ఇదో అబద్ధాల వారధి!

సేతు సముద్రం ప్రాజెక్ట్ పై సుధాకర్ మంచి పోస్ట్ చేశాడు. నాకక్కడ కామెంట్ చేసే వీలు లేకపోవడంతో ఇక్కడ రాస్తున్నాను. (సుధాకరూ…జీమెయిల్ అకౌంట్ లేని వాళ్లు కూడా నీ బ్లాగులో కామెంట్ చేసే సౌకర్యం కల్పించు బాబూ…)

sethu.jpg

అబద్దాలను తేలికగానే పట్టుకోవచ్చు, కానీ అర్ధ సత్యాలతోనే పేచీ అంతా. సేతుసముద్రం ప్రాజెక్ట్ గురించి బీజేపీ, దాని అనుబంధ కాషాయ దళాలు చేస్తున్న ప్రచారంలో కూడా జరుగుతున్నది అదే.

కొన్ని లక్షల యేళ్ల కిందటే రాముడు, వానర సైన్యం సాయం తో ఈ వంతెన నిర్మించాడనీ, దాన్ని “నాసా” కూడా ధృవీకరించిందని సదరు పార్టీ, దాని ప్రచార పత్రికలు ఇల్లెక్కి అరుస్తున్నాయి.

అయితే 17 అక్టోబర్ 2002 నాడు హిందుస్తాన్ టైంస్ పత్రిక వాషింగ్టన్ కరెస్పాండెంట్ ఎస్. రాజగోపాలన్, నాసా అధికారి మార్క్ హెస్ ను ఉటంకిస్తూ, నాసా ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ వంతెన వయస్సును, అది ఏర్పడిన విధానము కనుక్కున్నట్టు వస్తున్న వార్తలు అబద్ధాలని కొట్టి పారేసారు. ఇక ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక 2003 ఫిబ్రవరి 3 నాటి వార్త ప్రకారం భారతీదాసన్ యూనివర్సిటీ లో సెంటర్ ఫర్ రీమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్. ఎం. రామస్వామి గారు ఈ సహజ వంతెన దాదాపు 3500 యేళ్ల క్రితం ఏర్పడి ఉండొచ్చని అంచనా వేశారు.

ఇంకో సంగతి, కొన్ని వేల యేళ్ల కిందట ఇప్పటి ఖండాలన్నీ ఒకే దగ్గర ఉండేవని, తదనంతరం అవి దూరంగా జరిగాయని మనకు సైన్స్ చెబుతుంది, దానికి సరైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సేతు సముద్రం వారధి అనేది జాగ్రఫీ పదజాలం లో ‘Isthmus’ అంటారు. ఇలాంటి ‘Isthmus’ లు ప్రపంచం లో బోలెడు ఉన్నాయి. దక్షిణ, ఉత్తర అమెరికా మధ్య ఉన్న ‘Panama Isthmus’ ను తవ్వి పనామా కాలువను ఏర్పాటు చేసింది అమెరికా. ఇక యూరోప్, ఆసియాల మధ్య ఈజిప్ట్ దేశ తీరం లో ఉన్న సూయెజ్ కాలువ గురించి కూడా మనం చదువుకున్నాం కదా?

ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకూ భారత దేశం లో ఇప్పటి మానవులు 80,000 యేళ్ల నించీ నివసిస్తున్నారని, మరి బీజేపీ వాదులు ఈ వంతెన 17 లక్షల సంవత్సరాల కిందటే కట్టారంటున్నారు. అదెలా సాధ్యమబ్బా?

సేతుసముద్రం ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం దెబ్బ తింటుందనే మాట మాత్రం నిజం. దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: