందువల్ల ఇందులో నా అలోచనలు ఉంటాయి. అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు. అవి నచ్చని మిత్రులు ఎప్పటికప్పుడు తమ వ్యాఖ్యల ద్వారా తమ అభిప్రాయాలు తెలుపుతూనే ఉన్నారు. వారికి నాకు చేతనయినంత మేరకు జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

మీకు నచ్చని విషయం ఉంటే నిర్మొహమాటంగా విమర్శించొచ్చు. కానీ ఊరూ పేరూ లేకుండా తిట్లు లంకించుకుంటే మిమ్మల్ని చూసి జాలిపడడం మినహా ఏమి చేయలేను. ఒకసారి గుండెచప్పుడు పుటలు తిరగేస్తే మీబోటి వారి తాటాకు చప్పుళ్లకి బెదిరిపోయే రకం మనిషిని కానని మీకే అర్ధం అవుతుంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: