అంతులేని కథ!

కొత్త అభివృద్ధి నమూనాలో ఎన్నెన్ని వింతలో. మనం కొన్నాళ్ల కిందట ఫ్యాబ్ సిటీ గోల్ మాల్ వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం కదూ. ఇప్పుడా సెం ఇండియా వినోద్ అగర్వాల్ కు ఒక్క రూపాయికి వంద ఎకరాలు (అవును 100 ఎకరాలే!) లీజుకు ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం అంతటితో ఆగక ఫ్యాబ్ సిటీ రెండో అంకానికి తెర తీసింది. స్టొరీ డిటోనే ….మరో దొంగ కంపెనీ…నిబంధనలకు పాతర…అస్మదీయులకు అప్పనంగా వరాలు…చదివి, విని మనకు విసుగుపుడుతుందేమో కానీ ఈ పందికొక్కులకు మాత్రం ఎప్పటికీ ఆకలి తీరదు…

ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో:-

పళ్లెంలో పెట్టి 1100 కోట్లు

మనవాడే భోక్త — ఫ్యాబ్‌సిటీ కో-డెవలపర్‌గా తెరపైకి సత్యవేడు సెజ్‌ ప్రమోటర్లు

ఫ్యాబ్‌సిటీ ప్రాజెక్టు పక్కా రియల్‌ ఎస్టేట్‌ దందా అన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతున్నది. వినోద్‌ అగర్వాల్‌ కంపెనీని రంగం నుంచి తప్పించిన 48 గంటల్లోనే అస్మదీయులతో నిండిన మరో సంస్థను ఫ్యాబ్‌ ప్రాజెక్టు కొత్త ప్రమోటర్‌గా ప్రభుత్వం రంగంలోకి దించుతున్నది. 1100 కోట్ల రూపాయల విలువైన 1100 ఎకరాల స్థలాన్ని కొత్త కంపెనీకి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించేందుకు సిద్ధం అవుతున్నది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్‌ షిప్‌ (పీపీపీ) అనే ముద్దుమాటను అడ్డంగా పెట్టుకుని అడ్డగోలు దందాకు శ్రీకారం చుడుతున్నది. రూపాయికే వంద ఎకరాల లీజు బహుమానంతో తృప్తి చెందిన వినోద్‌ అగర్వాల్‌ సెమ్‌ ఇండియా ఫ్యాబ్‌ సిటీ ప్రాజెక్టు నుంచి మౌనంగా నిష్క్రమించగా వివాదాస్పదంగా మారిన సత్యవేడు సెజ్‌ ప్రమోటర్లు ఆనందంగా రంగంలోకి దిగారు.

చిప్స్‌, సెమికండక్టర్లతో ఏ మాత్రం సంబంధం లేని పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కూడిన కొత్త ప్రమోటర్ల కూటమిలో మీడియా, ఐటీ రంగం తో సంబంధం ఉన్న వ్యక్తి కీలక పాత్రధారి. అసలు సూత్రధారి, మూలవిరాట్‌ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రముఖుడని అనధికారవర్గాలు అంటున్నాయి.హైదరాబాద్‌, మే 2 (ఆన్‌లైన్‌) రాజధాని శివార్లలో నెలకొల్పదలచిన ఫ్యాబ్‌సిటీ ‘లోగుట్టు’ బయట పడింది. మొదట్లో ‘సెమ్‌ ఇండియా’తో ఆర్భాటంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు దాన్ని పక్కకు నెట్టి మరో ప్రమోటర్‌ను తెరపైకి తెచ్చిం ది. మొత్తం 1200 ఎకరాల ఫ్యాబ్‌సిటీలో వంద ఎకరాలను అగర్వాల్‌కు చెందిన సెమ్‌ ఇండియాకు అప్పగించిన ప్రభు త్వం.. మిగతా భూమి హక్కులను కొత్త డెవలపర్‌కు దఖలు పరచబోతోంది.

అగర్వాల్‌ను తప్పిం చాకే అసలు కథంతా నడిచింది. ప్రభుత్వంలోని పెద్దలు తమకు సన్నిహితుడైన ఓవ్యక్తికి చెందిన కంపెనీని తెరపైకి తీ సుకువచ్చారు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన ఈ వ్యక్తి సత్యవేడులో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం పుష్కలంగా ఉండటంతో..అక్కడ ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా వాటన్నింటినీ అధిగమించగలుగుతున్నా రు. ఆ ప్రాంత అధికార పార్టీ నాయకులు ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. యువనేతకు ఆయన సన్నిహితుడు కూడా కావడంతో అనుకున్నవన్నీ ఆగమేఘాలపై జరిగిపోతుంటాయి.

అనుభవం లేకున్నా…

ఆయన మద్దతు ఉన్న సత్యవేడు సెజ్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన ‘సత్యవేడు రిజర్వ్‌ ఇన్‌ఫ్రాసిటీ-(శ్రీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ను ఇప్పుడు ఫ్యాబ్‌ సిటీ కో-డెవలపర్‌గా తెరపైకి తీసుకు వస్తున్నారు. సెమీకండక్టర్‌ యూనిట్ల విషయంలో ఈ సంస్థకు అనుభవం లేకపోయినా ఆకస్మికంగా ఈ కంపెనీ తెరపైకి రావడం పై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రైవేట్‌ సంస్థకు బదిలీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనక ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సత్యవేడు సెజ్‌ ప్రమోటర్లలో కొందరికి ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగిం చుకుని ఈ ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) తందానా అంటోంది. ఫ్యాబ్‌సిటీ సెజ్‌ కోసం ఈ సంస్థ తొలిసారి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని తెరపైకి తెస్తోంది.

వాటాల గుట్టు కాపాడ్డంకోసమే పీపీపీ?

కొత్త డెవలపర్‌తో ఫ్యాబ్‌సిటీ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయటం వల్ల ఈ ఎస్‌పీవీలో ఎవరి వాటా ఎంతెంత అనే విషయం బయటకు పొక్కితే మళ్ళీ వివాదం తలేత్తే అవకాశం ఉన్నందున ‘పీపీపీ’ మార్గాన్ని ఎంచు కున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పద్ధతిలో ఏపీఐ ఐసీ తన వంతు వాటాగా 1100 ఎకరాల భూమిని పెట్టుబడిగా చూపబోతోంది. ‘శ్రీ’ప్రమోటర్లు తమ నిధులతో ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఇతర ఫ్యాబ్‌ యూనిట్లకు భూమిని లీజుకు ఇస్తారని చెబుతున్నా రు. ఏపీఐఐసీ ఎంత రేటుకు ఈ భూమిని ప్రైవేట్‌ డెవలపర్‌కు బదిలీ చేయనుందనే విషయంపై అధికారులు ఎవరూ నోరు విప్పటం లేదు.

ఫ్యాబ్‌ ప్రాజె క్టు మార్కెటింగ్‌ ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమోటర్లకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా రూ.1100కోట్ల విలువైన ఈ 1100 ఎకరాలూ చౌక బేరంతోనే ప్రైవేట్‌పరం కాబోతున్నా యని చెబుతున్నారు. వీటిని ‘శ్రీ’ సంస్థకు అప్పగించేందుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ దిశగా చర్చలు కూడా పురోగమన దశలో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వెసులుబాటును బట్టి మరో రెండు, మూడు వందల ఎకరాల భూమిని ఫ్యాబ్‌సిటీ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

కో డెవలపర్లతో కొంపమునగక తప్పదు

ఫ్యాబ్‌సిటీ డెవలపర్‌ బాధ్యతల నుంచి వినోద్‌ అగర్వాల్‌ను పక్కకు తప్పించిన వెంటనే ఏపీ ఐఐసీనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుందని కొంత మంది అధికారులు తెలిపారు. అయితే, అప్పటికే ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు ‘శ్రీ’ ప్రమోటర్లతో చర్చలు ప్రారంభించారని అధికార వర్గాలు తెలిపాయి. ఫ్యాబ్‌ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ ఇప్పటికే 300 ఎకరాలకు ‘సెజ్‌’ అనుమతి పొందింది. ఇందువల్ల మిగిలిన 900 ఎకరాలకూ సెజ్‌ హోదా పొందటం పెద్ద కష్టం కాబోదని చెబుతున్నారు. ఏపీఐఐసీ తన అధీనంలోని వేలాది ఎకరాల సెజ్‌ లను.. కో-డెవలపర్ల పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేగంగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సంస్థ అడ్డగోలు నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కొంత మంది ప్రభుత్వ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములను ప్రైవేట్‌ పరం చేసేటప్పుడు పోటీతత్వాన్ని పెంచి ప్రభుత్వానికి ఎక్కువ లాభం వచ్చేలా చేయాల్సింది పోయి, ప్రభుత్వంలోని పెద్దలు సిఫారసు చేసిన వారికి ఇంత విలువైన భూములను కో-డెవలపర్స్‌ పేరుతో అప్పగించటం సరికాదని కొంత మంది అధికారులు అంటున్నారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: