610 కొన్నిప్రశ్నలూ- జవాబులూ

నేను రాసిన 610కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి అన్న పోస్టు పై మిత్రులు సత్య సాయి, సుధాకర్ అడిగిన ప్రశ్నలకు నా జవాబులివీ…

1)అమెరికా ఉదాహరణ మీరు ఇచ్చారు కాబట్టి నేను అదే ఉదాహరణ తో వివరించడానికి ప్రయత్నించాను. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధం నిజంగానే ఒకటి కాదు.

రాజధాని ఎవరికి చెందుతుందనే చర్చ మరో సారి చేద్దాం. మనం ఒక ప్రభుత్వ నియమాన్ని, కొందరు వ్యక్తులు ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వోద్యోగాలు పొందడం గురించి మాట్లాడుకుంటున్నాం. Let us stick to this for now.

ముందే చెప్పినట్టు ఈ నిబంధన రాజధానిలో ఉండే ముఖ్యమైన పోస్టులకు వర్తించదు. కాబట్టి బెంగ లేదు.

జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు అన్నారు. కానీ ఏ సంవత్సరం జనాభా ప్రాతిపదికన సత్య సాయి గారూ? రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ జనాభా నిష్పత్తి ఎలా ఉండేది ఇప్పుడెలా ఉంది?

2) స్థానికులకు ఉపాధి భధ్రత అనేది ప్రపంచంలోని అన్ని దేశాలూ, రాష్ట్రాలూ, చేస్తున్నదే. స్థానికులకు అటువంటి రక్షణే కనుక లేకపోతే ఈ పాటికి మొత్తం అటవిక న్యాయం అమలవుతుండేది. “బడితె ఉన్న వాడిదే బర్రె” కాకూడదనే కదా కొన్ని నిబంధనలు పెట్టుకున్నది మనం. ఇది “ఆర్ధిక, సామాజిక, అభివృద్ధి శాస్త్ర సూత్రాలకి అతీతంగా, విరుద్ధంగా” ఎలా ఉందో మీరే చెప్పాలి.

ఇక అక్రమంగా వచ్చిన ఉద్యోగుల పట్ల ఇంత సానుభూతి చూపించగలిగిన మీరు, వారి వల్ల ఉపాధిని కోల్పోయిన వారి పరిస్థితి గురించి కూడా అలోచించాలి…

3) కౌన్సెలింగ్ గురించి నేను చదివినది ఈనాడు లోని ఈ వార్తను
http://www.eenadu.net/archives/archive-22-6-2007/district/districtshow1.asp?dis=hyderabad#4

ఈ వార్తలో టీ.ఆర్.ఎస్. నాయకులు అనుచితంగా ప్రవర్తించినట్టు నాకేమి అనిపించలేదు

4) అవును కేంద్ర ప్రభుత్వ సంస్థల వల్ల cascading effects ఉంటాయి. అవి తెలంగాణా వాల్లే పొందాలని ఇప్పుడెవరు అన్నారు. బాలానగర్ లో, జీడిమెట్ల, నాచారం లో ఉన్న ancilliary industries రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారివి ఎక్కువ ఉన్నాయో ఒక సారి గమనించండి.

5)ఇది వరకు చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ దేశం లో. మీరు భయపడ్డట్టు వేరే దుష్పరిణామాలు ఏమీ జరిగినట్టు గుర్తులేదు. మనం వాళ్లూ తమిళనాడు నుండి విడిపోయారు. ఈ నాటికీ మద్రాస్ లో ఎంత మంది తెలుగు వాళ్లు హాయిగా ఉన్నారో మీకు నేను చెప్పల్సిన అవసరం లేదనుకుంటా?

సుధాకర్ గారూ,

“ఈ జీవో వచ్చి ఇంత కాలం అయితే తెరాస ఇప్పుడెందుకు గడ్డాలు పట్టుకుని బతిమాలుతుంది?” అని ఆడిగారు.

దీనికి రెండు రకాలుగా జవాబు చెప్పొచ్చు.

“జీవో ఇచ్చి పాతికేళ్లయినా అమలు జరగక, దాన్ని అమలు చేస్తామన్న తుగ్లక్ ప్రభుత్వం తలా తోకా లేని అరడజన్ జీవోలు జారీ చేసి, ఉపసం-హరించుకోవడం తో దిక్కుతోచక ఇటువంటి పనులు చేస్తున్నారు.”

లేదా…

“ఈ ప్రశ్న ఏ పోరాటం చేస్తున్న పార్టీనయినా అడగొచ్చు మనం.”

ఉదాహరణకు: బాబ్లీ పైన రచ్చ చేస్తున్న చంద్ర బాబును అడగొచ్చు, గోదావరి జలాల కోసం ఉద్యమిస్తున్న దేవేందర్ గౌడ్ ను అడగొచ్చు, ఇళ్ల స్థలాల కొరకు ఉద్యమిస్తున్న సీ.పీ.ఎం ను అడగొచ్చు.

“ఇన్నాళ్లూ ఏం చేసారు” అని.

కానీ better late then never అని సంతృప్తి పడాల్సి ఉంటుంది బ్రదర్.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: