సామాన్యుల రక్తమే ప్రగతి రధానికి ఇంధనం!

ఎస్ ఈ జెడ్ ల పేరిట దాదాపు ఒక సంవత్సరం కింద మొదలైన అభివృద్ధి భీభత్సం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మనుషుల శవాలను పునాది రాళ్లుగా చేసుకునే స్థాయికి వచ్చింది.

ఎస్ ఈ జెడ్ ల పేరిట విదేశీ, స్వదేశీ బడా బాబులకు వేలకొలది ఎకరాలు అప్పనంగా దానం చేయడం, అటుపై ఏ చట్టాలూ లేని ఒక వ్యాపార ద్వీపాన్ని నెలకొల్పుకునేందుకు అనుమతి ఇవ్వడం… దేశవ్యాప్తంగా ఈ విపరీత పోకడల పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతున్నా కూడా లక్ష్యపెట్టకుండా అన్ని రంగుల రాజకీయవేత్తలు కంపెనీల అధిపతుల అడుగులకు మడుగులొత్తడం గత సంవత్సరంగా నిరాఘాటంగా కొనసాగింది.

ప్రజల పక్షం వహిస్తారనుకునే వామపక్ష ప్రభుత్వమే ఈ కంపెనీల మాయలో పడి ప్రజలను పిట్టల్లా కాల్చి చంపి, నరమేధం సృష్టించే సాహసానికి ఒడిగట్టిందంటే, రేపు రేపు మన నాయుళ్లూ, వైయెస్ ల వంటి నేతల రక్త దాహానికి ఇంకా ఎందరు భారతీయుల ప్రాణాలు గాలిలో కలవాల్సి ఉందో..

సామాన్యుల రక్తాన్ని ఇంధనంగా జుర్రుకుని నడుస్తున్న ప్రగతి రధం ఇది…దీని పదఘట్టనల తీవ్రతకు నందిగ్రాం ఒక సంకేతం మాత్రమే…

మార్క్సిస్టులు సిగ్గు పడాల్సిన క్షణాలివి…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: