మీకూ అలాగే అనిపిస్తుందా?

ఉదయం ఏడున్నర అవుతోంది సమయం. ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడొక చినుకు ఇప్పుడొక చినుకూ పడుతున్నాయి. టాంక్ బండ్ పై దాదాపు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది మా క్యాబ్. అక్కడే క్యాబ్ దిగేసి ఆ చినుకుల్లో తడిసిపోవాలని, ఆ అద్భుతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చెయ్యాలనే కోర్కె ను బలవంతంగా అణుచుకున్నాను.

మొన్ననే కొత్తగా వీసీడీ ప్లేయర్ కొన్నాడు మా క్యాబ్ డ్రైవర్ అక్బర్. మా క్యాబ్ లో అందరూ సంగీతం అంటే పడి చచ్చే వాళ్లే. మొన్నటి దాకా మంచి సీడి ప్లేయరే ఉండేది క్యాబ్ లో. సడన్ గా మా డ్రైవర్ కి వీడియో సీడీ ప్లేయర్ కొనలనిపించిందట. పాతిక వేలు ఎందుకు తగలేశావ్ దీని మీద అని కోప్పడాలనిపించింది కానీ చాలా ముచ్చట పడి తెచ్చుకున్నాడు కదా అని ఏమీ అనలేకపోయా. ఇంకో విషయం ఏమిటంటే ఈ వీడియో పాటలను అతను చూడడం వీలుకాదు. స్క్రీన్ కేవలం వెనుక సీట్లో ఉన్నవాళ్లకే కనిపిస్తుంది. నేను ముందు సీట్లో కూర్చుంటా కాబట్టి నాకూ ఓన్లీ ఆడియోనే వినపడుతుంది.

ట్యాంక్ బండ్ దాటి ఎన్.టీ.ఆర్ గార్డెన్ ముదుకు వస్తుండగా మొదలైంది ఆ పాట.

“తుమ్హే పతా తో హోగా…తుమ్హీ సే మై ఫిదా హూన్”

అంటూ షాన్, సునిధీ చౌహాన్ పాడిన ఈ అద్భుతమైన గీతాన్ని జావెద్ అఖ్తర్ రాయగా విశాల్-శేఖర్ సంగీతం సమకూర్చారు.

నాకెందుకో హిందీ పాటల్లో ఉన్నంత గాఢత తెలుగు పాటల్లో, మరీ కొత్త తెలుగు పాటల్లో ఉండటం లేదేమో అనిపిస్తుంది. మన కొత్త తెలుగు పాటలన్నీ పాప్ కార్న్ లాగా అప్పటిదాకా వినడానికి బానే ఉంటాయి కానీ అవి గుండె లోతుల్లోకి వెళ్లవు. హిందీ పాటలు అలా కాదు. ఆనాటి కిషోర్ కుమార్ నుండి నిన్నటి కుమార్ సాను నుండి నేటి షాన్, అద్నాన్ సమీ వరకూ…హిందీ పాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి, స్పందింపజేస్తాయి, ఏదో కొత్త లోకాలకు తీసుకు వెళ్తాయి.

“భీగీ భీగీ రాతో మే ఫిర్ తుం ఆవోనా…” అని అద్నాన్ సమీ పాడుతుంటే నిజం చెప్పొద్దూ గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది.

మీకూ అలాగే అనిపిస్తుందా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: