ఈ హీరోలు విలువల్లో జీరోలు

మొన్న ఫైజాబాద్ కోర్టు “అమితాబ్ రైతు కాడు” అంటూ ఇచ్చిన తీర్పు మనం ఇలవేల్పుల్లా కొలుస్తున్న వారు చట్టాన్నీ, నైతిక విలువలని ఎంతగా ఉల్లంఘిస్తున్నారో మరో సారి బయట పెట్టింది. ఒక సారి మన సినీ హీరోలు, క్రికెటర్లు చేసిన/ చేస్తున్న తప్పుల చిట్టా చూస్తే…

– తాను రైతు నంటూ తప్పుడు ధృవీకరణ ఇచ్చి లక్నోకు 35 కిలోమీటర్ల దూరం లో ఉన్న బారాబంకీ గ్రామం వద్ద 70,000 చదరపు అడుగుల స్థలాన్ని పొందాడు అమితాబ్ బచ్చన్. పత్రాల్లో తన చిరునామా కూడా తప్పుగా ఇచ్చాడని తెలుస్తోంది

– 1993 ముంబై బాంబు పేలుళ్ల తో సంబంధం ఉన్నదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నడనే అభియోగాలతో ఏప్రిల్ 19, 1993 లో సంజయ్ దత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాల కేసులో ఆయన దోషిగా తేలాడు.

– 1998 లో జోధ్ పూర్ లో ఒక షూటింగ్ నిమిత్తం వెళ్లి అక్కడ జింకలను వేటాడినందుకు సినీ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టాబు, సోనాలి బెంద్రే, నీలం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సల్మాన్ కు ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది

– 2002 సెప్టెంబర్ లో తాగిన మైకం లో పేవ్-మెంట్ పై నిద్రిస్తున్న వారి మీదకు కారు నడిపించిన సల్మాన్ ఖాన్ ఒకరి మరణానికి కారణమయ్యాడు. కేసు విచారణ లో ఉంది.

– 2005 లో తనకు అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని సల్మాన్ ఐశ్వర్య రాయ్ ను బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

– అండర్ వరల్డ్ డాన్ ల తో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు సినిమా హీరోయిన్లు మోనికా బేడీ, మందాకిని అరెస్ట్ అయ్యారు

– చోటా షకీల్ తొ స్నేహం నెరపినందుకు ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ భరత్ షా అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్నాడు

– గుల్షన్ కుమార్ హత్య కేసులో బాలీవుడ్ సింగర్ నదీం ప్రధాన నిందితుడి గా రూడి అయ్యింది

– ఒక వ్యాపార లావాదేవీలో విబేధాలు రావడం తో మన బాలకృష్న తుపాకీ తో బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిపాడు. ఇద్దరు బ్రతికి బయట పడ్డారు. బాధితులతో ఒప్పందం కుదుర్చుకోవడం తో కేసు నీరుగారి పోయింది

– ఒక ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించడం, సినీ నటి జయంతి ని, యువ హీరోయిన్ సోనాలి ని చెంప దెబ్బలు కొట్టారనే అరోపణలు, విజయవాడలో ఒక కిడ్నాపింగ్…ఇలా మన మోహన్ బాబు పై ఎన్నో కేసులు, ఆరోపణలు

ఇక క్రికెటర్లది మరో శైలి.

-ఖజానాకు లక్షల రూపాయల పన్ను ఎగవేసారని సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు

– మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అజారుద్దిన్, జడేజా ప్రధాన నిందితులుగా నిరూపణ అవడం తో బహిష్కరణ కు గురయ్యారు.

– క్రికెటర్ మరియు ఎంపీ అయిన నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ ఒక మనిషిని హత్య చేసాడని విచారణలో రుజువైంది

– అలనాటి క్రికెటర్ మనీందర్ సింగ్ ఇటీవలనే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడనే ఆరోపణ పై అరెస్ట్ అయ్యాడు

కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖులే చట్టానికి, నైతికతకు ఇలా తిలోదకాలిస్తే సామాన్యుడికి ఏ సందేశం వెళ్తుంది?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: