బ్లాగు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు

ఉదయం వర్డ్ ప్రెస్ లోకి లాగిన్ అయి ఎక్కడెక్కడి నుంచి క్లిక్స్ వచ్చాయో చూస్తుంటే ఒక లింక్ నా దృష్టిని ఆకర్షించింది. IndiBloggies సైటు నుంచి వచ్చిన ఆ లింకును పట్టుకుని వెళితే ఒక ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది.

గుండె చప్పుడు బ్లాగ్ మొదలుపెట్టిన 50 రోజుల్లోనే IndiBloggies Best Indic Blog (Telugu) nomination పొందడానికి ముఖ్య కారణం బ్లాగు మిత్రులు అందించిన ప్రోత్సాహం. లేఖిని, కూడలి, తేనెగూడు ల వెన్నుదన్ను. ముఖ్యంగా బ్లాగును నామినేట్ చేసిన మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింతగా పెంచింది. ఏదో టైంపాస్ కోసం కాకుండా, కొన్ని విషయాల పైన అలోచింపజేసే పోస్టులు చేస్తూ ఒక అర్ధవంతమైన చర్చను రేకెత్తించాలనే ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను.

నామినేట్ అయిన తోటి బ్లాగర్లకూ అభినందనలు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: