నిరాహారదీక్ష విరమించండి కృష్ణారావు గారూ!

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం గత ఇరవై రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న బీ.హెచ్.ఇ.ఎల్ మాజీ ఉద్యోగి కృష్ణా రావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను మళ్లీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత ఇరవై రోజులలో ఆయనను ఆసుపత్రికి తరలించడం ఇది రెండో సారి. ఆయన ఆసుపత్రిలోనూ తన దీక్ష విరమించడానికి ససేమిరా అంటున్నారు.

ఆయన ఇంటిని దర్శించి దీక్ష విరమించమని కోరిన వారి లో టీ.ఆర్.ఎస్ నేత నరేంద్ర, సినీ నటి విజయ శాంతి ఇంకా పలువురు తెలంగాణ నేతలు, ఉద్యమకారులూ ఉన్నారు.

ఎందరు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా, తెలంగాణ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే వరకూ తన దీక్ష విరమించనని శ్రీ కృష్ణా రావు గారు మొండి పట్టుదలతో ఉన్నారు.

నేటి రాజకీయ వ్యవస్థలో ఇటువంటి ఆందోళనలను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు.

కృష్ణా రావు గారూ. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటే అది రేపో ఎల్లుండో తప్పక వస్తుంది. దానికి మీ వంటి వారు ముందుండి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అంతే కాని మీరు ఇలా నిరాహార దీక్ష చేపట్టి వెలకట్ట లేనంత మీ విలువైన ప్రాణాలు పణంగా పెట్టే ప్రయత్నం చెయ్యొద్దని మీకు చేతులెత్తి దండం పెడుతున్నా.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

ట్విట్టర్ పై తెలంగాణ

a

గణాంకాలు

  • 93,027 సందర్శకులు

%d bloggers like this: