అలా ముందుకు పొండి కామ్రేడ్స్!

people-land1.jpg

ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో భూపోరాటం చేసి అరెస్ట్ అయిన వామపక్షాల కార్యకర్తలు. వరంగల్ సెంట్రల్ జైలు ముందు క్యూ కట్టిన చిత్రం. స్వతంత్రం వచ్చి అరవై యేళ్లవుతున్నా చారెడు నేల కోసం ప్రజలు ఇలా జైలుకు వెళ్లవలసి రావడం మన దురదృష్టం.

రెండో దశ భూపోరాటంలో భాగంగా నిన్న వామపక్షాలు అటు రామోజీ, ఇటు సంఘీ భూముల్లో ఎర్ర జెండాలు పాతాయి. ముఖ్యంగా రామోజీ భూముల విషయంలో ఎన్నోసార్లు అధికారపార్టీ, వామపక్షాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది. ఫిల్మ్ సిటీ లో అసైండ్ భూములు, సీలింగ్ భూములు ఉన్నాయని నిర్ధారణ అయినా సదరు పార్టీలు ఆ భూములను ఎందుకు ఆక్రమించుకోవడం లేదని అధికార పార్టీ నుంది మొదలుకొని సామాన్య మానవుడి దాకా అందరూ సందేహాలు లేవనెత్తిన నేపధ్యంలో ఎట్టకేలకు సీపీఐ, సీపీఎం ఆ కార్యం నెరవేర్చాయి.

ఈ పోరాటం కేవలం సింబాలిక్ అయినప్పటికీ అక్రమాలకు పాల్పడైతే ఎంతటివారైనా ఎర్ర జెండా పార్టీలు వదలవనే సందేశాన్ని నిన్నటి సంఘటన బలంగా వినిపిస్తుంది.

ఇక కొసమెరుపు ఏమిటంటే మొన్నటి దాకా నాకు అసైండ్ భూములు లేవని బుకాయించిన రామోజీరావు ఇప్పుడు నిజం బయటపడే ప్రమాదం ఎదురవడంతో నాగన్ పల్లి గ్రామ శివార్లలో ఉన్న 189/1, 189/ఏ, తదితర సర్వే నెంబర్లలో ఉన్న 14.30 ఎకరాలను హడావిడిగా కొంతమంది రైతులకు దున్నుకోమని అప్పజెప్పాడు. నిన్న ఆ భూముల్లో జెండాలు పాతడానికి వెళ్ళిన వామపక్ష కార్యకర్తలను ఈ “కొత్త” రైతులు కాసేపు నిలువరించారు.

ఇక రామోజీ భూములలో జెండాలు పాతితే ఏమీ అనని పోలిసులు సంఘీ భూముల వద్దకు వచ్చేసరికి మరో విధంగా ప్రవర్తించారు. కార్యకర్తలపై బలప్రయోగం చేసి అరెస్ట్ చేశారు. ఈ దేశంలో అధికార పార్టీకి ఒక రకం చట్టం, ప్రతిపక్ష పార్టీల వారికి మరో రకం చట్టం అమల్లో ఉందని మరో సారి నిరూపించారు పోలీసులు .

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: