స్టాక్ మార్కెట్ లో టెర్రరిస్టుల డబ్బులు!

గుర్తుందా మీకు? ‘ మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా ‘ అని ఫిబ్రవరి 9, 2007 నాడు నేను ఒక పోస్టు చేశాను. అందులో ఇలా రాశాను…

“ప్రపంచం లో అనేక చిన్న దేశాలు Tax Havens గా మారిపోవడం కొత్తేమీ కాదు. కేమాన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్ వంటి పన్నురహిత దేశాలు ఎన్నో ఉన్నాయి. అవినీతి, అక్రమ వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, స్మగ్లింగ్, ద్రగ్స్, మానవ మాంస వ్యాపారం చేసేవాళ్లూ, టెర్రరిస్టులూ… ఇలా అనేక చీకటి వ్యవహారాల డబ్బు ఈ టాక్స్ హావెన్స్ కు చేరుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ చీకటి వ్యాపారాలని నిస్సిగ్గుగా ప్రభుత్వమే ప్రోత్సాహించడం దారుణం.”

ఇప్పుడా మాటలు నిజమేనని చెబుతున్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎం. కె నారాయణన్. అనేక టెర్రరిస్టు సంస్థలు బోగస్ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. మ్యూనిచ్ లో జరిగిన ఒక సెక్యూరిటీ పాలసీ కాన్ ఫరెన్స్ లో ఆయన ఈ మాటలు చెప్పారు.

మొత్తం కధనం ఇక్కడ చదవండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: