హవ్వ! ఆఫ్రికా కంటే ఘోరమట

UNICEF

పేపర్ తెరిస్తే అన్నీ అందమైన రంగుల కలలే. 1991 వరకూ మన దేశం లో “లైసెన్స్ రాజ్” ఉండేదట. అదే ఈ దేశాన్ని అభివృద్ది చెందనీయకుండా బంధించి పెట్టిందట. 91 లో నరసిం హా రావూ, మన్మోహన్ సింగూ కలిసి ఆ బంధనాలు తెగ్గొట్టి, మనకి కొత్త అభివృద్ది మంత్రం ఉపదేశించారట.

ఇక చూసుకోండి అప్పటి నుండి అభివృద్ది రేసు గుర్రం లా దౌడు తీస్తోందట!. (నాకైతే ఈ అభివృద్ది కల్లు తాగిన కోతి లా కనిపిస్తోంది.)

10% వార్షిక పెరుగుదల రేటు, రోజు రోజుకీ ఆకాశం లోకి దూసుకెళ్తున్న సెన్సెక్స్, కోట్లు పలుకుతున్న కొండలు, గుట్టలు, మార్కెట్ నిండ సరుకులే సరుకులు…ఇంకేం సాక్ష్యాలు కావాలెహె అభివృద్దికి అని అంటున్నారు చాలా మంది. వచ్చే దశాబ్దానికి మనమే సూపర్ పవర్ అని పగటి కలలు కంటున్నారు అనేక మంది అమాయక దోస్తులు

ఇదంతా బాగనే ఉంది కానీ బాసూ. అభివృద్ది ని కొలవాల్సింది ఆర్ధిక పెరుగుదలను నమోదు చేసే సూచీలను చూసి కాదు. మన దేశపు Non-Economic Indicators ఎలా ఉన్నాయో చూస్తే, మన అభివృద్ది ఎంత డొల్ల కబురో ఇట్టే అర్ధమవుతోది.

ఒక్క సారి విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమాల్లో గత 15 యేళ్ల లో ఏం జరిగిందో పరిశిలించండి. వీటికి సంబందించిన చాలా గణాంకాలు తిరోగమన దిశలోనో లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే టైపు లోనో ఉన్నాయి గత 15 యేళ్లు గా.

తాజా గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, యూనిసెఫ్ కలిసి సం యుక్తంగా నిర్వహించిన ఒక సర్వే లో మన దేశం లోని 46% బాలల్లో పౌష్టికాహార లోపం ఉన్నట్టు కనుగొన్నారు. సబ్-సహారన్ ఆఫ్రికా లో ఇది 35% గా నమోదైంది. అత్యంత పేద దేశంగా అందరూ పరిగణించే ఇథియోపియా కూడ 35-40% తో మనకన్న ఓ మెట్టు పైన ఉండటం మనకు సిగ్గుచేటు.

ఈ సర్వే ఇంకో దారుణ నిజాన్ని కూడా కనుగొంది. 7 యేళ్ల కిందటితో పోలిస్తే మన దేశపు మహిళలు (56%), పిల్లల్లో (79%) రక్త హీనత ఉన్నవారి శాతం పెరిగిందట.

అనేక ప్రాతిపదికలపై ఒక దేశపు అభివృద్దిని అంచనా వేసి రాంకింగులు ఇచ్చే UNDP వారి Human Development Report లో గత కొన్నేళ్లుగా మనకు 126, 127 స్థానాలు దక్కుతున్నాయి! ఇదీ మన Virtual Development కత.

యూనిసెఫ్ ఇండియా ఆరోగ్యాధిపతి మార్జియొ బాబిల్లె మాట్లాడుతూ, “ఆఫ్రికా తో పోలిస్తే ఎక్కువ వనరులున్నాయి భారత్ కు, ఇక్కడ మంచి రవాణా వ్యవస్థ ఉంది, మంచి బడ్జెట్ ఉంది. ఈ సమస్యను వెంటనే రూపుమాపగలిగే శక్తి ఉంది” అని అన్నారు.

అన్నీ ఉన్నాయి గానీ బాబిల్లె దొర వారూ, మా నాయకులు ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం లో, తెగనమ్మడం లో బిజీ గా ఉన్నారు. వారికి పిల్లల ఆరోగ్యం వంటి trivial విషయాలు పట్టించుకునే తీరిక లేదు.

ప్రభుత్వం సరే, తల్లితండ్రులేం చేస్తున్నారని అంటారా. రోజుకొచ్చిన వందలో సెల్ ఫోన్ మెయింటైన్ చెయ్యాలాయె, చీప్ లిక్కర్ లో కోకా కోల/థంప్సప్ కలుపుకొని తాగాలయె, ఒక్క సారి రోగమొచ్చి అప్పుచేస్తే దాన్ని తీర్చడానికి సంవత్సరాలు కష్టపడాల్నాయె.

ఇక పిల్లల ఆరోగ్యాలు పట్టించుకే తీరిక/స్థొమత ఎక్కడ బాసూ?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: