వేళ్లు వెతుక్కుంటున్న మనుషులు

కృషి ఉంటే మనుషులు రుషులవుతారో లేదో నాకు తెలియదు కాని మహా పురుషులు మాత్రం తప్పక అవుతారు. అటువంటి కొందరిని మరో సారి గుర్తుచేసే ప్రయత్నం ఇది. తోటి వారు గేలిచేసినా, అపనమ్మకం గా చూసినా వెరవక కొత్త బాట లో నడిచిన గొప్ప మనుషులు వీరు. చీకట్లను తిడుతూ కూర్చోవడం కన్న తమ వంతుగా చిరు దివ్వెను వెలిగించిన వారు వీరు.

రాజేంద్ర సింగ్:

1985 లో ఆరుగురు యువకులు తరుణ్ భారత్ సంఘ్ పేరిట నెలకొల్పిన ఒక సామాజిక సేవా సంస్థ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శం గా నిలిచింది. నిత్యం కరువు బారిన పడి ఎడారిగా మారిన రాజస్తాన్ లోని అల్వార్ జిల్లాలో తరుణ్ భారత్ వారు చేసిన కృషి ఫలితంగా అక్కడి ప్రాంత రూపు రేఖలే మారిపోయాయి. ఎండిపోయిన నదులూ నీటితో కలకలలాడాయి.

before_1.jpg

after_2.jpg

వారి ఉత్తేజభరిత ప్రయత్నం ఇక్కడ చదవండి

అన్నా హజారే

ఇక మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హజారే చేసిన అద్భుతం ఇప్పటికే దేశ విదేశాల్లో పేరుగాంచింది. ఒక మిలిటరీ ట్రక్ డ్రైవర్ గా పనిచేసిన అన్నా ఎన్నో యేళ్లుగా ప్రభుత్వం చేయలేని పని తన సంకల్పంతో చేసి చూపించాడు.

అతని గాధ ఇక్కడ చదవండి

టింబక్టు ఎన్ క్లేవ్

మన రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ అనంతపూర్ జిల్లాలో చెన్నకొత్తపల్లి దగ్గర 1990 లో మొదలైన ముగ్గురు యువతీ యువకుల ప్రయత్నమే టింబక్టు ఎన్ క్లేవ్. మేరీ, జాన్, బబ్లు అనే ముగ్గురు కలిసి ఈ ఎడారి సీమలో ఒక ఒయాసిస్సు ను తయారు చేశారు.

timbaktuviewold.jpg

ఇదివరకు టింబక్టు పరిసరాలు

timbaktutoday.jpg

ఇప్పటి టింబక్టు పరిసరాలు

వారి చక్కని ప్రయత్నం గురించి ఇక్కడ చదవండి

డీ. వీ శ్రీధరన్

రోజూ పేపర్లు తెరిస్తే హత్యలు, అవినీతి, అక్రమాలు….వీటిని చూసి అందరి లాగే కలత చెందాడు డీ. వీ శ్రీధరన్. అసలు దేశం లో చాలా మంది కార్య దీక్షులు చేస్తున బృహత్తర కృషి గురించి. అది ఇతర భారతీయులకి ఇవ్వగల పాజిటివ్ స్పిరిట్ గురించీ నలుగురికీ చెప్పాలనే తపన తో GoodNewsIndia.com మొదలుపెట్టాడు.

స్వయంగా ఒక 6 ఎకరాల పనికిరాని భూమిని తీసుకుని దాన్ని అన్నివిధాలా ప్రకృతి సహజం గా తీర్చిదిద్దాడు. ఆ సైటు ఇప్పుడు చెన్నై నగరానికి మరీ దగ్గర అవడం తో మళ్లీ అక్కడికి 80 కిలోమీటర్ల దూరం లో ఇంకో మారుమూల ప్రాంతం లో ఒక బంజరు భూమిని కొని దాన్ని ప్రకృతి సహజంగా, పంటలు, చెట్ల తో ఒక స్వయం చాలిత ప్రాజెక్ట్ గా మలిచేందుకు కృషి మొదలు పెట్టాడీ 65 యేళ్ల యువకుడు.

dvsridharan.jpg

పాయింట్ రిటర్న్ అనే పేరుతో శ్రీధరన్ గారు చేస్తున్న స్పూర్తి దాయక ప్రయాణాన్ని గురించి ఇక్కడ చదవండి

ఇప్పుడు మనమంతా చెయ్యాల్సిన పని ఇదే!. మన వేళ్లు వెతుక్కోవడం. అవి ప్రకృతిలోనూ, దాన్నుండి ఉద్భవించిన సంస్కృతి లోను ఉన్నాయని తెలుసుకోవడం. పర్యావరణ స్పృహ తో ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడం.

నోట్: చాలా ఎన్ జీవో లు ఇటువంటి సంఘ సేవా కార్యకలాపాలు చేస్తుండొచ్చు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ ఎన్ జీవోలు సంఘ సేవ ను కూడా ఒక వృత్తి లా మార్చేశాయి. ఎన్ జీవోలు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కి ముద్దు బిడ్డల్లా మారాయి. ప్రభుత్వాన్ని కీలక బాధ్యతల నుండి తప్పించి ఆ పనులని ప్రైవేటు వారి చేతుల్లో పెట్టే క్రమంలో ఎన్ జీవోలు బాగా పనికి వస్తున్నాయి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: