నడి రోడ్డుపై రుద్రమదేవి!

మొన్న శుక్రవారం నాడు ఆఫీసునుండి ఇంటికి కాబ్ లో వెళ్తున్నాను. సమయం సాయంత్రం దాదాపు 6:30 అవుతోంది. హిమాయత్ నగర్ లో ఇద్దరు కొలీగ్స్ ను దించి కాస్త ముందుకు వెళ్లానో లేదో ముందు ఒక చిన్నపాటి ట్రాఫిక్ జాం. ఏమిటని గ్లాసు దించి చూస్తే అక్కడో వింత సన్నివేశం.

ఇద్దరు అమ్మాయిలు ఒక వ్యక్తి తో (బహుశా ఆటో డ్రైవర్) గొడవ పడుతున్నారు. దాదాపు 20 యేళ్లుంటాయేమో ఆ అమ్మాయిలకు. ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన అమ్మాయిల్లా ఉన్నారు. పంజాబీ డ్రెస్సులో ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి ఆవేశం పట్టలేక సదరు పురుషుడి గల్లా పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పారేసింది. చుట్టూ ఉన్న జనం బిత్తరపోయి ఈ వినోదాన్ని చూస్తున్నారు. ప్యాంటు, షర్టూ వేసుకుని ఉన్న ఇంకో అమ్మాయి తన స్నేహితురాలి చెయ్యి పట్టి వారించి వెనక్కి తీసుకువెళ్లింది.

తేరుకోవడానికి నాకో రెండు నిముషాలు పట్టింది

పల్లెటూర్లలో (కొండకచో పట్నాల్లోనూ) తాగి గొడవపడే మొగుళ్ల పై చీపురు తిరగేసే మహిళల గురించి ఎరుగుదును. కానీ నడిరోడ్డు పై ఒక మగవాడిని ఈ లెవెల్లో వాయించిన అపర రాణీ రుద్రమ దేవిని చూడడం మాత్రం ఇదే మొదటి సారి.

సమాజం మారుతోందా? ఒక వేళ ఆ పురుషుడు ఏ ఆటో డ్రైవరో కాక ఒక ఉన్నత ఆర్ధిక స్థాయికి చెందిన మనిషైనా ఈ అతివలు ఇలాగే వాయించేవారా? ఆ ఇద్దరు అమ్మాయిలూ మధ్య తరగతికి చెందిన వాళ్లైతే కూడా ఇలాగే చేసేవారా? ఈ సంఘటన ఇంతటితో ముగిసిపోతుందా లేక అతనేమైనా పగ పెంచుకుంటాడా? Class Dynamics, Gender Dyamics… ఏది ప్లే చేసిందిక్కడ…

ఎన్నెన్నో ప్రశ్నలు…నా మనసులో…

ఒక చిన్న సంఘటన అలోచనల తేనెతుట్టెను కదిపింది…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: