ఎవరో ఒకరు…ఎపుడో అపుడు…

watadaehren.jpg.

మొదటి అడుగు వేయాలంటే చాలా గుండెధైర్యం ఉండాలి. అదో అటువంటి గుండె ధైర్యం మెండుగా ఉన్నవాడు మన ఎరెన్ వతాద. అమెరికన్ సైన్యంలో ఫర్స్ట్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న వతాద ఇరాక్ యుద్ధానికి వెళ్లనని నిరాకరించినందుకు ఇవ్వాళ అమెరికాలో కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటున్నాడు అతనికి దాదాపు నాలుగేళ్లవరకు జైలుశిక్షపడే అవకాశం ఉంది.

ఇరాక్ పై నా దేశం చేస్తున్నది అధర్మ యుద్ధమని వతాద అంటున్నాడు. ఇరాకీయులను ఊచకోత కోయడం, చిత్రహింసల పాల్జేయడం అమానుషమనీ, అందులో తాను పాలుపంచుకోలేనని వతాద తేల్చిచెప్పాడు.

protests.JPG

వతాదకు మద్దతుగా అమెరికాలో అనేక ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి.

ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన మొదటి అమెరికన్ సైనికుడికి హృదయపూర్వక అభినందనలు.

వతాదకు మద్దతుగా నెలకొల్పిన ఈ వెబ్ సైటును ఒకసారి దర్శించండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: