మన్మోహన్ సింగ్ ను నియమించింది అమెరికానా?

prattler.jpg

అవుననే అంటున్నారు సుప్రసిద్ధ మార్క్సిస్టు ఆర్ధికవేత్త, ఇందిరా గాంధీకి సలహాదారుగా వ్యవహరించిన అశోక్ మిత్రా. ఇంకా మార్కెట్లోకి రాని ‘A Prattler’s Tale’ అనే పుస్తకం లో మిత్రా ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. మొన్న దక్కన్ క్రానికల్ పత్రికలో ఎం.జె. అక్బర్ ఈ పుస్తకాన్ని పరిచయం చేశాడు.

1991లో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి మన దేశం ఆర్ధిక స్థితి బాగోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎంతో కాలంగా గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న (అబ్బా అలోచిస్తే ఎంత చక్కగా సరిపొయిందీ ఉపమానం!) IMF, World Bank రెండూ రంగం లోకి దిగాయి. మీకున్న ఇబ్బందికర పరిస్థితి నుండి తప్పించాలంటే మేము చెప్పినట్టు వినాల్సిందేనని మన నేతల మెడలు వంచాయి. మేము చెప్పినట్టు పాలసీలు మార్చాలని హెచ్చరించాయి. అందుకు గ్యారెంటీగా మేము సూచించిన వ్యక్తినే ఆర్ధిక మంత్రిగా నియమించాలని షరతు పెట్టాయి. తత్ఫలితమే మన్మోహన్ సింగ్ నియామకం.

మొదటినుంచీ మంచి అమెరికా విధేయుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ కి అప్పటికే ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులకి పనిచేసిన అనుభవం ఉంది.

ఇదివరకు వికీపీడియాలో ఉన్న సింగుగారి బయోడేటాలో ఈ విషయాలు చాలా డీటైల్డ్ గా ఉండేవి. ఈ మధ్య కనిపించట్లేవెందుకో!

ప్రపంచ బ్యాంకు, ఐ. ఎం. ఎఫ్ లలో పని చేసిన అనుభవమున్న మన్మోహన్ సింగు ను స్వయానా వాషింగ్టన్ పెద్దలే నియమించారన్న ఈ వార్త చాలా ఆందోళన కలిగిస్తోంది.

మనకు వచ్చింది నాం కే వాస్తే స్వాతంత్రమేననీ, ఇంకా మన పాలనా పగ్గాలు ఏడేడు సముద్రాల అవతల వాషింగ్టన్ పెద్దల చేతిలోనే ఉన్నాయనీ మరోసారి రుజువైంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: