ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్!

వర్జీనియా టెక్ యూనివర్సిటీలో హత్యాకాండకు పాల్పడ్డ చో సీయుంగ్ హుయ్, ఎన్ బీ సీ వార్తా సంస్థకు పంపిన వీడియోలు, రాతలు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వణుకు రాక మానదు. డబ్బు బాగా ఉన్న వారిపై అతని వ్యాఖ్యలు చదువుతుంటే, అసమ సమాజం మనుషుల్లో ఎటువంటి ద్వేష భావాలు రగిలిస్తుందో అర్ధం అవుతుంది. “మెర్సిడెస్ లు, బంగారు చెయిన్లు ఉన్న వాళ్లు” అంటూ అతను చేసిన వ్యాఖ్యలు సమాజంలోని అంతరాలే అతన్ని ఉన్మాదిగా మార్చాయని స్పష్టం చేస్తున్నాయి.

“అభివృద్ధి” కి ప్రపంచం మొత్తం నమూనాగా నిలబడ్డ అమెరికన్ సమాజం ఎంత మేడి పండు వంటిదో తెలియజెప్పే అనేక గణాంకాలు ఉన్నాయి. పోయినేడాది American College Health Association అక్కడి కాలేజీ పిల్లలపై జరిపిన ఒక సర్వే లో తెలిసిన సంగతులివి. అక్కడి విద్యార్ధుల్లో 8.5% శాతం ఎప్పుడో ఒక సారి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించారట, 15% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారట. ఇక Anxiety Disorders Association of America వారి అంచనాల ప్రకారం అమెరికన్ యూనివర్సిటీల్లొ చదివే 13% విద్యార్ధులు ఏదో ఒక మానసిక చికిత్స పొందుతున్నారట. ఇక సంఘటన జరిగిన వర్జీనియా టెక్ యూనివర్సిటీ లోనే ఏటా 2,000 మంది విద్యార్ధులు వివిధ మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతం అవుతుంది.

మన దేశ లోనూ అటువంటి రోజు రావడానికి ఎంతో కాలం పట్టేట్టు లేదు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు, మన తరువాతి తరం ఒక ప్రేమ, అనురాగమయ వాతావరణంలో పెరిగేందుకు మన వంతుగా చేయాల్సిందేమిటో ఆలోచించాలి.

మొన్న కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 26 ఏళ్ల భారతీయ విదార్ధిని మీనల్ పాంచాల్, చెన్నై కి చెందిన ప్రొఫెసర్ లోగనాధన్ తో పాటు చో సీయుంగ్ హుయ్ కూడా మనల్ని ఆలోచింపజేయాలి…చో హుయ్ చేతిలోకి వచ్చిన తుపాకీ మూలాలు మన సమాజంలో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: