గద్దలు కావవి రాబందులు!

ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది “Vulture is a patient bird” అని. రాబందులకు చాలా ఓపిక ఉంటుందట. ఏదైన జీవి అవసాన దశకు చేరుకుందని తెలిస్తే రాబందులు అక్కడికి వాలిపోతాయి. సదరు జీవి మరణించే దాకా ఓపికగా ఎదురుచూసి ఆ తరువాత భక్షణ మొదలు పెడ్తాయన్న మాట.

బహుళ జాతి సంస్థలనూ ఈ రాబందులతో పోల్చొచ్చు.

దేశీయ పరిశ్రమలు మొత్తం సర్వనాశనం అయ్యే వరకూ ఎదురు చూసే ఓపిక ఉంది వాటికి!.

ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ విదేశీ సంస్థలు గత 15 యేళ్లలో ఎన్ని భారతీయ చట్టాలను మార్పించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఈ దేశ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మన తొలితరం నాయకులు అనేక చట్టాలు చేశారు. అందులో నిత్యావసర వస్తువుల చట్టం ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ లో రీటేయిల్ పందికొక్కులన్నీ దొరికిపోయింది ఈ చట్టం కిందే. ఈ సారి కేంద్ర బడ్జెట్ లో ఆ చట్టాన్ని మార్చాలని “వాణిజ్య సంఘాలు” ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నాయట!.

ఇప్పటికే పలుమార్లు ఆ చట్టాన్ని సవరింపజేసినా ఈ సంస్థలకు ఇంకా కళ్లు చల్లబడలేదు. ప్రజల నిత్యావసర సరుకులను అన్నిటినీ అందులోంచి తప్పించాలని, తద్వారా వాటిని యధేచ్చగా నిల్వ చేసుకుని అమ్ముకునే వీలు కల్పించాలని వాళ్లు తెస్తున్న వత్తిడి చూస్తుంటే నాకు రాబందులే గుర్తొస్తున్నాయి.

హైదరాబాదు లో మాల్స్ పై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ దాడులు ఇంకా కొన సాగుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న మరో రీటెయిల్ ‘దిగ్గజం’ (మత్త గజం?) -బిగ్ బజార్ దాని ప్రధాన ఇన్వెస్టర్ అయిన పాంటలూన్ రిటైల్ కూడా రెడ్ హాండెడ్ గా దొరికి పోయాయి.

ఇక వాల్ మార్ట్ భారత్ ప్రవేశం పై సోనియా గాంధీ గారు కూడా ఆందోళన చెంది ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసారనీ, PMO వారు పరిశ్రమల శాఖను కొన్ని clarifications కోరుతూ లేఖ రాసినా సదరు శాఖ పట్టించుకోలేదట…వాల్ మార్టా మజాకా…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: