దేశాన్నే కాదు మనుషులనూ అమ్మేసే దళారులు

బీజేపీ ఎంపీ బాబూ భాయ్ కటారా అరెస్ట్ తో బయటపడ్డ మనుషుల అక్రమ రవాణా కుంభకోణం దేశాన్నీ, ముఖ్యంగా మన రాష్ట్రాన్నీ కుదిపేస్తున్నది. తెరాస అగ్రనేత ఆలె నరేంద్ర కు కూడా ఈ కుంభకోణం లో పాత్ర ఉన్నట్టు వార్తలు రావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక టీ.ఆర్.ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు సోయం బాపూ రావు, కంభంపాటి లక్ష్మా రెడ్డి, ఇప్పుడు బీజేపీలో చేరిన కాసిపేట లింగయ్య కూడా ఈ అక్రమ రవాణా కేసులో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇంకా అనేక టీడీపీ, బీజేపీ నాయకులు కూడా ఈ కుంభకోణం లో పాత్రధారులుగా ఉన్నారని ఇవ్వాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.

మనుషుల అక్రమ రవాణా, అదీ ముఖ్యంగా మానవ మాంస వ్యాపారం కోసం పసి బాలికల అక్రమ రవాణాలో దేశం లోనే మొదటి స్థానం లో ఉన్న ఘన చరిత్ర మన రాష్ట్రానికి ఉంది. సాక్షాత్తూ మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలే ఈ పనులు చేస్తుంటే ఇటువంటి రికార్డు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?

బోఫోర్స్ నుంచి మొదలై, జే.ఎం.ఎం ముడుపుల కుంభకోణం మీదుగా, తెహెల్కా, శవ పేటికల కుంభకోణం, ప్రశ్నలకు ముడుపులు, నకిలీ స్టాంపులు, హత్యా నేరాలు ఇలా రక రకాల నేరాల్లో ఇరుక్కున్న మన రాజకీయ నేతలు ఇప్పుడు మనుషులను అమ్ముకునే ర్యాకెట్లు కూడా నడిపి చరిత్ర సృష్టించారు.

గమ్మత్తేమిటంటే సచ్చీలత, భారతీయత అంటూ కబుర్లు చెప్పే ఆర్.ఎస్.ఎస్, బీ.జే.పీ రకపు నేతలు కూడా ఇటువంటి చీకటి పనులకు పాల్పడడం.

నాకు పునర్జన్మల పైన నమ్మకం లేదు కానీ వీళ్లను చూస్తే…అసలు ఏ జన్మలో ఏ పాపం చేశామని మనకు ఇలాంటి రాజకీయ రాబందులు దొరికారా అని బలంగా అనిపిస్తుంది.

భవిష్యత్ తలుచుకుంటే భయమేస్తోంది ఫ్రెండ్స్!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: