కొంచెం నోరు మూసుకుంటావా లగడపాటీ!

SRC Coverpage

మొదటి ఎస్సార్సీ విశాలాంధ్రనే ఏర్పాటు చెయ్యమమని సిఫార్స్ చేసిందని ఇటీవల విజయవాడలో స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒక ప్రకటన చేశారు.

తెలంగాణ విషయంలో చాలా కాలంగా జరుగుతున్న అబద్దపు, అర్ధసత్యపు ప్రచారంలో ఇది ఒక తాజా అంకం మాత్రమే.

అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంతకుముందులా మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేరు.

లగడపాటి చేసిన వక్రీకరణకు వెంటనే సమాధానం రాద్దమనుకున్నాను కాని సరైన సాక్ష్యంతో రాస్తే బాగుంటుందని ఆగాను.

కొన్ని విషయాలు ఎంత తెలిసినవైనా వాటిని మరో సారి నెమరువేసుకునేటప్పుడు చాలా భావోద్వేగం కలుగుతుంది. మొదటి ఎస్సార్సీ నివేదిక చదువుతుంటే కూడా ఎన్నో భావాలు నన్ను కమ్మేశాయి. తెలంగాణకు జరిగిన వంచన, ద్రోహం, ఒక ప్రాంతంవారికి ఒనగూడిన ప్రయోజనాలు అన్నీ కళ్లకు కట్టినట్టయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే ఒక మోసపు పునాది పై జరిగిందని మొదటి ఎస్సార్సీ నివేదిక చదివితే ఇట్టే అర్ధం అవుతుంది

నిన్న ఆంధ్రజ్యోతిలో కట్టా శేఖర్ రెడ్డి గారు లగడపాటి వ్యాఖ్యలకు సమాధానం రాశారు.

కింద చూడండి…ఎలాంటి ఇంటర్ప్రెటేషన్లూ లేవు , అచ్చంగా మొదటి ఎస్సార్సీలోని పేజీలనే స్కాన్ చేసి పెట్టాను. చదవండి. తెలంగాణ ఒక ప్రాంత ప్రజల న్యాయమైన కోరిక అని, ఆ రాష్ట్రాన్ని సత్వరమే ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నియమించిన ఒక అత్యున్నత స్థాయి సంస్థ 50 ఏళ్ల కిందటే తేల్చిచెప్పింది.

కమీషన్ తన 108వ పేజీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఇలా అన్నది

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉమ్మడి ఆకాంక్షలున్నాయి. అవి ఈ రెండు ప్రాంతాల ప్రజలను దగ్గరికి తీసుకు వస్తాయని ఆశించవచ్చు. అయితే ఒకవేళ అలాంటి వాతావరణం ఏర్పడక, తెలంగాణలో ప్రజాభిప్రాయం రెండు రాష్ట్రాల కలయికకు వ్యతిరేకంగానే వున్నట్టయితే తెలంగాణను ఎప్పటికి ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి

అయినా ఇటువంటి కమీషన్ల రిపోర్టులను ఉటంకించేటప్పుడు తుది తీర్పులను చూడాలి కానీ అది పరిశీలించిన ఒక వాదనను పట్టుకుని అదే దాని సారమని అబద్దపు ప్రచారానికి పాల్పడితే ఎలా రాజగోపాల్?

మొదటీ ఎస్సార్సీ 257 పేజీ లో ఇచ్చిన రెకమండేషన్లు ఇవీ.

4. హైదరాబాద్: రాయ్ చూర్, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడదీయాలి. మిగతా రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా వ్యవహరిస్తూ అలాగే కొనసాగించాలి. దీనిలో తెలుగు మాట్లాడే జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ (ఖమ్మం తో సహా), కరీం నగర్, అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మరియు మెదక్ తో పాటు బీదర్ జిల్లా, కృష్ణా జిల్లాలో (ఇప్పటి నల్గొండ జిల్లా) ఉన్న మునగాల ప్రాంతం ఇలా ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రం 1961 లో జరిగే సాధారణ ఎన్నికల తరువాత, హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అమోదిస్తే ఆంధ్రతో కలవవచ్చుఎస్సార్సీ అన్ని రకాల వాదనలూ విన్నది. పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలనీ, కొత్తగా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలనీ, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యాలనీ ఇలా రకరకాల వాదనలని విని అన్నిటి పై వ్యాఖ్యానిస్తూ చివరికి ఇచ్చిన రెకమండేషన్లలో తెలంగాణా (హైదరాబాద్) ఏర్పాటు చెయ్యాలని విస్పష్టంగా ప్రకటించింది.

ఇప్పుడు లగడపాటి కేవలం విశాలాంధ్రకు మద్దతుగా ఎస్సార్సీ రాసిందని ఒక అబద్దపు ప్రచారానికి దిగుతున్నాడు.

ఈ పేజీలు చదివైనా కొంచెం నోరు మూసుకుంటావా లగడపాటీ?

SRC Page 105

SRC Page 105

SRC Page 106

SRC Page 106

SRC Page 107

SRC Page 107

SRC Page 108

SRC Page 108

SRC Page 109

SRC Page 109

Final Recommendations

SRC Page 257

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: