రాముడు నమ్మకం, అధికారమే నిజం!

సేతు సముద్రం ప్రాజెక్ట్ పై గతం లోనే ఒక సారి పోస్టు రాశాను. అందులో ఈ వారధిపై బీజేపీ ఎండ్ కో వాళ్లు పనిగట్టుకుని చేస్తున్న అర్ధ సత్యాల ప్రచారం గురించి వివరించాను.

ఆ వ్యాసం ఇక్కడ చదవచ్చు.

ఇప్పుడు మరో సారి రామ సేతు గురించి వివాదం తలెత్తింది. ఓట్ల వేటలో ఇంగిత జ్ఞానం మరచి నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తే మతిపోతోంది నాకు. రాజకీయాలు ఎంత కుళ్లిపోయాయో ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ సేతు విషయం లో భారతీయ జనతా పార్టీ ప్రవర్తన ఇకనైనా మన కళ్లు తెరిపించాలి. తలలూ, నాలుకలు ఉత్తరించే ఆవేశాలు వదిలి ఒకసారి సావకాశంగా కొన్ని నిజాలు మాట్లాడుకుందామా?

మొట్ట మొదటగా చెప్పుకోవాల్సింది రామ సేతు షిప్పింగ్ కెనాల్ చరిత్ర గురించి. దాదాపు 150 ఏళ్ల కిందట బ్రిటీష్ వారు మొదటి సారిగా భారత్, శ్రీ లంకల మధ్య ఉన్న ఈ సన్నని లింకును తవ్వి నౌకలు ప్రయానించేందుకు వీలుగా ఒక కాలువ తవ్వాలని సంకల్పించారు. ఫిబ్రవరి 1997 లో భారత ఉపరితల రవాణా శాఖ ఈ ప్రాజెక్టుకు ట్యుటికోరిన్ పోర్ట్ ట్రస్ట్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. జులై 1997 లో ఈ ప్రాజెక్ట్ పై ప్రాధమిక పర్యావరణ నివేదిక ఇవ్వాలని National Environment Engineering Research Institute(NEERI) ను కోరింది. 1998 డిసెంబర్ లో NEERI తన నివేదిక ఇచ్చింది.

1999 బడ్జెట్లో అప్పటి బీజేపీ నేతృత్వం లోని NDA ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కొరకు 4 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇక 2002 లో అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్-హా లోక్సభ లో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు జాతికి ఎంతో ప్రాముఖ్యత కలిగినదని అభివర్ణించారు.

ఈ ప్రాజెక్టుకు వివిధ ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చే క్రమంలో అప్పటి NDA మంత్రులు అరుణ్ జైట్లీ, తిరునావుక్కరసు, శత్రుఘన్ సిన్-హా, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి ఈ ఫైలుపై సంతకాలు చేశారు. 2004 లో అప్పటి ప్రధాని వాజ్ పేయి ఇది తమిళనాడు ప్రజల చిరకాల స్వప్నం అని వర్ణించాడు.

నిజాలు ఇలా ఉంటే ఇప్పుడు సేతు సముద్రం ప్రాజెక్టు ఏదో UPA ప్రభుత్వమే తలపెట్టినట్టు దొంగ వేషాలు వేయడం బీజేపీ నాయకులకే చెల్లింది. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటే ఏం జరుగుతుందో రామజన్మ భూమి విషయం లో ఒక సారి తెలుసుకున్నా కుక్క తోక వంకర మాదిరి మరో సారి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండు కోవాలనుకుంటోంది బీజేపీ. ఆనాడు అధికారంలో ఉండగా రాముడు గుర్తుకు రాలేదా? ఇప్పటి UPA ప్రభుత్వానికి రాముడన్నా, రామాయణమన్నా లెఖ్కలేదు సరే మరి మీరు అధికారం లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఎందుకు శ్రీకారం చుట్టారు? అప్పుడేమయ్యా ఇప్పటి ఆలోచనలు, ఆవేషాలు? అధికారం లో ఉన్నప్పుడు ఒప్పు అయ్యింది ప్రతిపక్షం లోకి రాగానే తప్పవుతుందీ దేశం లో. ఈ రాజకీయ రాబందులకు కావాల్సింది అధికారమే. దానికోసం రాముల వారితో కూడా రాజకీయం చేయగలరు.

రామ సేతు వివాదం కేవలం ఎన్నికల స్టంటు మాత్రమేనని ప్రజలకు కొద్దిగా ఆలస్యంగానైనా అర్ధం అవుతుంది. అప్పటివరకూ కరుణానిధి లాంటి వారు చేసే అనవసర వ్యాఖ్యల వల్ల సమస్య పక్కదారి పట్టడం కన్నా జరిగే మేలేమీ ఉండదు .

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: